Suyodhana: ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా ప్రియదర్శి సుయోధన- దుర్యోధనుడిగా సాయి కుమార్- సీనియర్ హీరోయిన్ ప్రేమ కీ రోల్!

Priyadarshi Suyodhana Release Date Announced: కోర్ట్ మూవీ హీరో ప్రియదర్శి నటించిన లేటెస్ట్ మూవీ సుయోధన. ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో సాయి కుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఇవాళ సుయోధన రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఆ వివరాలు చూద్దాం.

Published on: Mar 10, 2026, 19:02:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వరుస పెట్టి సినిమాలతో దూసుకుపోతున్నాడు కమెడియన్ కమ్ హీరో ప్రియదర్శి. పెళ్లి చూపులు సినిమాతో కమెడియన్‌గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ప్రియదర్శి మల్లేశం, బలగం సినిమాలతో హీరోగా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు.

ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా ప్రియదర్శి సుయోధన- దుర్యోధనుడిగా సాయి కుమార్- సీనియర్ హీరోయిన్ ప్రేమ కీ రోల్!
ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా ప్రియదర్శి సుయోధన- దుర్యోధనుడిగా సాయి కుమార్- సీనియర్ హీరోయిన్ ప్రేమ కీ రోల్!

గతేదాడి నాలుగు సినిమాలతో

గతేడాది ఏకంగా నాలుగు సినిమాలు, అంతకుముందు సంవత్సరం 3 సినిమాలతో తెలుగు ఆడియెన్స్‌ను పలకరించి ఎంటర్‌టైన్ చేశాడు. కోర్ట్, మిత్ర మండలి, ప్రేమంటే, సారంగపాణి జాతకం సినిమాలతో ఆకట్టుకున్న ప్రియదర్శి ఈ ఏడాది కొత్త సినిమాతో అలరించేందుకు రెడీగా ఉన్నాడు.

ప్రియదర్శికి జోడీగా

ప్రియదర్శి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సుయోధన. ఈ సినిమాలో ప్రియదర్శికి జోడీగా హీరోయిన్‌గా ద్రిషిక చందర్ నటించింది. అంతేకాకుండా డైలాగ్ కింగ్ సాయి కుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలక పాత్రలు పోషించారు. ప్రజ్వల లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందించారు.

సుయోధన రిలీజ్ డేట్

సుయోధన సినిమాకు వైఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం వహించగా.. ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సుయోధన రిలీజ్ డేట్‌ను తాజగా ఇవాళ (మార్చి 10) ప్రకటించారు మేకర్స్.

టేబుల్‌పై రక్తంతో

సుయోధన సినిమాను మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ డేట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ప్రియదర్శి అద్దంలో తనను తానే తీక్షణంగా చూస్తూ ఉన్నాడు. టేబుల్‌పైన రక్తంతో కత్తి, బేస్ బాల్ బ్యాట్, మువ్వల పట్టీలు, బాల్, తబలాలు, మైక్ సెట్ ఉన్నాయి.

దుర్యోధనుడిగా సాయి కుమార్

వీటన్నిటికిమించి ప్రియదర్శి వెనుక ఉన్న గోడకు సాయి కుమార్ దుర్యోధనుడి గెటప్‌లో ఉన్న ఫొటో మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉంది. చూస్తుంటే సుయోధన సినిమా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌లా అనిపిస్తుంది. సుయోధన రిలీజ్ డేట్ ప్రకటన సందర్భంగా నిర్మాత బోసుబాబు నిడుమోలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

అత్యుత్తమ ప్రమాణాలతో

నిర్మాత బోసుబాబు నిడుమోలు మాట్లాడుతూ.. "మంచి కథా కథనాలతో, అత్యుత్తమ ప్రమాణాలతో సుయోధన చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ప్రియదర్శి, సాయికుమార్, ద్రిషిక చందర్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలక పాత్రలు పోషించారు. జై క్రిష్ సంగీత దర్శకత్వం వహించారు" అని తెలిపారు.

మార్చి 27న తీసుకొస్తున్నాం

"రామజోగయ్య శాస్త్రి లిరిక్స్‌ను అందించారు . అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాను మార్చి 27 న ప్రేక్షకులముందుకు తీసుకువస్తున్నాము. త్వరలో సుయోధన సినిమా టీజర్, ట్రైలర్, పాటలను రిలీజ్ చేస్తాము" అని చెప్పుకొచ్చారు ప్రొడ్యూసర్ బోసుబాబు నిడుమోలు.

శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా రిలీజ్

కాగా, సుయోధన సినిమా శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో హీరో హీరోయిన్లు, కీలక పాత్రలతోపాటు విష్ణు (లడ్డు), దేవి ప్రసాద్, రాజశ్రీ నాయర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. కార్తీక్ కొప్పెర సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టగా.. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ నిర్వర్తించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More