తేరే ఇష్క్ మే సూపర్ హిట్- న్యూడ్ పింక్ గౌనులో కృతి సనన్ మెరుపులు- రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గ్లామర్ ఫొటోలు

ధనుష్ తేరే ఇష్క్ మే సూపర్ హిట్ సాధించడంతో సకెస్స్‌ను ఎంజాయ్ చేస్తోంది కృతి సనన్. జెడ్డాలో తొలిసారిగా జరిగిన 2025 రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కృతి సనన్ అందాలతో ఆకట్టుకుంది. ఫిడెల్స్కాయ డిజైన్ చేసిన న్యూడ్ పింక్ గౌనులో కృతి సనన్ గ్లామర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Updated on: Dec 11, 2025, 19:04:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ సౌది అరేబియాలోని జెడ్డాలో తొలిసారిగా జరిగిన 2025 రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొంది. తొలిసారిగా ఓ గ్లోబల్ ఈవెంట్‌లో పాల్గొన్న కృతి సనన్ అందరి దృష్టిని ఆకర్షించింది. హాలీవుడ్ స్టార్స్‌తో కలిసి కృతి సనన్ సందడి చేసింది.

తేరే ఇష్క్ మే సూపర్ హిట్- న్యూడ్ పింక్ గౌనులో కృతి సనన్ మెరుపులు- రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గ్లామర్ ఫొటోలు (Instagram/Kriti Sanon)
తేరే ఇష్క్ మే సూపర్ హిట్- న్యూడ్ పింక్ గౌనులో కృతి సనన్ మెరుపులు- రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గ్లామర్ ఫొటోలు (Instagram/Kriti Sanon)

న్యూడ్ పింక్ గౌనులో కృతి

ఈ చలన చిత్రోత్సవంలో భాగంగా జరిగిన 'ఉమెన్ ఇన్ సినిమా' గాలా వేడుకలో కృతి సనన్ హాలీవుడ్ ప్రముఖులైన డకోటా జాన్సన్, ఉమా థర్మన్, ఆండ్రియన్ బ్రాడీ వంటి స్టార్స్‌తో కలవడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక వేడుక కోసం కృతి సనన్ ప్రత్యేకంగా దుస్తులను ఎంచుకుంది.

ప్రమఖ డిజైనర్ క్రిస్టినా ఫిడెల్స్కాయ రూపొందించిన న్యూడ్ పింక్ స్లీవ్‌లెస్ గౌనులో కృతి సనన్ అందాలతో మెరిసిపోయింది. ఈ గౌను పైభాగం ఫిట్టెడ్ బోడిస్‌తో, కింద భాగం ఫ్లోరల్ డిజైన్లు ఉన్న నెట్ మెష్ స్కర్ట్‌తో డిజైన్ చేయబడింది. క్రిస్టినా ఫిడెల్స్కాయ రూపొందించిన ఈ దుస్తులు ఫిట్టెడ్ టాప్, కింద భాగంలో ఫ్లోయింగ్ షీర్ ఫాబ్రిక్‌పై అందమైన ఫ్లోరల్ డిజైన్‌తో కూడి, అద్భుతమైన సొగసును ఒలకబోశాయి.

ఈ లుక్‌ను పూర్తి చేసేందుకు కృతి సనన్ తన జుట్టును మధ్య పాపిడితో ముడి (బన్) వేసుకుంది. చాలా సింపుల్‌గా, హుందాగా కనిపించే మేకప్‌ను ఎంచుకుని కృతి సనన్ ఆకట్టుకుంది. ఈ ఫెస్టివల్‌లో న్యూడ్ గులాబి గౌనులో ఉన్న పలు ఫొటోలను కృతి సనన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.

కృతి సనన్ గ్లామర్ ఫొటోలు

“వేరింగ్ @kristinafidelkaya” అంటూ ఆ గ్లామర్ ఫోటోలకు కృతి సనన్ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో సోషల్ మీడియాలో కృతి సనన్ గ్లామర్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కృతి సనన్ తొలిసారి వచ్చినప్పటికీ, తన దుస్తులతో నిజంగా అందరిని ఆకర్షించిందని చెప్పవచ్చు.

కృతి సనన్ నటించిన తేరే ఇష్క్ మే సూపర్ హిట్ సాధించింది. ఈ సందర్భంగానే రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సందడి చేసింది కృతి సనన్. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన తేరే ఇష్క్ మే మూవీలో ధనుష్‌తో జోడీ కట్టి నటించింది కృతి సనన్. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 28న థియేటర్లలో విడుదలైంది.

తేరే ఇష్క్ మే బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతూ సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికీ వరల్డ్ వైడ్‌గా రూ. 150 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా ఇండియాలో రూ. 107 కోట్ల నెట్ వసూలు కలెక్ట్ చేసింది.

సైకాలజీ రీసెర్చ్ స్కాలర్‌గా

కాగా, తేరే ఇష్క్ మే సినిమాలో కృతి సనన్ ముక్తి అనే సైకాలజీ రీసెర్చ్ స్కాలర్‌గా నటించింది. ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఉండే శంకర్ (ధనుష్) అనే కోపిష్టి యువకుడిపై థీసిస్ రాయాలని ఆమె నిర్ణయించుకుంటుంది.

క్రమంగా వారిద్దరి మధ్య ఒక సంక్లిష్టమైన సంబంధం మొదలవుతుంది. ముక్తి అంతర్మథనం గురించి తెలియని శంకర్ ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే, ముక్తి తన థీసిస్‌ను సమర్పించడానికి సిద్ధమవుతున్నప్పుడు అపరాధ భావంతో కుమిలిపోతుంది.

తేరే ఇష్క్ మే కథ

ఆ సమయంలో ముక్తి తండ్రి యూపీఎస్‌సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే తన కూతురిని వివాహం చేసుకోవచ్చని శంకర్‌కు షరతు పెడతాడు. ఆ తర్వాత ఏమైందనేదే తేరే ఇష్క్ మే కథ.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More