ఇవాళ ఓటీటీలో రెండు తమిళ సినిమాలు వైరల్ గా మారాయి. ఇందులో ఒకటి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కాగా.. మరొకటి రొమాంటిక్ కామెడీ మూవీ. ఈ రెండు ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఓటీటీగా మారాయి. ఈ రెండు సినిమాలు ఏంటో ఓ లుక్కేయండి.
ఓటీటీలో కంటెంట్ అదిరిపోతే భాషతో సంబంధం లేదు. ఏ భాషలోని సినిమాలనైనా తెలుగు ఆడియన్స్ అలరిస్తూనే ఉంటారు. ఇవాళ అలాంటి అదిరిపోయే కంటెంట్ తో రెండు తమిళ చిత్రాలు ఓటీటీలోకి వచ్చాయి. ఇందులో ఒకటి ఆర్యన్ కాగా, మరొకటి ఆన్ పావమ్ పొల్లతత్తు. ఈ రెండు సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయో చూసేయండి.
ఇవాళ ఓటీటీలో రెండు తమిళ వైరల్ సినిమాలు (x)
ఆర్యన్ ఓటీటీ
శుక్రవారం (నవంబర్ 28) ఓటీటీలోకి తమిళ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఆర్యన్ వచ్చేసింది. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది. ఇందులో విష్ణు విశాల్ లీడ్ రోల్ ప్లే చేశాడు. డిఫరెంట్ స్టోరీ కాన్సెప్ట్ తో తెరకెక్కింది ఆర్యన్ మూవీ.
మర్డర్ మిస్టరీ
ఓటీటీ రిలీజ్ సందర్భంగా ఆర్యన్ మూవీ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఇది మర్డర్ మిస్టరీ, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్. అదిరిపోయే ట్విస్ట్ లతో, ఉత్కంఠ పంచుతూ సాగుతోంది ఈ చిత్రం. ఓ ఫెయిల్డ్ రైటర్ ఓ టీవీ షోలో పాల్గొంటాడు. తాను చనిపోయిన తర్వాత అయిదు హత్యలు జరుగుతాయని, మరణించిన వ్యక్తే చంపుతాడని చెప్పి ఆ రైటర్ సూసైడ్ చేసుకుంటాడు. ఆ తర్వాత హత్యలు జరుగుతాయి. వీటిని ఎవరు చేశారన్నది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.
ఆన్ పావమ్ పొల్లతత్తు ఓటీటీ
తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ ఆన్ పావమ్ పొల్లతత్తు. రియో రాజ్, మాళవిక మనోజ్, షీలా రాజ్ కుమార్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఇవాళ ఓటీటీలో రిలీజైంది. దీనికి కలైసారన్ తంగవేల్ డైరెక్టర్. ఈ మూవీ జియోహాట్ స్టార్ లో అయిదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలో అందుబాటులో ఉంది.
రొమాంటిక్ కామెడీ
న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీగా ఆన్ పావమ్ పొల్లతత్తు థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసింది. ఈ సినిమా అక్టోబర్ 31, 2025న థియేటర్లలో విడుదలైంది. పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్లు రాబట్టింది ఈ మూవీ.
శివ (రియో రాజ్), శక్తి (మాళవిక మనోజ్)కు పెళ్లి జరుగుతుంది. పెద్దలు కుదిర్చిన వివాహం వీళ్లది. పెళ్లయిన కొన్ని రోజుల వరకూ బాగానే ఉంటారు. కానీ ఆ తర్వాత గొడవలు స్టార్ట్ అవుతాయి. శక్తి తాళి తీసేస్తుంది. ఎక్కవ టైమ్ రీల్స్ చేయడం కోసమే స్పెండ్ చేస్తుంది. దీంతో వీళ్లు విడాకుల కోసం కోర్టుకు వెళ్తారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందన్నది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.