ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్‌లో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్.. ఆసక్తి రేపుతున్న వార్తలు
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వస్తున్న స్పిరిట్ మూవీలో బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ నటించనున్నట్లు వస్తున్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి అనౌన్స్‌మెంట్ రాలేదు.
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ కాప్ డ్రామా 'స్పిరిట్' (Spirit). ఈ ప్రతిష్టాత్మక చిత్రం గురించి రోజుకో ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. తాజాగా వినిపిస్తున్న బజ్ ప్రకారం, ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం బాలీవుడ్ ఐకాన్ కాజోల్ ను తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.

కరీనా ప్లేస్‌లో కాజోల్?
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో మూవీ అంటేనే ఎంతో ఆసక్తి రేపుతోంది. దీనికి స్పిరిట్ అనే టైటిల్, ఈ మధ్య వచ్చిన ఆడియో ఇంట్రడక్షన్ గ్లింప్స్ మూవీపై అంచనాలను పెంచేసింది. ఇక ఇప్పుడు ఇందులో బాలీవుడ్ నటి కాజోల్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం మొదట బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్‌ను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి.
అయితే ఆమె ఆ పుకార్లను ఖండించడంతో ఆ ప్రచారం సద్దుమణిగింది. ఇప్పుడు ఆ స్థానంలో సీనియర్ నటి కాజోల్‌ను తీసుకోవడానికి చిత్ర బృందం ప్రయత్నిస్తోందట. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కాజోల్ ఇప్పటికే కథ విన్నారని, ఆ పాత్ర పట్ల ఆమె చాలా ఇంప్రెస్ అయ్యారని తెలుస్తోంది.
ఒకవేళ ఇది నిజమైతే, 'స్పిరిట్' సినిమాకు ఇది అదనపు బలాన్ని చేకూరుస్తుంది. కాజోల్ వంటి స్టార్ నటి ఉండటం వల్ల సినిమాకు నార్త్ ఇండియాలో మరింత క్రేజ్ రావడమే కాకుండా, నార్త్-సౌత్ నటీనటుల కలయికతో సినిమా స్థాయి మరింత పెరుగుతుంది.
కాజోల్‌కు తొలి తెలుగు సినిమా
కాజోల్ గతంలో 'వీఐపీ 2', 'మెరుపు కలలు' వంటి తమిళ చిత్రాల్లో నటించారు. కానీ ఆమె ఇప్పటివరకు ఒక్క పూర్తి స్థాయి తెలుగు సినిమాలో కూడా నటించలేదు. ఒకవేళ 'స్పిరిట్'లో ఆమె నటిస్తే ఇదే ఆమెకు టాలీవుడ్ అరంగేట్రం అవుతుంది. ఇది కేవలం అతిథి పాత్ర కాదని, కథలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న బరువైన పాత్ర అని ఇండస్ట్రీ టాక్. ఈ పాత్ర సినిమాకు ఎమోషనల్ డెప్త్‌ను ఇస్తుందని భావిస్తున్నారు.
'అర్జున్ రెడ్డి', 'యానిమల్' వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో 'స్పిరిట్'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో ప్రభాస్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ప్రస్తుతం నేషనల్ క్రష్‌గా మారిన తృప్తి డిమ్రి ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాజోల్ ఎంట్రీపై చిత్ర బృందం నుండి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయితే బాక్సాఫీస్ దగ్గర మరిన్ని రికార్డులు ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


