అతి తక్కువగా సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా తొలి రోజు కలెక్షన్స్- ఫ్లాప్ మూవీ జాక్ తరహాలోనే- ఎన్ని కోట్లు వచ్చాయంటే?
సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి నటించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ సినిమా తెలుసు కదా. నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అయిన ఈ సినిమా అక్టోబర్ 17న విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ క్రమంలో తెలుసు కదా సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో సూపర్ హిట్ కొట్టిన సిద్ధు జొన్నలగడ్డ జాక్ మూవీతో పరాజయం చూశాడు. జాక్ తర్వాత మరో హిట్ కోసం సిద్ధు జొన్నలగడ్డ ప్రయత్నం చేసిన సినిమా తెలుసు కదా. ఈ సినిమాలో సిద్ధుకు జోడీగా ఇద్దరు హీరోయిన్స్ రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి నటించారు.

దర్శకురాలిగా నీరజ కోన
తెలుసు కదా సినిమాతో ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అయ్యారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన తెలుసు కదా సినిమా అక్టోబర్ 17న థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమాకు తొలిరోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చాయో ఇక్కడ చూద్దాం.
తెలుసు కదా నెట్ కలెక్షన్స్
తెలుసు కదా సినిమాకు ఇండియాలో రూ. 2 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సక్నిల్క్ సంస్థ పేర్కొంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ లెక్కల ప్రకారం తెలుసు కదా సినిమాకు బాగానే కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల వసూల్లు
తెలుసు కదా చిత్రానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మొదటి రోజు కోటి రూపాయల షేర్ కలెక్షన్స్ దాటే ఛాన్స్ ఉందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఆన్‌లైన్ మాత్రమే కాకుండా ఆఫ్‌లైన్ లెక్కలను బట్టి తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున తెలుసు కదా సినిమాకు రూ. 1.25 రేంజ్‌లో షేర్ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేశారు.
జాక్ సినిమా తరహాలోనే
అయితే, సిద్ధు జొన్నలగడ్డ గత సినిమా జాక్‌కు సిమిలర్‌గానే తెలుసు కదా కలెక్షన్స్ ఉండే అవకాశం కనిపిస్తోందని సమాచారం. ఇకపోతే కర్ణాటక రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో లిమిటెడ్ లొకేషన్స్‌లో తెలుసు కదా పర్వాలేదనిపిస్తోంది.
తెలుసు కదా వరల్డ్ వైడ్ కలెక్షన్స్
ఈ లెక్కన వరల్డ్ వైడ్‌గా తెలుసు కదా సినిమాకు రూ. 1.75 నుంచి 2 కోట్ల రేంజ్‌లో షేర్ కలెక్షన్స్ ఓపెనింగ్స్ రూపంలో రానున్నాయని సమాచారం. అయితే, దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజున 4 నుంచి 5 కోట్ల రేంజ్‌లో గ్రాస్ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే, ఈ కలెక్షన్స్ చాలా తక్కువగా అనిపిస్తోంది.
తెలుసు కదా థియేటర్ ఆక్యుపెన్సీ
కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్ డే రోజున ఉదయం షోలలో 23.52 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. అలాగే, మధ్యాహ్నం షోలకు 24.75 శాతం, సాయంత్రం 24.42 శాతం, రాత్రి షోలకు 38.99 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


