ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 7 సినిమాలు.. తెలుగులో 2 మాత్రమే.. ఒకేదాంట్లో 4 స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 7 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో ఏకంగా నాలుగు సినిమాలు ఒక్క ఓటీటీలోనే ప్రీమియర్ అవుతున్నాయి. అలాగే, వీటిలో కేవలం రెండు సినిమాలు మాత్రమే తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. మరి ఆ సినిమాలు, వాటి జోనర్స్, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Dec 3, 2025, 12:59:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ఇవాళ (డిసెంబర్ 03) ఒక్కరోజే 7 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో ఒకేదాంట్లో ఏకంగా నాలుగు సినిమాలు ఓటీటీ ప్రీమియర్ అవుతున్నాయి. అలాగే, వీటన్నింట్లో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా కేవలం 2 సినిమాలు మాత్రమే ఉన్నాయి. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో లుక్కేద్దాం.

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 7 సినిమాలు.. తెలుగులో 2 మాత్రమే.. ఒకేదాంట్లో 4 స్ట్రీమింగ్.. ఎక్కడంటే?
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 7 సినిమాలు.. తెలుగులో 2 మాత్రమే.. ఒకేదాంట్లో 4 స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

క్రిప్టో మ్యాన్ ఓటీటీ

2025లో ఫినాన్షియల్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కింది క్రిప్టో మ్యాన్. ఇది ఒక కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం. క్రిప్టో కరెన్సీ విధానం, అది ఎలా క్రాష్ అయింది వంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను డైరెక్టర్ హ్యూన్ హే రి తెరకెక్కంచారు. ఐఎమ్‌డీబీలో పదికి 7.3 రేటింగ్ సాధించుకుంది ఈ సినిమా.

అమెజాన్ ప్రైమ్‌లో ఇవాళ (డిసెంబర్ 03) క్రిప్టో మ్యాన్ ఓటీటీ రిలీజ్ అయింది. కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ అయిన క్రిప్టో మ్యాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కూడా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

మై సీక్రెట్ శాంటా ఓటీటీ

మై సీక్రెట్ శాంటా మూవీ ఒక అమెరికన్ రొమాంటిక్ కామెడీ చిత్రం. మైఖేల్ రోహి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అలేగ్జాండ్ర బ్రెకెన్‌రిడ్జ్, ర్యాన్ ఎగ్గోల్డ్, టియా మౌరి ప్రధాన పాత్రలు పోషించారు. నేటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో మై సీక్రెట్ శాంటా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

విత్ లవ్ మేగన్ హాలీడే సెలబ్రేషన్ ఓటీటీ

విత్ లవ్ మేగన్ అనేది ఒక ఇంగ్లీష్ రియాలిటీ షో. ఈ షో నుంచి సీజన్ 2గా విత్ లవ్ మేగన్ హాలీడే సెలబ్రేషన్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఈ రియాలిటీ షో లైఫ్‌స్టైల్, ఫుడ్, ట్రావెల్, గార్డెనింగ్ వంటి విషయాల ఆధారంగా రన్ చేస్తారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఇవాళ విత్ లవ్ మేగన్ సీజన్ 2 ఓటీటీ రిలీజ్ అయింది.

స్ట్రాండెడ్ విత్ మై మదర్ ఇన్ లా సీజన్ 3 ఓటీటీ

స్ట్రాండెడ్ విత్ మై మదర్ ఇన్ లా కూడా ఒక రియాలిటీ గేమ్ షో. ఒక ఆరుగురు కపుల్స్ మిస్టీరియస్ బీచ్‌కు ట్రావెల్ అవుతారు. అక్కడ వీరికి గేమ్స్, టాస్క్‌లు పెడుతుంటారు. 6.4 రేటింగ్ ఉన్న ఈ రియాలిటీ షో నెట్‌ఫ్లిక్స్‌లో ఇవాళ్టీ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

ఓ వాట్ ఫన్ ఓటీటీ

2025లో తెరకెక్కిన అమెరికన్ క్రిస్మస్ కామెడీ ఫిల్మ్ ఓ వాట్ ఫన్. తనను మర్చిపోయిన కుటుంబాన్ని మళ్లీ కలిసేందుకు ఓ మహిళ వేసే స్కెచ్ కథగా ఈ సినిమా సాగుతుంది. మైఖేల్ షోల్టర్ దర్శకత్వం వహించిన ఓ వాట్ ఫన్ సినిమా నేటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ అవుతోంది. ఇంగ్లీష్‌తోపాటు తెలుగులో కూడా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

ది హంట్ ఓటీటీ

ఇంగ్లీష్‌లో హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన వెబ్ సిరీస్ ది హంట్. హారర్, యాక్షన్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ సిరీస్ ఇవాళ ఆపిల్ ప్లస్ టీవీలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఔకాత్ కే బహర్ ఓటీటీ

హిందీలో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్‌ ఔకాత్ కే బహర్. ఈ సిరీస్ ఇవాళ ఔకాత్ కే బహర్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More