OTT Telugu: ఓటీటీలో తెలుగులో ఏకంగా 17 సినిమాలు- చూసేందుకు అన్నీ స్పెషలే, 7 మాత్రం ఇంట్రెస్టింగ్- నెట్‌ఫ్లిక్స్ టు జీ5!

OTT Release Telugu: ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో ఏకంగా 17 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు అన్ని రకాల జోనర్లతో స్పెషల్‌గా ఉంటే 7 తెలుగు స్ట్రయిట్ సినిమాలు ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ తదితర ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో చూద్దాం.

Published on: Mar 9, 2026, 18:00:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో ఏకంగా 17 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. హారర్ నుంచి డార్క్ కామెడీ, ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా, సైన్స్ ఫిక్షన్ వంటి అన్ని రకాల జోనర్లలో ఆ సినిమాలు ఉన్నాయి. మరి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, ఆహా, జీ5 తదితర ఓటీటీలలో డిజిటల్ రిలీజ్ అయిన ఆ తెలుగు సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

ఓటీటీలో తెలుగులో ఏకంగా 17 సినిమాలు- చూసేందుకు అన్నీ స్పెషలే, 7 మాత్రం ఇంట్రెస్టింగ్- నెట్‌ఫ్లిక్స్ టు జీ5!
ఓటీటీలో తెలుగులో ఏకంగా 17 సినిమాలు- చూసేందుకు అన్నీ స్పెషలే, 7 మాత్రం ఇంట్రెస్టింగ్- నెట్‌ఫ్లిక్స్ టు జీ5!

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

వ్లాదిమిర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ డార్క్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 5

విత్ లవ్ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా)- మార్చి 6

హలో బచ్చోన్ (తెలుగు డబ్బింగ్ హిందీ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 6

వార్ మెషీన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- మార్చి 6

ది డైనోసార్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ నేచర్ డాక్యుమెంటరీ సిరీస్)- మార్చి 6

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

సైరెన్స్ కిస్ (తెలుగు డబ్బింగ్ సౌత్ కొరియన్ రొమాంటిక్ థ్రిల్లర్ మిస్టరీ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 2

యంగ్ షేర్లాక్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ స్పై యాక్షన్ అడ్వెంచర్ మిస్టరీ వెబ్ సిరీస్)- మార్చి 4

సుబేదార్ (తెలుగు డబ్బింగ్ హిందీ యాక్షన్ సస్పెన్స్ డ్రామా సినిమా)- మార్చి 5

అన్నగారు వస్తారు (తెలుగు డబ్బింగ్ తమిళ యాక్షన్ కామెడీ చిత్రం)- మార్చి 6

ఈటీవీ విన్ ఓటీటీ

చరిత కామాక్షి (తెలుగు ఫ్యామిలీ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా సినిమా)- మార్చి 5

ఈఎమ్ఐ (తెలుగు ఫ్యామిలీ లవ్ ఎమోషనల్ డ్రామా మూవీ)- మార్చి 8

ఆహా ఓటీటీ

ఓం శాంతి శాంతి శాంతిః (తెలుగు ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా)- మార్చి 4

అనగనగా ఆస్ట్రేలియాలో (తెలుగు రొమాంటిక్ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 6

సన్ నెక్ట్స్ ఓటీటీ

వంచన (తెలుగు లీగల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- మార్చి 3

దేవగుడి (తెలుగు యాక్షన్ రొమాంటిక్ లవ్ డ్రామా ఫిల్మ్)- మార్చి 3

జీ5 అండ్ హాట్‌స్టార్‌లలో

విక్రమ్ ఆన్ డ్యూటీ (తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జియో హాట్‌స్టార్ ఓటీటీ- మార్చి 6

గాంధీ టాక్స్ (తెలుగు డబ్బింగ్ సైలెంట్ డార్క్ కామెడీ డ్రామా సినిమా)- జీ5 ఓటీటీ- మార్చి 6

ఓటీటీలోకి తెలుగులో 17

ఇలా గత వారం (మార్చి 2 నుంచి 8 వరకు) తెలుగులో ఏకంగా 17 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వాటిలో అన్ని సినిమాలు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.

ఇంట్రెస్టింగ్‌గా 7 సినిమాలు

అయితే, డబ్బింగ్ కాకుండా తెలుగులో స్ట్రయిట్‌గా రిలీజ్ అయిన చరిత కామాక్షి, ఈఎమ్ఐ, విక్రమ్ ఆన్ డ్యూటీ వంచన, దేవగుడి, అనగనగా ఆస్ట్రేలియాలో, ఓం శాంతి శాంతి శాంతిః మూవీతో కలిపి 7 సినిమాలు మాత్రం ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More