నాకు ఇప్పుడు ఎవరితోనూ పోటీ లేదు, పెయింటింగ్ లాగే సినిమాను అందరూ ఒకేలా చూడలేరు.. ఇంటర్వ్యూలో కృతి సనన్ కామెంట్స్
'తేరే ఇష్క్ మే' చిత్రంతో విమర్శకుల ప్రశంసలతోపాటు మంచి బాక్సాఫీస్ విజయాన్ని ఏకకాలంలో ఆస్వాదిస్తోంది హీరోయిన్ కృతి సనన్. హీరో ధనుష్‌తో సమానంగా తన పాత్రకు దక్కిన గుర్తింపు, సినిమాకు వస్తున్న టాక్, కెరీర్‌పై తనకున్న స్పష్టత, సోషల్ మీడియా చర్చలపై కృతి సనన్ రియాక్ట్ అయింది. ఆ విశేషాలు చూద్దాం.
కోలీవుడ్ హీరో ధనుష్, బ్యూటిఫుల్ కృతి సనన్ జోడీగా తెరకెక్కిన బాలీవుడ్ మ్యూజికల్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ తేరే ఇష్క్ మే. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫుల్ పాజిటివ్ టాక్‌తోపాటు మంచి బాక్సాఫీస్ కలెక్షన్స్ రాబడుతోంది. ఈ నేపథ్యంలో తేరే ఇష్క్ మేకు వస్తోన్న టాక్‌పై స్పందించిన కృతి సనన్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పుకొచ్చింది.

‘తేరే ఇష్క్ మే’ విజయం మీకు ఎలా అనిపిస్తోంది?
-ఇది నిజంగా మాటల్లో చెప్పలేనంత ఆనందాన్నిస్తోంది. ఈ సినిమాకు, ఒక నటిగా నాకు ఇంతలా ప్రేమ దక్కుతుందని ఊహించలేదు. సాధారణంగా ఒక సినిమాకు గొప్ప రివ్యూలు రావడం, నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కడం, అదే సమయంలో భారీ బాక్సాఫీస్ నంబర్లు రావడం.. ఇవన్నీ ఒకేసారి జరగడం చాలా అరుదు. నాకు ఇవన్నీ ఒక్కసారే దక్కాయి. ఇంతకంటే నాకేం కావాలి.
సాధారణంగా సినిమాలో హీరో డామినేషన్ ఉంటుంది. ఇందులో హీరో, హీరోయిన్ ఇద్దరికీ సమాన ప్రాధాన్యం దక్కింది. ఇది మీకు కొత్తగా అనిపించిందా?
-చాలా రీఫ్రెషింగ్‌గా అనిపించింది. కథ విన్నప్పుడు పేపర్ మీద శంకర్ (ధనుష్ రోల్) పాత్రకే ఎక్కువ డైలాగులు, పంచ్‌లు ఉన్నాయనిపించింది. ఆయనే కథను నడిపిస్తున్నట్లు అనిపించేది. కానీ, దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ సార్ మనసులో 'ముక్తి' (కృతి పాత్ర) లేయర్స్ చాలా బలంగా ఉన్నాయి. ఇది వన్-సైడ్ లవ్ స్టోరీ కాదని ఆయన ముందే స్పష్టంగా చెప్పారు.
-'ఫస్టాఫ్‌లో ధనుష్ ప్రేమ, బాధ ఎక్కువగా కనిపిస్తే.. సెకండాఫ్‌లో ముక్తి భావోద్వేగాలు ఎక్కువగా కనిపిస్తాయి' అని ఆయన వివరించారు. ఇద్దరి పాత్రలూ సమాన బలంతో ఉన్నప్పుడు కథ మరింత అందంగా, వాస్తవికంగా మారుతుంది.
-ఇది హీరో పాత్ర బరువును ఏమాత్రం తగ్గించదు సరికదా బ్యాలెన్స్ చేస్తుంది. అమ్మాయిలు ముక్తి పాత్రకు ఎక్కువగా కనెక్ట్ అవుతారు. కానీ, కథకు మేమిద్దరం సమానంగా న్యాయం చేశాం.
'మిమి'తో జాతీయ అవార్డు అందుకున్న తర్వాత, ఇప్పుడు ఈ మూవీతో మరోసారి ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు కాస్త రిలాక్స్ అయినట్లు, ఒత్తిడి తగ్గినట్లు అనిపిస్తోందా?
-మన పనిని పదిమంది మెచ్చుకున్నప్పుడు వచ్చే ఎనర్జీనే వేరు. ఒక్కో పాత్ర కోసం మానసికంగా, భావోద్వేగ పరంగా ఎంతో కష్టపడతాం. నేను ఎంచుకుంటున్న పాత్రలు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతున్నందుకు సంతోషంగా ఉంది.
-'మిమి' సినిమా నాకు రిస్క్ తీసుకునే ధైర్యాన్ని, ఒక రకమైన భద్రతా భావాన్ని ఇచ్చింది. ఇకపై నన్ను నేను పదే పదే నిరూపించుకోవాల్సిన అవసరం లేదనిపించింది. ఈ ఇండస్ట్రీలో నిరంతరం ఒకరితో ఒకరిని పోల్చుతుంటారు.. అది మనలో అభద్రతా భావాన్ని పెంచుతుంది.
మరి ఆ అభద్రతా భావం నుంచి ఎలా బయటపడ్డారు?
-కెరీర్‌లో ఒక దశకు చేరుకున్నాక.. 'మనం నటించగలమని జనాలకు తెలుసులే' అనే నమ్మకం కలుగుతుంది. అప్పుడు ఇక ఆందోళన ఉండదు. నేను ఇప్పుడు ఆ దశలో ఉన్నందుకు సంతోషంగా ఉంది.
-నేను ఎవరితోనూ పోటీ పడటం లేదు, బాక్సాఫీస్ ర్యాంకుల కోసం పరుగెత్తడం లేదు. నా పనిని నేను ఆస్వాదిస్తున్నాను, నన్ను నేను మెరుగుపరుచు కోవాలనుకుంటున్నాను. ప్రతి సినిమా తర్వాత 'ఇది ఆమె బెస్ట్ పెర్ఫార్మెన్స్' అని జనం అంటుంటే వినడానికి చాలా బాగుంటుంది.
సోషల్ మీడియాలో సినిమా థీమ్స్‌పై జరుగుతున్న డిబేట్స్ గమనిస్తున్నారా?
-అవును, నేను ఎప్పుడూ సోషల్ మీడియాలో ప్రేక్షకులు ఏం అనుకుంటున్నారో చదువుతుంటాను. దీని విషయంలో నాకు కాస్త పిచ్చి ఎక్కువే అని చెప్పాలి. కేవలం క్రిటిక్స్ అభిప్రాయాలే కాదు, సామాన్య ప్రేక్షకుల చర్చలు కూడా చూస్తాను.
-నాకు డిబేట్స్ (చర్చలు) అంటే ఇష్టం. కళ ముఖ్య ఉద్దేశమే అది కదా. ఒక పెయింటింగ్‌ను అందరూ ఒకేలా చూడలేరు. సినిమా కూడా అంతే. మన వ్యక్తిగత అనుభవాలను బట్టి, మనకు తెలిసిన శంకర్ లేదా ముక్తి లాంటి వ్యక్తులను బట్టి సినిమాకు కనెక్ట్ అవుతాం.
-ఈ సినిమాలో టాక్సిక్ లవ్ (విషపూరితమైన ప్రేమ) ఉన్నా, హీరోయిన్ దాన్ని ప్రశ్నించడం అనేది ఆసక్తికరమైన విషయం.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


