అత్యంత వివాదాస్పద మూవీ సీక్వెల్ కూడా వచ్చేస్తోంది.. ది కేరళ స్టోరీ 2 ట్రైలర్ రిలీజ్.. మీ అమ్మాయిలను కాపాడుకోండంటూ..

2023లో సంచలనం సృష్టించిన 'ది కేరళ స్టోరీ' సినిమాకు సీక్వెల్ రాబోతోంది. విపుల్ అమృత్ లాల్ షా నిర్మిస్తున్న 'ది కేరళ స్టోరీ 2' (The Kerala Story 2) ట్రైలర్ విడుదలైంది. మత మార్పిడి, లవ్ జిహాద్ ఆరోపణలతో ఈసారి మరింత వివాదాస్పదంగా కనిపిస్తోంది. 

Feb 17, 2026, 15:04:22 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన మూవీ 'ది కేరళ స్టోరీ'. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా 'ది కేరళ స్టోరీ 2: గోస్ బియాండ్' (The Kerala Story 2 Goes Beyond) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విపుల్ అమృత్ లాల్ షా నిర్మిస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ను తాజాగా మంగళవారం (ఫిబ్రవరి 17) విడుదల చేశారు. మొదటి భాగం కంటే ఇది మరింత తీవ్రంగా, భయానకంగా ఉందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

అత్యంత వివాదాస్పద మూవీ సీక్వెల్ కూడా వచ్చేస్తోంది.. ది కేరళ స్టోరీ 2 ట్రైలర్ రిలీజ్.. మీ అమ్మాయిలను కాపాడుకోండంటూ..
అత్యంత వివాదాస్పద మూవీ సీక్వెల్ కూడా వచ్చేస్తోంది.. ది కేరళ స్టోరీ 2 ట్రైలర్ రిలీజ్.. మీ అమ్మాయిలను కాపాడుకోండంటూ..

మూడు రాష్ట్రాలు.. మూడు విషాద గాథలు..

రాబోయే 25 ఏళ్లలో ఇండియా మొత్తం షరియా చట్టంతో పాలించే ఇస్లామిక్ స్టేట్‌గా మారుతుందనే హెచ్చరికతో ది కేరళ స్టోరీ 2 మూవీ ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కథ మూడు వేర్వేరు రాష్ట్రాల్లోని ముగ్గురు హిందూ యువతుల జీవితాల చుట్టూ తిరుగుతుంది.

రాజస్థాన్ లో 16 ఏళ్ల తమ కూతురిని బలవంతంగా మత మార్పిడి చేశారని ఒక కుటుంబం పోలీస్ స్టేషన్‌లో పోక్సో (POCSO) కేసు పెడుతుంది. ఇటు మధ్యప్రదేశ్ లో పెళ్లి పేరుతో మోసం చేసి, ఒక హిందూ యువతిని వలలో వేసుకుని, ఆ తర్వాత మత మార్పిడికి గురిచేసే ఉదంతం చూపిస్తారు. మరోవైపు కేరళ లో లివ్-ఇన్ రిలేషన్షిప్ పేరుతో దగ్గరై, మతం మారనందుకు ఒక యువతిని బంధించి, బలవంతంగా గొడ్డు మాంసం (బీఫ్) తినిపించి చిత్రహింసలకు గురిచేసే మరోకథ కూడా ఇందులో చూపించారు.

"ఈసారి మౌనంగా ఉండం.."

"వాళ్ళు మన కూతుళ్లను టార్గెట్ చేశారు. నమ్మకాన్ని వమ్ము చేశారు. భవిష్యత్తును నాశనం చేశారు. ఈసారి మనం మౌనంగా ఉండకూడదు.. సహించేది లేదు.. పోరాడుదాం" అంటూ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ట్రైలర్ చూసిన నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు "గూస్‌బంప్స్ వచ్చాయి, నిజాలు బయటపెడుతున్నారు" అని ప్రశంసిస్తుంటే.. మరికొందరు "ఇది మరో ప్రాపగండా (Propaganda) సినిమా" అని విమర్శిస్తున్నారు.

ది కేరళ స్టోరీ 2 నటీనటులు, విశేషాలు

ఈ కేరళ స్టోరీ 2 సినిమాకు కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఉల్కా గుప్తా, అదితీ భాటియా, ఐశ్వర్య ఓజా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై విపుల్ అమృత్ లాల్ షా, ఆశిన్ ఎ షా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివాదాలు, ఆసక్తి నడుమ 'ది కేరళ స్టోరీ 2' ఫిబ్రవరి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More