ఓటీటీలో వీకెండ్‌కు చూడాల్సిన 6 ఇంట్రెస్టింగ్ సినిమాలు- టాలీవుడ్ టు హాలీవుడ్- అన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్- ఎక్కడంటే?
ఓటీటీ సినీ ప్రియులకు ఈ వారం పండగే. ఈ వారం ఎన్నో సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. అయితే, వీటిలో ఈ వీకెండ్‌కు ఓటీటీలో కచ్చితంగా చూడాల్సిన ఆరు ఇంట్రెస్టింగ్ సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. వాటిలో టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఓటీటీ స్ట్రీమింగ్ మూవీస్ ఉన్నాయి. వాటిలో రష్మికవే 2 ఉండటం విశేషం.
ఓటీటీ సినీ ప్రియులకు ఈ వారం అనేక స్ట్రీమింగ్ సినిమాలతో పండగ వాతావరణం నెలకొంది. థియేటర్ దాకా వెళ్లే ఓపిక లేక ఇంట్లోనే కూర్చుని వీకెండ్‌ను ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఓటీటీల్లోనూ బోలెడన్ని ఆప్షన్లు ఉన్నాయి. అయితే, ఓటీటీలో ఈ వీకెండ్‌కు చూడాల్సిన 6 ఇంట్రెస్టింగ్ టాలీవుడ్ టు హాలీవుడ్ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

థామా ఓటీటీ
మాడాక్ హారర్ కామెడీ యూనివర్స్ నుంచి వచ్చిన లేటెస్ట్ సినిమా థామా. ఇందులో రష్మిక మందన్న, ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించారు. ఒక పిశాచం (Vampire) కాటు వేయడంతో ఆయుష్మాన్ ఖురానా జీవితం ఎలాంటి ఊహించని మలుపులు తిరిగిందనేది ఈ చిత్ర కథాంశం.
విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేష్ రావల్ కూడా ఇందులో కీలక పాత్రలు పోషించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అద్దె ప్రాతిపదికన (Rent) థామా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో ఓటీటీ రిలీజ్ అయిన థామా డిసెంబర్ 16 నుంచి ఫ్రీగా ప్రీమియర్ కానుంది.
ది గర్ల్‌ఫ్రెండ్ ఓటీటీ
రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఇంటెన్స్ రొమాంటిక్ తెలుగు డ్రామా ది గర్ల్‌ఫ్రెండ్. సాహిత్యమంటే ప్రాణమిచ్చే కాలేజీ విద్యార్థిని, ఒక అబ్బాయి ప్రేమలో పడుతుంది. ఆ తర్వాతే అతడిలోని విపరీతమైన కోపం, పొసెసివ్‌నెస్ గురించి ఆమెకు అర్థమవుతుంది.
తన బాయ్‌ఫ్రెండ్ నియంతృత్వ ధోరణి, విషపూరితమైన ప్రేమ నుంచి బయటపడేందుకు ఆ యువతి చేసే పోరాటమే ది గర్ల్‌ఫ్రెండ్. అను ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, రోహిణి ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ది గర్ల్‌ఫ్రెండ్ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో చూసేయొచ్చు.
డైస్ ఈరే ఓటీటీ
రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో ప్రణవ్ మోహన్‌లాల్ నటించిన మలయాళ హారర్ చిత్రమిది. అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.
ఒక ఇండో-అమెరికన్ ఆర్కిటెక్ట్ జీవితం.. ఓ డ్యాన్సర్ ఆత్మహత్య తర్వాత ఎలా తలకిందులైందనేది ఆసక్తికరంగా తెరకెక్కించారు. తన చుట్టూ జరుగుతున్న వింత పరిణామాలతో భయపడిన ఆ ఆర్కిటెక్ట్, చివరికి ఒక ఎక్సార్సిస్ట్ (దయ్యాలను వదిలించే వ్యక్తి) సాయం కోరడం చుట్టూ కథ ఉత్కంఠభరితంగా ఈ సినిమా సాగుతుంది.
ట్రోల్ 2 ఓటీటీ
సూపర్ హిట్ నార్వేజియన్ యాక్షన్-అడ్వెంచర్ ఫ్రాంచైజీ ట్రోల్ 2తో నెట్‌ఫ్లిక్స్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో పేలియంటాలజిస్ట్ నోరా టైడ్‌మాన్, ఆండ్రూస్, మేజర్ క్రిస్టోఫర్ హోమ్ కలిసి మరోసారి సాహసం చేయనున్నారు.
దారిలో కనిపించిన ప్రతిదాన్ని నాశనం చేసుకుంటూ వెళ్తున్న ఓ ప్రమాదకరమైన ట్రోల్‌ను అడ్డుకోవడమే వీరి లక్ష్యం. నెట్‌ఫ్లిక్స్‌లో ట్రోల్ 2 తెలుగులోనూ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
కుట్రం పురింధవన్ ఓటీటీ
తమిళంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కుట్రం పురింధవన్. సోనీ లివ్‌లో డిసెంబర్ 5 నుంచి కుట్రం పురింధవన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతోపాటు తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో కూడా కుట్రం పురింధవన్ ఓటీటీ రిలీజ్ అయింది.
ది అబాండన్స్ ఓటీటీ
గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ లీనా హెడీ, గిలియన్ ఆండర్సన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన పీరియాడిక్ డ్రామా సిరీస్ ది అబాండన్స్. 1850ల నాటి వాషింగ్టన్ నేపథ్యంలో సాగే ఈ కథలో.. మనుగడ కోసం, ఆధిపత్యం కోసం పోరాడే ఇద్దరు శక్తివంతమైన మహిళల ప్రయాణాన్ని చూడవచ్చు.
చట్టాలు అంతగా అమలులో లేని ఆ రోజుల్లో ఒక ధనవంతురాలు, నిజాయితీ గల పేద కుటుంబ పెద్ద మధ్య జరిగే ఆధిపత్య పోరే 'ది అబాండన్స్'. నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 4 నుంచి ది అబాండన్స్ ఓటీటీ స్ట్రీమింగ్. తెలుగులో కూడా ఈ సిరీస్ అందుబాటులో ఉన్నాయి. ఇలా వీకెండ్‌కు ఇంట్రెస్టింగ్‌గా చూడాల్సినవన్నీ తెలుగులోనే ఉండటం విశేషం.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


