తమన్నాకు క్రిస్మస్ పార్టీ ఇచ్చిన సమంత, రాజ్ నిడిమోరు.. ఫొటోలు వైరల్
సమంత రూత్ ప్రభు, రాజ్ నిడిమోరు కలిసి తమన్నాతోపాటు తమ ఫ్రెండ్స్ కు క్రిస్మస్ పార్టీ ఇచ్చారు. ఈ ఫొటోలను సమంత షేర్ చేయగా.. అవి వైరల్ అయ్యాయి. ఈ కొత్త జంట తొలి క్రిస్మస్ వేడుకలు చాలా బాగా జరిగినట్లు ఆ ఫొటోలు చూస్తే తెలుస్తోంది.
నటి సమంత రూత్ ప్రభు, ఫిల్మ్ మేకర్ రాజ్ నిడిమోరు గతేడాది డిసెంబర్ 1న కోయంబత్తూర్‌లో జరిగిన యోగిక్ వివాహ వేడుకలో ఒక్కటయ్యారు. తమ పెళ్లి తర్వాత వారు తమ స్నేహితుల కోసం ఇంట్లో ఒక విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో నటి తమన్నా భాటియా కూడా పాల్గొనడం విశేషం. ఆ సాయంత్రానికి సంబంధించిన కొన్ని ఫొటోలను సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

సమంత, రాజ్ క్రిస్మస్ పార్టీ
సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో తన క్రిస్మస్ ట్రీ, డెకరేషన్ కు సంబంధించిన ఒక ఫోటోను పోస్ట్ చేస్తూ.. "నేను నిజంగానే ఈ క్రిస్మస్ డెకరేషన్‌ని పక్కన పెట్టాలా" అని రాసుకొచ్చింది. ఆ ఫోటోలో ఆమె తన ఇంటికి క్రిస్మస్ కోసం అందంగా అలంకరించింది.
ఆమె షేర్ చేసిన మరో ఫోటోలో.. సమంత, ఆ క్రిస్మస్ ట్రీ ముందు నిలబడి ఫోటోలకు పోజులివ్వడం చూడవచ్చు. వారితో పాటు తమన్నా, వారి ఇతర స్నేహితులు కూడా ఉన్నారు. అది ఇంట్లో జరిగిన ఒక ఈవెంట్ పార్టీలా కనిపిస్తోంది.
సమంత రూత్ ప్రభు, రాజ్ నిడిమోరు గురించి..
సమంత.. రాజ్ అండ్ డీకేలతో కలిసి 2021లో వచ్చిన ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్ 2', 2023లో వచ్చిన 'సిటాడెల్: హనీ బన్నీ' కోసం పనిచేసింది. ఆమె 2021లో నాగ చైతన్యతో విడాకులు తీసుకుకుంది. రాజ్ తన భార్య శ్యామలీ దే నుండి ఎప్పుడు విడిపోయారనేది తెలియదు.
2023లో సమంత, రాజ్ డేటింగ్‌లో ఉన్నారనే పుకార్లు మొదలయ్యాయి, అయినప్పటికీ వారు దానిని ఎప్పుడూ ధృవీకరించలేదు. 2024లో వారు సహజీవనం చేస్తున్నారనే ఊహాగానాలు వచ్చినప్పుడు, ఆమె టీమ్ దానిని ఖండించింది. అయినా ఈ జంట ఈవెంట్లలో, ఆమె సోషల్ మీడియా ఫోటోలలో కలిసి కనిపించడం ప్రారంభించారు.
డిసెంబర్ 1, 2025న సమంత సోషల్ మీడియాలో తమ పెళ్లి ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ రోజు ఉదయం ఈషా ఫౌండేషన్‌లో వాళ్లు పెళ్లి చేసుకున్నారనే పుకార్లను ధృవీకరించింది. ఈ పెళ్లికి వారి కుటుంబాలు, సన్నిహిత మిత్రులు హాజరయ్యారు.
రాబోయే ప్రాజెక్టులు
రాజ్ అండ్ డీకే ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ కోసం 'రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్' అనే వెబ్ సిరీస్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సమంత ప్రధాన పాత్రలో నటిస్తోంది. సమంత 2025లో తన నిర్మాణ సంస్థ 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' బ్యానర్ పై 'శుభం' సినిమాను నిర్మించింది. ఇప్పుడు అదే బ్యానర్లో లీడ్ రోల్లో మా ఇంటి బంగారం అనే తెలుగు సినిమా చేస్తోంది. దీనిని నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


