OTT Horror: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన టైమ్ లూప్ హారర్ థ్రిల్లర్- స్కూల్ పిల్లలకు వింత శాపం- బాడీ పార్ట్స్ కలిపితే విముక్తి!

OTT Release Today Horror Thriller: ఓటీటీలోకి ఇవాళ టైమ్ లూప్ హారర్ థ్రిల్లర్ మూవీ రి/మెంబర్ ది లాస్ట్ నైట్. సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ రి/మెంబర్ మూవీకి ఇది సీక్వెల్. వింత శాపంతో ఆరుగురు స్కూల్ పిల్లలు ఒక టైమ్ లూప్‌లో చిక్కుపోయే కథతో వచ్చిన రి/మెంబర్ ది లాస్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసుకుందాం.

Published on: Mar 5, 2026, 18:39:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హారర్ సినిమాల్లో రక్తం చిందడం, ఆత్మలు వెంటాడటం కామన్. కానీ, చనిపోయిన తర్వాత మళ్లీ అదే రోజు ఉదయం నిద్రలేచి, అదే భయాన్ని పదే పదే అనుభవించాల్సి వస్తే? ఈ విభిన్నమైన 'టైమ్ లూప్' (Time Loop) కాన్సెప్ట్‌తో వచ్చిన జపనీస్ హారర్ థ్రిల్లర్ సినిమానే 'రి/మెంబర్' (Re/Member).

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన టైమ్ లూప్ హారర్ థ్రిల్లర్- స్కూల్ పిల్లలకు వింత శాపం- బాడీ పార్ట్స్ కలిపితే విముక్తి!
ఓటీటీలోకి ఇవాళ వచ్చిన టైమ్ లూప్ హారర్ థ్రిల్లర్- స్కూల్ పిల్లలకు వింత శాపం- బాడీ పార్ట్స్ కలిపితే విముక్తి!

టైమ్ లూప్ హారర్ థ్రిల్లర్

2022లో టైమ్ లూప్ హారర్ థ్రిల్లర్‌గా వచ్చిన రి/మెంబర్ ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా 'రీ/మెంబర్: ది లాస్ట్ నైట్' (Re/Member: The Last Night) ఓటీటీలోకి ఇవాళ (మార్చి 5) అడుగుపెట్టింది.

కథేంటంటే?

తొలి భాగంలో అసుక అనే అమ్మాయి మాయమైన మూడు ఏళ్ల తర్వాత ఈ సీక్వెల్ కథ మొదలవుతుంది. ఒక హైస్కూల్‌లో చదివే ఆరుగురు విద్యార్థులు అనుకోకుండా ఒక 'బాడీ సర్చ్' (మృతదేహ భాగాల వేట) అనే వింత శాపంలో చిక్కుకుంటారు. ప్రతిరోజూ అర్థరాత్రి వారు తిరిగి తమ స్కూల్ లైబ్రరీలో నిద్రలేస్తారు. అక్కడ 'రెడ్ పర్సన్' (ఎర్రటి దుస్తుల్లో ఉండే ఒక చిన్నారి ఆత్మ) వారిని వేటాడి చంపేస్తుంది.

ట్విస్ట్ ఏంటంటే.. వారు అక్కడ చనిపోయిన ప్రతిసారీ, మళ్లీ నిన్నటి రోజునే నిద్రలేస్తారు. ఈ నరకం నుంచి బయటపడాలంటే స్కూల్ ఆవరణలో దాచిపెట్టిన ఒక అమ్మాయి శరీర భాగాలన్నింటినీ వెతికి, వాటిని శవపేటికలో అమర్చాలి. అప్పుడే ఆ టైమ్ లూప్ ముగుస్తుంది. అంటే, ఆ డెడ్ బాడీ పార్ట్స్ కలిపితేనే వారికి విముక్తి కలుగుతుంది.

ట్విస్టులు

అలానే, ఈ సీక్వెల్‌లో తొకహిరతో కలిపి ఆరుగురు స్కూల్ విద్యార్థులు ఆ వింత శాపంలో చిక్కుంటారు. మరి ఆ విద్యార్థులు ఒకరికొకరు ఎలా సహకరించుకున్నారు? ఆ భయంకరమైన రెడ్ పర్సన్ నుంచి తప్పించుకున్నారా? అసలు అన్ని పార్ట్స్ పెట్టాల్సిన బాడీ ఎవరిది? ఈ స్కూల్ పిల్లలకే అలా ఎందుకు జరుగుతుంది? అనేది మిగిలిన కథ.

ఈసారి కొత్తగా ఏముంది?

తొలి భాగం స్కూల్ నేపథ్యంలో సాగితే, ఈసారి మేకర్స్ ఒక పాడుబడిన 'అమ్యూజ్‌మెంట్ పార్క్' (Amusement Park)ను వేదికగా ఎంచుకున్నారు. రంగురంగుల లైట్లు, ఎగిరే రాట్నాలు ఉన్న పార్కులో ఆత్మ వెంటాడటం చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. పాత పాత్రలతో పాటు కొత్త విద్యార్థులు రావడం, తకహిరో తన ప్రేమ కోసం అన్వేషించడం వంటి ఎమోషనల్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఆకట్టుకుంటాయి.

రి/మెంబర్ ది లాస్ట్ నైట్ ఓటీటీ స్ట్రీమింగ్

టైమ్ లూప్ కాన్సెప్ట్‌తో హారర్, సర్వైవల్ అంశాలను జోడించి తెరకెక్కిన రి/మెంబర్ ది లాస్ట్ నైట్ ట్విస్టులతో ఆకట్టుకుంటుంది. అలాంటి రి/మెంబర్ ది లాస్ట్ నైట్ ఓటీటీలోకి నేడు వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 5 అంటే ఇవాళ్టీ నుంచి రి/మెంబర్ ది లాస్ట్ నైట్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో

ప్రస్తుత కేవలం జపనీస్ భాషలోనే రి/మెంబర్ ది లాస్ట్ నైట్ ఓటీటీ రిలీజ్ అయింది. కానీ, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో రి/మెంబర్ ది లాస్ట్ నైట్ మూవీని వీక్షించవచ్చు. హారర్ థ్రిల్లర్, సర్వైవల్, టైమ్ లూప్ అంశాలు ఇష్టపడేవారు నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో ప్రీమియర్ అవుతోన్న రి/మెంబర్ ది లాస్ట్ నైట్ మూవీని ఎంచక్కా చూసేయొచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More