పూజా హెగ్డే ఓ పాన్ ఇండియా హీరో చెంప చెల్లుమనిపించిందా? వైరల్ అవుతున్న వార్తల వెనుక అసలు నిజం ఇదీ

పూజా హెగ్డే ఓ పాన్ ఇండియా స్టార్ ను కొట్టిందంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడం సంచలనం రేపింది. అయితే దీనిపై తాజాగా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, ట్రేడ్ అనలిస్టులు స్పందిస్తూ.. అదంతా ఉత్త పుకారే అని కొట్టిపారేశారు.

Published on: Jan 19, 2026, 17:56:14 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సోషల్ మీడియాలో సెలబ్రిటీల గురించి రకరకాల పుకార్లు రావడం సహజమే. కానీ ఈ మధ్య హీరోయిన్ పూజా హెగ్డే గురించి ఒక షాకింగ్ న్యూస్ తెగ వైరల్ అయ్యింది. ఒక పాన్ ఇండియా స్టార్ హీరో షూటింగ్ సమయంలో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడని, దీంతో పూజా అతన్ని చెంపదెబ్బ కొట్టిందన్నది ఆ వార్త సారాంశం. అయితే ఇందులో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

పూజా హెగ్డే ఓ పాన్ ఇండియా హీరో చెంప చెల్లుమనిపించిందా? వైరల్ అవుతున్న వార్తల వెనుక అసలు నిజం ఇదీ
పూజా హెగ్డే ఓ పాన్ ఇండియా హీరో చెంప చెల్లుమనిపించిందా? వైరల్ అవుతున్న వార్తల వెనుక అసలు నిజం ఇదీ

పూజా హెగ్డే కామెంట్స్ ఇలా

పూజా హెగ్డే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నా కెరీర్ ఆరంభంలో ఒక పెద్ద సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు.. ఒక స్టార్ హీరో అనుమతి లేకుండా నా క్యారవాన్‌లోకి వచ్చాడు. నన్ను అసభ్యంగా తాకడానికి ప్రయత్నించడంతో నేను అతన్ని కొట్టాను" అని చెప్పినట్లుగా కొన్ని సోషల్ మీడియా పోస్టులు వైరల్ అయ్యాయి. దీనికి ఏ వీడియో సాక్ష్యం లేకపోయినప్పటికీ, నెటిజన్లు ఆ హీరో ఎవరై ఉంటారా అని చర్చించుకోవడం మొదలుపెట్టారు.

అసలు నిజం ఏంటి?

ఈ వార్త పూర్తిగా అవాస్తవం అని తేలింది. పూజా హెగ్డే అసలు అలాంటి ఇంటర్వ్యూనే ఇవ్వలేదు. ప్రముఖ సినిమా ట్రాకర్, ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా ఈ విషయంపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. "పూజా హెగ్డే గురించి సర్క్యులేట్ అవుతున్న ఆ ఇంటర్వ్యూ వార్త 100 శాతం ఫేక్. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మకండి, షేర్ చేయకండి" అని ఆయన ట్వీట్ చేశారు. ఇండస్ట్రీలోని ఇతర వర్గాలు కూడా ఇది కేవలం క్లిక్-బైట్ కోసం సృష్టించిన పుకారు అని కొట్టిపారేశాయి.

బిజీగా పూజా హెగ్డే..

ఒకప్పుడు టాలీవుడ్ ను ఊపేసిన హీరోయిన్ పూజా హెగ్డే. అయితే ఇప్పుడు మాత్రం అవకాశాలు రావడం లేదు. ఓ ఐరన్ లెగ్ అనే పేరు కూడా సంపాదించింది. అయితే పూజా హెగ్డేకు ఇండస్ట్రీలో సహనటులతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆమె గతంలో ప్రభాస్, అల్లు అర్జున్, సల్మాన్ ఖాన్ వంటి అగ్ర హీరోలతో పనిచేసింది.

ప్రస్తుతం ఆమె దళపతి విజయ్ సరసన ‘జన నాయగన్’ అనే సినిమాలో నటించింది. సెన్సార్ ఇబ్బందుల కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. మూవీ రిలీజ్ పై ఇంకా ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ నెల 21న మరోసారి కోర్టులో విచారణ జరగనుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More