ప్రియుడితో రవితేజ హీరోయిన్ పెళ్లి-వైరల్‌గా నుపుర్ సనన్ వెడ్డింగ్ వీడియోలు-ఆ స్టార్ హీరోయిన్ చెల్లి
తెలుగు సినిమాతో డెబ్యూ చేసిన రవితేజ హీరోయిన్ నుపుర్ సనన్ పెళ్లి చేసుకుంది. తన ప్రియుడు స్టెబిన్ బెన్ ను మనువాడింది. ఉదయపూర్లో వీళ్ల వెడ్డింగ్ గ్రాండ్ గా జరిగింది. ఈ వీడియోలు వైరల్ గా మారాయి. స్టార్ హీరోయిన్ కృతి సనన్ చెల్లెనే నుపుర్.
రవితేజ సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’తో డెబ్యూ చేసిన హీరోయిన్ నుపుర్ సనన్ పెళ్లి చేసుకుంది. తన ప్రియుడు, సింగర్ స్టెబిన్ బెన్ ను గ్రాండ్ సెరెమనీలో మనువాడింది. ఈ జంట ఉదయపూర్ లో వివాహం చేసుకుంది. అద్భుతమైన క్రైస్తవ వేడుకలతో పెళ్లి జరిగింది. ఈ పెళ్లి ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. స్టార్ హీరోయిన్ కృతి సనన్ చెల్లెనే నుపుర్ సనన్.

వైరల్ వీడియోలు
నుపుర్, స్టెబిన్ పెళ్లి వీడియోలు వైరల్ గా మారాయి. వైట్ డ్రెస్ లో ఈ నవ దంపుతులు మెరిసిపోయారు. ఓ వీడియోలో స్టెబిన్ షాంపైన్ బాటిల్ ను ఓపెన్ చేస్తున్నట్లు కనిపించింది. నుపుర్ ఆఫ్ షోల్డర్ లేసీ గౌను లో అందంగా కనిపిస్తుంది. ఆమె మెహందీ కూడా చేతుల్లో కనిపిస్తుంది. ఆమె అక్క కృతి సనన్ తో సహా తోడి పెళ్లికూతుర్లందరూ సముద్రపు ఆకుపచ్చ దుస్తులు ధరించారు.
కృతి సనన్ డ్యాన్స్
అంతకుముందు నుపుర్ సనన్, స్టెబిన్ సంగీత్ వేడుకల్లో కృతి సనన్ డ్యాన్స్ చేసిన వీడియోలు తెగ వైరల్ గా మారాయి. చెల్లె పెళ్లికి మందు సంగీత్ లో కృతి సనన్ జోష్ తో స్టెప్పులేసింది. ఈ పెళ్లికి బాలీవుడ్ హీరోయిన్లు దిశా పటానీ, మౌనీ రాయ్ లు అటెండ్ అయ్యారు. కృతి రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ కబీర్ బాహియా కూడా వెడ్డింగ్ ఫొటో పోస్టు చేశాడు.
తెలుగు సినిమాతో
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది కృతి సనన్. నేషనల్ అవార్డు కూడా అందుకుంది. ఆమె చెల్లె నుపుర్ సనన్ కూడా హీరోయిన్ గా సినిమాలు చేసింది. మోడల్ కూడా అయిన నుపుర్ సనన్ 2019లో ఫిల్హల్ మ్యూజిక్ వీడియోలో కనిపించింది. 2023లో పాప్ కౌన్ వెబ్ సిరీస్ లో నటించింది.
రవితేజ హీరోగా 2023లో వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నుపుర్ సనన్. ఈ మూవీ అనుకున్నతంగా ఆడలేదు. ఆ తర్వాత ఈ ఏడాది హిందీలో నూరని చెహ్రా అనే సినిమా చేస్తోంది నుపుర్.
డేటింగ్
నుపుర్ సనన్, స్టెబిన్ బెన్ చాలా కాలం నుంచి డేటింగ్ లో ఉన్నారు. కొంత కాలంగా కలిసే జీవించారు. ఇటీవల ఎంగేజ్మెంట్ తో తమ సంబంధాన్ని అఫీషియల్ చేసింది ఈ జోడీ. ఇప్పుడు పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ స్టార్ట్ చేశారు నుపుర్, స్టెబిన్.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


