నా భర్త వేధిస్తున్నాడు.. రూ.50 కోట్లు ఇప్పించండి: కోర్టుకెక్కిన బాలీవుడ్ నటి
బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ కోర్టుకెక్కింది. తన భర్త వేధిస్తున్నాడని, తనకు పరిహారం రూపంలో రూ.50 కోట్లు ఇప్పించాలని కోరింది. ముంబైలోని అంధేరీ కోర్టులో ఆమె కేసు దాఖలు చేసింది.
మాజీ నటి, మాజీ మిస్ ఇండియా రన్నరప్ సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్ పై డొమెస్టిక్ వయోలెన్స్ కేసు దాఖలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్రలోని ముంబై అంధేరి కోర్టులో జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ముందు ఆమె ఈ కేసు వేసింది. పీటర్ హాగ్ ఆస్ట్రియాకు చెందిన వ్యక్తి. ఆ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

భర్తపై సెలీనా కేసు వివరాలు
బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తెలుసు కదా. ఇప్పుడామె తన భర్తపైనే కోర్టుకెక్కింది. గృహ హింస, క్రూరత్వం, మోసం ఆరోపణల కింద డొమెస్టిక్ వయొలెన్స్ చట్టం ప్రకారం సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్ పై కేసు దాఖలు చేసింది. ఈ కేసు ధృవీకరణ, నోటీసు కోసం మంగళవారం (నవంబర్ 25)నాడు అంధేరిలోని లీగల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ఎస్.సి. టడ్యే కోర్టు ముందు విచారణకు వచ్చింది.
ఏఎన్ఐ వార్తా సంస్థ ప్రకారం తన ఆదాయ వనరులు, ఆస్తుల నష్టానికి బదులుగా సెలీనా జైట్లీ రూ.50 కోట్ల నష్టపరిహారం, ఇతర మొత్తాలను కోరినట్లు తెలిసింది. సెలీనా 2011లో ఆస్ట్రియన్ వ్యవస్థాపకుడు, హోటలియర్ అయిన పీటర్‌ను వివాహం చేసుకుంది. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. 2012లో విన్‌స్టన్, విరాజ్ అనే కవలలు జన్మించారు. 2017లో శంషేర్, ఆర్థర్ అనే మరో కవలలు జన్మించారు. అయితే 2017లో జన్మించిన కవలల్లో ఒకరైన శంషేర్ గుండె సమస్య కారణంగా మరణించాడు.
సెలీనా సోదరుడి వ్యవహారం
మాజీ మిస్ ఇండియా విజేత అయిన సెలీనా జైట్లీ ఇటీవల తన సోదరుడు, మేజర్ (రిటైర్డ్) విక్రాంత్ జైట్లీ విషయంలోనూ వార్తల్లో నిలిచింది. సెప్టెంబర్ 2024లో తన సోదరుడిని యూఏఈలో అక్రమంగా నిర్బంధించారని ఆమె ఆరోపించింది. ఈ నెల ప్రారంభంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ.. సెలీనా జైట్లీ సోదరుడికి సాధ్యమైన అన్ని సహాయాలను అందిస్తున్నట్లు తెలిపింది.
నవంబర్ 7న వీక్లీ మీడియా బ్రీఫింగ్‌లో విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. "మా రాయబార కార్యాలయం ఈ విషయాన్ని పరిశీలిస్తోంది. మేము అతన్ని నాలుగు సార్లు కాన్సులర్ విజిట్స్ చేశాం" అని తెలిపారు.
తన సోదరుడికి చట్టపరమైన సహాయం అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సెలీనా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు.. మాజీ ఆర్మీ అధికారి అయిన విక్రాంత్‌కు చట్టపరమైన సహాయం అందించాలని విదేశాంగ శాఖకు స్పష్టం చేసింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


