కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్(101) ఇకలేరు
కమ్యూనిస్టు సీనియర్ లీడర్, కేరళ మాజీ సీఎం వీఎస్ అచ్యుతానందన్(101) మరణించారు. ఆసుపత్రిలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందారు.
సీపీఐ(ఎం) వ్యవస్థాపక తరంలో బతికి ఉన్న తక్కువ మంది వ్యక్తుల్లో ఒకరైన కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్(101) కన్నుమూశారు. గత నెల 23వ తేదీన గుండెపోటుతో తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అచ్యుతానందన్ చేరారు. ఆరోగ్య పరిస్థితి విషమించడతో సోమవారం మృతి చెందారు.
వీఎస్ అచ్యుతానందన్ కేరళ రాజకీయాల్లో ఒక గొప్ప వ్యక్తి. 2019 అక్టోబర్లో స్ట్రోక్ వచ్చినప్పటి నుండి పెద్దగా కనిపించడం లేదు. అలప్పుజ జిల్లా పున్నప్రాలో 1923 అక్టోబర్ 20న జన్మించిన వెల్లికాత్ శంకరన్ అచ్యుతానందన్ 2006 నుంచి 2011 వరకు కేరళ ముఖ్యమంత్రిగా పనిచేశారు. సామాజిక న్యాయం, కార్మికుల హక్కుల కోసం జీవితాంతం ఉద్యమించిన అచ్యుతానందన్ 1964లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మార్క్సిస్ట్)ను స్థాపించిన బృందంలోని సభ్యుల్లో ఒకరు.
అచ్యుతానందన్ తన రాజకీయ జీవితంలో 10 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. పది ఎన్నికల్లో కేవలం మూడింటిలో మాత్రమే ఓడిపోయారు. తన స్వస్థలం అలప్పుజలోని అంబలపుళ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన తొలిసారి ఎన్నికల్లో ఓడిపోయారు. అచ్యుతానందన్ 1980 నుండి 1992 వరకు 12 సంవత్సరాలు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. మూడుసార్లు విపక్షనేతగా చేశారు.
ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో భూ ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపారు. చాలా మంది వ్యతిరేకులు అయినా పట్టించుకోలేదు. ఆయన ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడే ఉన్నారు. అవమానాలు ఎదురైనా ముందుకుసాగారు. సాఫ్ట్‌వేర్‌ల రూపంలో కొన్ని కంపెనీల గుత్తాధిపత్యం సాగుతోందని గుర్తించారు. అందరికీ అందుబాటులో ఉండే ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ కోసం ఉద్యమించారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper



