Manchu Manoj Gym Photos: మంచు మనోజ్ న్యూ అవతార్- ప్రతి దెబ్బకు సిద్ధంగా ఉండాలంటూ పోస్ట్- జిమ్‌లో వర్కౌట్ ఫొటోలు వైరల్
Manchu Manoj Gym Photos For David Reddy: టాలీవుడ్ హీరో మంచు మనోజ్ సరికొత్త అవతార్‌లో దర్శనం ఇచ్చాడు. జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న ఫొటోలు షేర్ చేసి తన లక్ష్యం ఏంటో రాసుకొచ్చారు. ప్రతి దెబ్బకు సిద్ధంగా ఉండాలని, కెమెరా అబద్ధం చెప్పదంటూ చెప్పారు. ప్రస్తుతం మంచు మనోజ్ జిమ్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్‌లో వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్నాడు మంచు మనోజ్. ఎప్పటికప్పుడు కొత్తదనంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఆయన తాజాగా మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.

మంచు మనోజ్ పోస్ట్
తాజాగా మంచు మనోజ్ చేసిన పోస్ట్ ఫ్యాన్స్ సహా ప్రేక్షకులను, సినీ వర్గాలను ఆకర్షిస్తున్నాయి. మనోజ్ తన ఫిట్‌నెస్ ట్రాన్స్‌ఫర్మేషన్ గురించిన అప్‌డేట్‌ను షేర్ చేశాడు. రాబోయే సినిమాల కోసం గత మూడు వారాలుగా కఠినంగా శ్రమిస్తున్నానని ఆయన ఈ పోస్ట్‌లో వెల్లడించారు. అలాగే ఆయన పోస్ట్ చేసిన వర్కవుట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నటుడిగా మనోజ్ చూపిస్తోన్న పట్టుదల, కృషిని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఆ పోస్ట్‌లో మనోజ్ తన తీసుకున్న నిర్ణయం గురించి చాలా నిజాయితీగా మాట్లాడారు. సౌకర్యంగా ఉండటానికి సాకులు వెతకకుండా వాటిని పక్కకు పెట్టేసి కష్టపడాలని నిర్ణయించుకున్నానని ఆయన పేర్కొన్నారు.
కేవలం కష్టం మాత్రమే
“మూడు వారాల క్రితం నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక సౌకర్యంతో రాజీ పడటం లేదు. ఇక సాకులు చెప్పాలని అనుకోవటం లేదు. కేవలం కష్టం మాత్రమే,” అని మంచు మనోజ్ రాశారు. ఇదే క్రమంలో యాక్షన్ సినిమాలు చేయడం ఎంత కష్టమో కూడా ఆయన వివరించారు.
“యాక్షన్ సినిమాలో మీ కోసం ఎవరూ నటించలేరు. ప్రతి పంచ్, దెబ్బ తగిలినప్పుడు పడిపోవటం, ప్రతి దెబ్బకు మీ శరీరం సిద్ధంగా ఉండాలి. లేకుంటే వెంటనే బయటపడుతుంది. కెమెరా ఎప్పుడూ అబద్ధం చెప్పదు,” అని మంచు మనోజ్ అన్నారు.
21 రోజుల్లోనే వేరే వ్యక్తిలా
ఇకపై కేవలం లుక్ కోసం కాకాకుండా.. శక్తి, సహనాన్ని పెంచుకోవడంపైనే తాను దృష్టి పెట్టానని మంచు మనోజ్ చెప్పారు. తన లక్ష్యం “ధృడమైన వ్యక్తి”లా తయారవడం అని పేర్కొన్నారు. ఈ అప్‌డేట్‌ను “వీక్ 3” అని పేర్కొంటూ, ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైందని, కానీ కేవలం 21 రోజుల్లోనే తాను పూర్తిగా వేరే వ్యక్తిలా అనిపిస్తున్నానని మంచు మనోజ్ తెలియజేశారు.
ఇక మంచు మనోజ్ ప్రస్తుతం చేస్తోన్న డేవిడ్ రెడ్డి మూవీ తన కెరీర్‌లో అత్యంత భారీ చిత్రాల్లో ఒకటిగా రూపొందుతోంది. ఈ భారీ పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామాను హనుమ రెడ్డి యెక్కంటి తెరకెక్కిస్తున్నారు. నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోతుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
బ్రిటిష్ పాలన కాలంలో
1897 - 1920 మధ్య బ్రిటిష్ వలస పాలన కాలంలో జరిగే కథతో డేవిడ్ రెడ్డి సినిమా రూపొందుతోంది. అణచివేతకు ఎదురు తిరిగే ఒక ధైర్యవంతుడైన యోధుడి జర్నీని ఇందులో చూపిస్తున్నారు. హాలీవుడ్ నటి మారియా ర్యాబోషాప్కా కీలక పాత్రలో నటిస్తోంది.
పాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్‌ను భారీ లెవల్‌లో నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన డేవిడ్ రెడ్డి గ్లింప్స్‌కు అన్నీ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో 10 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. దీంతో మనోజ్ న్యూ అవతార్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper












