ది కేరళ స్టోరీ 2లో బీఫ్ తినే సీన్- డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ షాకింగ్ కామెంట్స్- కనీసం కిచిడీ కూడా తినిపించరు అంటూ ఆగ్రహం!
వివాదాస్పద చిత్రం ‘ది కేరళ స్టోరీ 2’పై ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఘాటుగా స్పందించారు. ఈ సినిమాను కేవలం డబ్బు కోసం, సమాజాన్ని విభజించడానికి తీసిన ‘ప్రచార చిత్రం’గా ఆయన అభివర్ణించారు. కేరళ ముఖ్యమంత్రి కూడా ఈ సినిమాను ఖండించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ‘ది కేరళ స్టోరీ’కి సీక్వెల్‌గా వస్తున్న ‘ది కేరళ స్టోరీ 2’ (The Kerala Story 2) విడుదలకు ముందే వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించిన ది కేరళ స్టోరీ 2 ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.

అనురాగ్ కశ్యప్ ఘాటు విమర్శలు
ముఖ్యంగా ఒక ముస్లిం కుటుంబం, ఒక అమ్మాయికి బలవంతంగా గొడ్డు మాంసం (బీఫ్) తినిపించే సన్నివేశంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొచ్చిలో జరిగిన ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ వేడుకకు హాజరైన దర్శకుడు అనురాగ్ కశ్యప్‌ను మీడియా ప్రతినిధులు ఈ సినిమా ట్రైలర్ గురించి ప్రశ్నించగా, ఆయన ఏమాత్రం మొహమాటం లేకుండా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు.
బీఫ్ అలా తినిపిస్తారా?
"అదొక చెత్త సినిమా, పక్కా ప్రచార చిత్రం (Propaganda). అంతా అబద్ధం. ఎవరైనా బీఫ్ అలా తినిపిస్తారా? కనీసం కిచిడీ కూడా ఎవరూ అలా తినిపించరు. ఇదంతా ఒక నాన్సెన్స్" అని అనురాగ్ కశ్యప్ తీవ్రంగా మండిపడ్డారు.
అంతేకాకుండా, "నిర్మాతలు కేవలం డబ్బు సంపాదించడానికి, సమాజాన్ని విడదీయడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా తీసిన వారు అత్యాశపరులు. అందరినీ ప్రసన్నం చేసుకుంటూ కోట్లు గడించడమే వారి లక్ష్యం" అని అనురాగ్ కశ్యప్ ఎద్దేవా చేశారు.
రంగంలోకి కేరళ ముఖ్యమంత్రి
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ది కేరళ స్టోరీ 2పై సినిమాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ వంటి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే రాష్ట్రాన్ని ఉగ్రవాదానికి కేంద్రంగా చూపించడాన్ని ఆయన ఖండించారు.
"అబద్ధపు ప్రచారాలతో కేరళ లౌకిక పునాదులను దెబ్బతీయాలని చూస్తున్నారు. కేరళ కీర్తిని మసకబార్చే ఇలాంటి ప్రయత్నాలను ప్రజలందరూ ఐక్యంగా తిరస్కరించాలి" అని డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పిలుపునిచ్చారు.
నిర్మాత వివరణ
మరోవైపు, ఈ విమర్శలపై నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా స్పందిస్తూ.. ఈ సినిమా భారత న్యాయ వ్యవస్థలోని వాస్తవ కేసుల ఆధారంగానే రూపొందించామని తెలిపారు. కేవలం ముగ్గురు అమ్మాయిల కథే కాకుండా, దేశవ్యాప్తంగా జరిగిన అనేక ఇతర సంఘటనలను కూడా ఇందులో జోడించామని ఆయన వివరించారు.
సెన్సార్ బోర్డు (CBFC) నుంచి 'U/A' సర్టిఫికేట్ పొందిన ది కేరళ స్టోరీ 2 ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదల కానుంది. వివాదాల నేపథ్యంలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


