మరీ చీప్‌గా కనిపిస్తాననుకుంటే ఆ పాత్రకు నో చెప్పేస్తా.. ఆడవాళ్లను ఆట వస్తువులుగా చూపించడం అంతటా ఉంది: రాశీ ఖన్నా

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వెళ్లిన నటి రాశీ ఖన్నా సౌత్ సినిమాల్లోనే కాదు హిందీలోనూ అమ్మాయిను ఆట వస్తువులుగా చూపిస్తున్నారని అనడం విశేషం. తన పాత్రల విషయం మాట్లాడుతూ.. మరీ చీప్‌గా కనిపిస్తాననుకుంటే నో చెప్పేస్తానని చెప్పింది.

Published on: Nov 28, 2025, 14:26:11 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సినిమాల్లో ఆడవాళ్లను ఆట వస్తువులుగా చూపించడం చాలాకాలంగా వస్తున్నదే. అయితే ఇది కేవలం సౌత్ సినిమాలకే కాదు.. బాలీవుడ్ లోనూ ఉందని రాశీ ఖన్నా అంటోంది. జూమ్‌కి తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరోయిన్లను కేవలం ఎక్స్‌పోజింగ్ కు మాత్రమే పరిమితం చేసే పాత్రలపై స్పందించింది.

మరీ చీప్‌గా కనిపిస్తాననుకుంటే ఆ పాత్రకు నో చెప్పేస్తా.. ఆడవాళ్లను ఆట వస్తువులుగా చూపించడం అంతటా ఉంది: రాశీ ఖన్నా
మరీ చీప్‌గా కనిపిస్తాననుకుంటే ఆ పాత్రకు నో చెప్పేస్తా.. ఆడవాళ్లను ఆట వస్తువులుగా చూపించడం అంతటా ఉంది: రాశీ ఖన్నా

రాశీ ఖన్నా ఏమన్నదంటే?

సౌత్ ఇండియా సినిమాలలో మహిళల చిత్రీకరణ గురించి రాశీ ఖన్నా ఈ ఇంటర్వ్యూలో మాట్లాడింది. "ఇది కేవలం సౌత్ కు పరిమితమైనది మాత్రమే కాదు. నేను దీన్ని నార్త్‌లో కూడా చాలా చూస్తున్నాను. ఇది పూర్తిగా ఆయా నటుల ఛాయిస్ పై ఆధారపడి ఉంటుంది. కొంతమందికి దానితో ఇబ్బంది ఉండదు. మరికొందరికి ఉంటుంది" అని ఆమె అభిప్రాయపడింది.

"నేను సౌత్‌లో చాలా కమర్షియల్ సినిమాలు చేశాను. కాబట్టి ఇప్పుడు హిందీలో ఒక అడుగు ముందుకు వేసి కంటెంట్ ఆధారిత పాత్రలలోకి వెళ్లాలని అనుకుంటున్నాను. కమర్షియల్ అంశాలను చేయడానికి నాకు ఓకే. కానీ నాకు కూడా ఒక పరిమితి ఉంది. ప్రతి యాక్టర్ పరిమితి వేరుగా ఉంటుంది, అదే వారు ఎవరనేది చెబుతుంది" అని రాశీ చెప్పింది.

ఆమె ఇంకా మాట్లాడుతూ.. "నేను చేస్తున్న దానితో నేను సౌకర్యంగా ఉండటం చాలా ముఖ్యం. ఒక హద్దు దాటుతుందని, అందులో నేను చీప్ గా కనిపిస్తానని నేను భావిస్తే దానికి 'నో' చెప్తాను. ప్రతి యాక్టర్ కి వేరే కంఫర్ట్ జోన్ ఉంటుంది. నేను ఎవరినీ జడ్జ్ చేయను" అని స్పష్టం చేసింది.

రాశీ ఖన్నా కెరీర్ ఇలా..

రాశీ ఖన్నా తెలుగులో చాలా సినిమాలే చేసింది. ఇప్పుడు బాలీవుడ్ లో బిజీ అవుతోంది. '120 బహదూర్' అనే హిస్టారికల్ వార్ ఫిల్మ్‌లో రాశీ ఖన్నా తాజాగా కనిపించింది. రజనీష్ ఘాయ్ దర్శకత్వం వహించిన, ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ చిత్రంలో ఫర్హాన్ అక్తర్ మేజర్ షైతాన్ సింగ్ పాత్రలో, రాశీ ఖన్నా ఆయన భార్య షగుణ్ కన్వర్ పాత్రలో నటించారు. వివియన్ భతేనా, అంకిత్ సివాచ్ సహాయక పాత్రల్లో నటించారు.

ఈ సినిమా 1962 నవంబర్ 18న జరిగిన చైనా-భారత్ యుద్ధంలో ప్రధాన సంఘటనలలో ఒకటిగా పరిగణించే రెజాంగ్ లా యుద్ధం కథను చూపిస్తుంది. ఈ యుద్ధంలో కేవలం ఛార్లీ కంపెనీ13 కుమవోన్ రెజిమెంట్‌కు చెందిన 120 మంది భారతీయ సైనికులు.. 3,000 మంది బలమైన చైనా సైన్యంతో వీరోచితంగా పోరాడారు. ఈ పోరాటంలో చైనా వైపు 1,300 కంటే ఎక్కువ మంది మరణించినట్లు అంచనా. ఈ సినిమా విమర్శకుల నుండి పాజిటివ్ రివ్యూలు అందుకుని, ఇప్పటి వరకు దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ.15 కోట్లు వసూలు చేసింది.

రాశీ ఖన్నా ప్రస్తుతం పవన్ కళ్యాణ్, శ్రీలీలతో కలిసి 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంలో కనిపించనుంది. ఈ సినిమా ఏప్రిల్ 2026లో థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇది కాకుండా షాహిద్ కపూర్‌తో కలిసి నటించిన ‘ఫర్జీ సీజన్ 2’ వెబ్ సిరీస్ కూడా ఆమె లైన్‌లో ఉంది. దీని చిత్రీకరణ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More