కోర్ట్ మూవీ జోడీ ఈజ్ బ్యాక్.. రోషన్, శ్రీదేవి బ్యాండ్ మేళం టీజర్ వచ్చేసింది.. రొమాంటిక్ కామెడీతో వస్తున్న హిట్ జంట

కోర్టు మూవీతో అదరగొట్టిన రోషన్, శ్రీదేవి జోడీ ఈసారి బ్యాండ్ మేళం (Band Melam) మూవీతో తిరిగి వస్తోంది. మంగళవారం (ఫిబ్రవరి 24) ఈ మూవీ టీజర్ రిలీజ్ అయింది. ఈ రొమాంటిక్ కామెడీతో ఈ హిట్ పెయిర్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుండటం విశేషం.

Published on: Feb 24, 2026, 18:49:38 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

'కోర్టు' సినిమాతో మెప్పించిన హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'బ్యాండ్ మేళం'. మంగళవారం (ఫిబ్రవరి 24) విడుదలైన ఈ సినిమా టీజర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తూ యూత్‌ను ఆకట్టుకుంటోంది. మార్చి 13న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మరి టీజర్ ఎలా ఉంది? ఈ మూవీ విశేషాలేంటో ఇక్కడ చూడండి.

కోర్ట్ మూవీ జోడీ ఈజ్ బ్యాక్.. రోషన్, శ్రీదేవి బ్యాండ్ మేళం టీజర్ వచ్చేసింది.. రొమాంటిక్ కామెడీతో వస్తున్న హిట్ జంట
కోర్ట్ మూవీ జోడీ ఈజ్ బ్యాక్.. రోషన్, శ్రీదేవి బ్యాండ్ మేళం టీజర్ వచ్చేసింది.. రొమాంటిక్ కామెడీతో వస్తున్న హిట్ జంట

నవ్వుల విందుగా బ్యాండ్ మేళం మూవీ టీజర్

హీరో హర్ష్ రోషన్, హీరోయిన్ శ్రీదేవి.. ఈ పేరు వినగానే 'కోర్టు' సినిమాలో వారి మధ్య కెమిస్ట్రీ గుర్తుకు వస్తుంది. గతేడాది ఈ లోబడ్జెట్ సినిమాతో ఈ జంట మంచి హిట్ కొట్టింది. తన అమాయకపు నవ్వుతో శ్రీదేవి తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఇప్పుడు అదే క్రేజీ కాంబినేషన్ మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమైంది. ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ నిర్మాణంలో వస్తున్న 'బ్యాండ్ మేళం' మూవీ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

టీజర్ ప్రారంభంలోనే హీరోయిన్ శ్రీదేవి తన తండ్రి (సాయికుమార్)తో కలిసి రీల్స్ చేస్తూ.. "నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న" అని చెప్పే డైలాగ్ హిలేరియస్‌గా ఉంది. ఇందులో హీరో, హీరోయిన్లు బావా మరదళ్లుగా కనిపిస్తున్నారు. "ప్రకృతి సిగ్నల్ ఇస్తోంది?", "పోక్సో కేసు వేసేస్తాం" వంటి పంచు డైలాగులు టీజర్‌లో హైలైట్‌గా నిలిచాయి. టీజర్ చూస్తుంటే ఇదొక ఫుల్ లెంగ్త్ యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ అని స్పష్టమవుతోంది. పైగా హీరో, హీరోయిన్లు ఇద్దరూ తెలంగాణ యాసలో డైలాగులు చెప్పడం కూడా ఆసక్తి రేపుతోంది. ఈ మధ్య తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా వరకు తెలంగాణ యాసతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే.

బ్యాండ్ మేళం మూవీ విశేషాలు

సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ బ్యాండ్ మేళం సినిమాకు విలక్షణ సంగీత దర్శకుడు విజయ్ బుల్గనిన్ స్వరాలు సమకూర్చాడు. ఇటీవలే దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేసిన ‘తిప్పుకుంటన్నావ్’ అనే మొదటి సాంగ్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. ఆస్కార్ విజేత చంద్రబోస్ ఈ సినిమాకు సాహిత్యం అందించడం విశేషం.

ప్రేమ, సంగీతం, భావోద్వేగాలతో పాటు కడుపుబ్బ నవ్వించే కామెడీ ట్రాక్ ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా మార్చి 13న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. మరి కోర్ట్ మూవీలాగే ఈ బ్యాండ్ మేళంతోనూ రోషన్, శ్రీదేవి జంట ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? మరో హిట్ కొడతారా అన్నది చూడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More