Harish Shankar: నాకు ఆ కామన్ సెన్స్ ఉంది.. వారణాసితో రికార్డులు.. మహేష్ బాబు ఫ్యాన్స్ కు సారీ చెప్పిన హరీష్ శంకర్

Harish Shankar: సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ సారీ చెప్పాడు. పొరపాటు జరిగిందని చింతించాడు. అసలు ఏమైందో ఇక్కడ చూసేయండి. 

Mar 11, 2026, 14:04:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మరికొన్ని రోజుల్లోనే పవన్ కల్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కాబోతుంది. ఈ మూవీకి హరీష్ శంకర్ డైరెక్టర్. ఈ మూవీ రిలీజ్, ప్రమోషన్లలో బిజీగా ఉన్న హరీష్ శంకర్ ఇవాళ మహేష్ బాబు ఫ్యాన్స్ కు సారీ చెప్తూ ఓ నోట్ రిలీజ్ చేశాడు. తాను చేసిన ఓ ట్వీట్ కు అతను చింతించాడు.

హరీష్ శంకర్ (x/harish2you)
హరీష్ శంకర్ (x/harish2you)

హరీష్ శంకర్ సారీ

డైరెక్టర్ హరీష్ శంకర్ బుధవారం (మార్చి 11) ఎక్స్ లో పెట్టిన పోస్టు తెగ వైరల్ గా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు సారీ చెప్తూ హరీష్ శంకర్ పోస్టు పెట్టాడు. అనుకోకుండా పొరపాటున ఓ ట్వీట్ పెట్టానని అతను ఒప్పుకొన్నాడు. తన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కు ఇంకా 10 రోజుల కూడా లేవని అతనన్నాడు. ఈ సమయంలో ఎలాంటి పోస్టులు పెట్టాలనే కామన్ సెన్స్ తనకు ఉందని అన్నాడు.

అసలు ఏమైందంటే?

మార్చి 19న థియేటర్లకు రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్, ప్రమోషన్లలో హరీష్ శంకర్ బిజీగా ఉన్నాడు. BoB రికార్డును పవన్ కల్యాణ్ బద్దలు కొట్టాలని ఓ అభిమాని ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్ ను సీరియస్ గా తీసుకోని హరీష్ శంకర్ ‘తథాస్తు’ అని రిప్లే ఇచ్చాడు. దీంతో BoB అంటే మహేష్ బాబు బాక్సాఫీస్ రికార్డు అని, తమ హీరో రికార్డులే బ్రేక్ చేస్తారా? అంటూ మహేష్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు.

సారీ చెప్తూ పోస్ట్

తన పోస్టు కారణంగా మహేష్ బాబు, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మధ్య వార్ స్టార్ట్ కావడంతో హరీష్ శంకర్ అలెర్ట్ అయ్యాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు సారీ చెప్తూ ఎక్స్ లో ఓ సుదీర్ఘ లేఖను పోస్టు చేశాడు.

హరీష్ శంకర్ ట్వీట్ (x)
హరీష్ శంకర్ ట్వీట్ (x)

బిజీగా ఉండి

‘‘నిన్న చాలా బిజీ డే. సెన్సార్ తర్వాత బోర్డ్ అధికారులతో మీటింగ్ లో పాల్గొన్నా. పెద్దమ్మ తల్లి గుడికి వెళ్లా. పోస్ట్ ప్రొడక్షన్ పనులు, బ్యాక్ గ్రౌండ్ స్కోరు పర్యవేక్షిస్తూ బిజీగా గడిపా. ఇదే సమయంలో ప్రొమోను ప్రశంసించిన జర్నలిస్ట్ లు, అభిమానులకు రిప్లేలు ఇచ్చా’’ అని తన లెటర్ లో హరీష్ శంకర్ తెలిపాడు.

అనుకోకుండానే

‘‘ఈ తొందర్లో ఒక ట్వీట్ ను పూర్తిగా చదవకుండానే రిప్లే ఇచ్చా. వెంటనే నా టీమ్ నన్ను అలెర్ట్ చేసింది. ఆ ట్వీట్ లో ఏముందో గమనించి వెంటనే డిలీట్ చేశా. సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఎంతో గౌరవం ఉంది. వారణాసి సినిమాతో ఆయన ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తాడని నమ్ముతున్నా’’ అని హరీష్ శంకర్ పేర్కొన్నాడు.

ఆ ట్వీట్

‘‘ఈ ట్వీట్ అనుకోకుండా చేసిందే. కావాలంటే ఆయన బర్త్ డే రోజు పోకిరి గురించి పెట్టిన పోస్టు చూడండి. మహేష్ అంటే నాకెంత ప్రేమ, గౌరవం ఉందో తెలుస్తుంది. ఏదేమైనా నా కారణంగా కొంతమంది ఫీల్ అయ్యారు. వాళ్లను క్షమించమని కోరుతున్నా. ఓ సినిమా రికార్డులు క్రియేట్ చేయాలంటే అందరి హీరోల అభిమానుల ప్రేమ ఉండాలి. 10 రోజుల్లోపే నా మూవీ రిలీజ్ పెట్టుకుని ఇలాంటి పోస్టు చేయొద్దనే కామన్ సెన్స్ నాకు ఉంది’’ అని హరీష్ శంకర్ తన లెటర్ లో తెలిపాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More