మెడలో మంగళసూత్రంతో మెరిసిన సమంత-భర్త రాజ్ నిడిమోరు చేసిన పనికి ఫిదా కావాల్సిందే-వీడియో వైరల్
ఇటీవల సమంత రూత్ ప్రభు, తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో సమంత మెడలో మంగళసూత్రంతో మెరిసింది. ఇదే సమయంలో రాజ్ చేసిన ఓ పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
సెలబ్రిటీ జంట సమంతా రూత్ ప్రభు, రాజ్ నిడిమోరు రీసెంట్ గా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. సమంత మెడలో మంగళసూత్రంతో మెరిశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. ఇందులో తాళిబొట్టుతో ఉన్న సమంత పై నెటిజన్లు ఫోకస్ పెడుతున్నారు. ఈ సందర్భంగా సమంత భర్త రాజ్ చేసిన ఓ పనిపై ప్రశంసలు కురుస్తున్నాయి.

మంగళసూత్రంతో సమంత
ఇటీవల రాజ్ తో కలిసి సమంత హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న అనేక వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆమె మంగళసూత్రంతో కనిపించింది. దీంతో ఆమె స్టైల్ కు ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సమంత వదులుగా ఉన్న బ్లేజర్, దానికి సరిపోయే ఫార్మల్ ప్యాంట్ తో పాటు నల్లటి లోపలి టాప్ ను వేసుకుంది.
ఎయిరోపోర్ట్ బయట
సమంత, ఆమె భర్త రాజ్ నిడిమోరు జంటగా ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో ఫొటోగ్రాఫర్లు క్లిక్ మనిపించారు. వారు బయటకు వెళ్ళేటప్పుడు రాజ్ తో యానిమేట్ గా సమంత చాట్ చేయడం కనిపించింది. వారు అభిమానులతో కొన్ని చిత్రాలను క్లిక్ చేయడానికి కూడా ఆగిపోయారు. కానీ ఆమె మంగళసూత్రం అందరి దృష్టిని ఆకర్షించింది.
రాజ్ ఏం చేశాడంటే?
రాజ్ బ్రౌన్ షర్టు ధరించి నీలం డెనిమ్ జీన్స్ వేసుకున్నాడు. తన భార్య కారు దగ్గరకు వచ్చినప్పుడు రాజ్ డోర్ తీశాడు. రాజ్ చేసిన ఈ పనికి, భార్య పట్ల తనకున్న గౌరవానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
"ఆమె సంతోషంగా ఉండటం చూసి నేను చాలా హ్యాపీగా ఉన్నా’’ అని ఓ ఫ్యాన్ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. "వావ్ ఆమె మెరుస్తుంది, ప్రేమ దక్కింది’’ అని ఒకరు, "నిజంగా ఆమె మెరుస్తోంది" అని మరొకరు పోస్ట్ చేశారు. అందమైన జంట అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
సమంత, రాజ్ పెళ్లి
గతేడాది డిసెంబర్ 1న సమంత, రాజ్ నిడిమోరు పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరికీ ఇది రెండో పెళ్లి. తన పెళ్లి ఫొటోలను షేర్ చేసి సమంత అభిమానులందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ జంట కోయంబత్తూరులో ఒక సన్నిహిత, భూత యోగ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. రీసెంట్ గా ఈ జోడీ పోర్చుగల్ లోని లిస్బన్ కు హనీమూన్ కు వెళ్లింది. రెండో పెళ్లి తర్వాత సమంత ‘మా ఇంటి బంగారం’ సినిమాతో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు మళ్లీ వచ్చేస్తోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


