ఓటీటీలోకి నిన్న రిలీజైన సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా, ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్- 2 ఒకేదాంట్లో- స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి నిన్న (అక్టోబర్ 17) థియేటర్లలో విడుదలైన సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ థ్రిల్లర్ తెలుసు కదా, ప్రదీప్ రంగనాథన్ రొమాంటిక్ కామెడీ మూవీ డ్యూడ్ స్ట్రీమింగ్‌పై ఆసక్తి నెలకొంది. ఇద్దరు హీరోయిన్స్ ఉన్న ఈ రెండు సినిమాలు ఒకేదాంట్లో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏంటో తెలుసుకుందాం.
ఓటీటీలోకి ఎప్పుడు ఏ సినిమా వస్తుందో చెప్పలేం. కొన్నిసార్లు థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఓటీటీ రిలీజ్ అవుతాయనుకుంటే దానికంటే ముందే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లలో దర్శనం ఇస్తుంటాయి. కొన్ని నెలలు గడిచిన ఓటీటీ స్ట్రీమింగ్‌కు రావు.

ఓటీటీ ఆడియెన్స్ ఇంట్రెస్ట్
ఇక కొత్త సినిమాలు థియేటర్లలో విడుదల అయ్యాయి అంటే వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు సంబంధించిన విషయాలపై తెగ ఆసక్తి చూపిస్తుంటారు ఓటీటీ ఆడియెన్స్. అలా ఇప్పుడు రెండు సినిమాలపై ఓటీటీ ప్రేక్షకులు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అవే తెలుసు కదా, డ్యూడ్ సినిమాలు.
తెలుసు కదా డైరెక్టర్
సిద్ధు జొన్నలగడ్డ జాక్ తర్వాత నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా తెలుసు కదా. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన దర్శకురాలి అవతారం ఎత్తిన ఈ సినిమాలో ఇద్దరు ముద్దుగుమ్మలు రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. అక్టోబర్ 17న థియేటర్లలోకి వచ్చిన తెలుసు కదా ఓటీటీ రైట్స్ రిలీజ్‌కు ముందే అమ్ముడు పోయాయి.
తెలుసు కదా బడ్జెట్
ఎస్ఎస్ తమన్ సంగీతం అందించిన తెలుసు కదా సినిమాకు రూ. 45 కోట్ల వరకు బడ్జెట్ అయినట్లు సమాచారం. అయితే, థియేట్రికల్ రిలీజ్‌కు ముందే తెలుసు కదా ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయాయి. ప్రముఖ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ తెలుసు కదా ఓటీటీ హక్కులను సుమారుగా రూ. 22 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.
తెలుసు కదా ఓటీటీ ప్లాట్‌ఫామ్
కాబట్టి, నెట్‌ఫ్లిక్స్‌లోనే తెలుసు కదా ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. సినిమాకు వచ్చే టాక్, కలెక్షన్స్, థియేట్రికల్ రన్ అన్నింటిని దృష్టిలో ఉంచుకుని నెట్‌ఫ్లిక్స్‌లో తెలుసు కదాను ఓటీటీ రిలీజ్ చేయనున్నారు మేకర్స్.
డ్యూడ్‌గా ప్రదీప్
లవ్ టుడే, డ్రాగన్ వంటి సూపర్ హిట్స్ తర్వాత ప్రదీప్ రంగనాథన్ హీరోగా చేసిన నయా సినిమా డ్యూడ్. రొమాంటిక్ కామెడీ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీకి కీర్తిశ్వరన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమాలో కూడా ఇద్దరు ముద్దుగుమ్మలు మమితా బైజు, నేహా శెట్టి హీరోయిన్లుగా చేశారు.
డ్యూడ్ బడ్జెట్
నిన్న అంటే అక్టోబర్ 17న తెలుసు కదా సినిమాతో పాటు బాక్సాఫీస్ పోటీకి దిగిన డ్యూడ్ కూడా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. రూ. 30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన డ్యూడ్ ఓటీటీ రైట్స్ కూడా సేల్ అయిపోయాయి. తెలుసు కదా సినిమాను కొనుగోలు చేసిన నెట్‌ఫ్లిక్స్ డ్యూడ్ ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది.
డ్యూడ్ ఓటీటీ స్ట్రీమింగ్
దాదాపుగా రూ. 25 కోట్లు వెచ్చించి డ్యూడ్ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుందని సమాచారం. కాబట్టి, టాక్, కలెక్షన్స్, థియేట్రికల్ రన్ అన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత డ్యూడ్ కూడా నెట్‌ఫ్లిక్స్‌లోనే ఓటీటీ ప్రీమియర్ కానుంది. ఇలా నిన్న థియేట్రికల్ రిలీజ్ అయిన రెండు సినిమాలు ఒక్క నెట్‌ఫ్లిక్స్‌లోనే ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


