Mahesh Babu: ది బ్లఫ్ మూవీపై మహేష్ బాబు రివ్యూ.. ఓటీటీలో అదరగొడుతున్న ప్రియాంక చోప్రా యాక్షన్ థ్రిల్లర్
Mahesh Babu: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఫుల్ యాక్షన్ మోడ్ లో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. ఆమె లీడ్ రోల్ ప్లే చేసిన ‘ది బ్లఫ్’ మూవీ ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతోంది. ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు తన రివ్యూ పంచుకున్నాడు. వారణాసి కో స్టార్ పై ప్రశంసలు కురిపించాడు.
వారణాసి సినిమాలో తన కో స్టార్ ప్రియాంక చోప్రాపై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసలు కురిపించాడు. ఆమె లీడ్ రోల్ ప్లే చేసిన ‘ది బ్లఫ్’ మూవీ రివ్యూను మహేష్ ఎక్స్ లో పంచుకున్నాడు. యాక్షన్ రోల్ లో ప్రియాంక చోప్రా అదరగొట్టిందని పేర్కొన్నాడు.

మహేష్ బాబు ది బ్లఫ్ రివ్యూ
డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘ది బ్లఫ్’ మూవీ చూసి మహేష్ బాబు ఇంప్రెస్ అయ్యాడు. ఇందులో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా యాక్టింగ్ కు ఫిదా అయ్యాడు. ఈ సినిమాపై తన రివ్యూను ఎక్స్ లో పంచుకున్నాడు.
"ఆకట్టుకునే యాక్షన్ & ఎమోషన్స్‌తో చక్కగా తెరకెక్కించిన సినిమా ది బ్లఫ్. ప్రియాంక చోప్రా అదరగొట్టింది. ఆత్మవిశ్వాసంతో చేసింది. అద్భుతమైన ప్రదర్శనతో అన్ని విధాలుగా సత్తాచాటింది. అమేజింగ్ గా పని చేసిన ఆ టీమ్ మొత్తానికి నా ప్రేమను పంపుతున్నా’’ అని ఎక్స్ పోస్టులో మహేష్ బాబు రాసుకొచ్చాడు.
'ది బ్లఫ్' గురించి
ఫ్రాంక్ ఈ ఫ్లవర్స్ దర్శకత్వం వహించిన పైరేట్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ ది బ్లఫ్ లో ప్రియాంక చోప్రా లీడ్ రోల్ ప్లే చేసింది. ఈ సినిమాలో ప్రియాంకతో పాటు కార్ల్ అర్బన్, ఇస్మాయిల్ క్రూజ్ కార్డోవా, సాఫియా ఓక్లీ-గ్రీన్, టెమురా మోరిసన్ తదితరులు నటించారు. ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అయింది. ఫిబ్రవరి 26 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ట్రెండింగ్ నంబర్ 2లో ఈ సినిమా ఉంది.
ప్రియాంక చోప్రా సినిమాలు
ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ అడ్వెంచరస్ మూవీ ‘వారణాసి’లో నటిస్తోంది. ఈ సినిమాతో ఇండియన్ మూవీ ఇండస్ట్రీలోకి ప్రియాంక రీ ఎంట్రీ ఇస్తోంది. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్. వారణాసి మూవీ ఏప్రిల్ 7, 2027న థియేటర్లలో రిలీజ్ కానుంది.
వారణాసి షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం జార్జియాలో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. వారణాసి చిత్రం టైమ్ ట్రాటర్, గ్లోబ్ ట్రాటర్ గా తెరకెక్కుతోంది. వివిధ కాలాలు, వివిధ ప్రాంతాల్లో ఈ సినిమా స్టోరీ సాగనుంది. దీనికి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. మహేష్ బాబు- రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఫస్ట్ మూవీ ఇదే. ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


