Priyanka Chopra: ఇదొక అడ్వెంచర్.. గొప్ప డైరెక్టర్ తీస్తున్నాడు.. 14 నెలలుగా షూటింగ్: వారణాసి మూవీపై ప్రియాంక చోప్రా
ప్రియాంక చోప్రా (Priyanka Chopra) వారణాసి మూవీ, రాజమౌళి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇదొక గొప్ప అడ్వెంచర్ అని, 14 నెలలుగా షూటింగ్ చేస్తున్నట్లు వెల్లడించింది.
గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా సుమారు ఏడేళ్ల తర్వాత తిరిగి ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మెరవనుంది. దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’ సినిమాలో ఆమె నటిస్తున్నవిషయం తెలిసిందే. ఇదే విషయాన్ని చెబుతూ ఈ సినిమా విశేషాలను అంతర్జాతీయ టాక్ షో ‘ది టునైట్ షో’లో పంచుకుంది.

వారణాసి.. మరో ఆరు నెలల షూటింగ్
ప్రియాంక చోప్రా మళ్లీ ఇండియన్ సినిమాలో సందడి చేసేందుకు సిద్ధమైంది. తాజాగా అమెరికాలోని ప్రసిద్ధ టాక్ షో 'ది టునైట్ షో స్టారింగ్ జిమ్మీ ఫాలన్'లో పాల్గొన్న ఆమె.. తన తదుపరి ప్రాజెక్ట్ ‘వారణాసి’ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళిని ప్రశంసలతో ముంచెత్తుతూ, ఈ సినిమా ఒక అద్భుతమైన అడ్వెంచర్ అని అనడం విశేషం.
చాలా కాలం తర్వాత ఇండియన్ సినిమాలో నటిస్తుండటంపై ప్రియాంక ఎంతో ఉత్సాహంగా ఉంది. షోలో హోస్ట్ జిమ్మీ ఫాలన్‌తో మాట్లాడుతూ.. "నేను ఇండియన్ సినిమా చేసి దాదాపు ఆరు, ఏడేళ్లు అవుతోంది. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాను. ఆయన భారతదేశపు అత్యంత ప్రతిభావంతులైన దర్శకుల్లో ఒకరు. ఈ సినిమా షూటింగ్ ఐమాక్స్ (IMAX) ఫార్మాట్‌లో జరుగుతోంది. ఇప్పటికే 14 నెలలుగా షూటింగ్ చేస్తున్నాం. ఇది నాకు ఒక గొప్ప అడ్వెంచర్ లాంటిది. మరో ఆరు నెలల షూటింగ్ మిగిలి ఉంది" అని వివరించింది.
మహేష్ బాబు ‘రుద్ర’.. ప్రియాంక ‘మందాకిని’
ఎస్‌ఎస్ రాజమౌళి గతేడాది ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను ప్రకటిస్తూ మహేష్ బాబు క్యారెక్టర్‌ను పరిచయం చేశాడు. చేతిలో త్రిశూలం పట్టుకుని, ఎద్దుపై స్వారీ చేస్తున్న మహేష్ బాబు లుక్ అప్పట్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ సినిమాలో మహేష్ బాబు 'రుద్ర' అనే శక్తివంతమైన పాత్రలో కనిపిస్తుండగా, ప్రియాంక చోప్రా 'మందాకిని' అనే కీలక పాత్రలో నటిస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా 2027 ఏప్రిల్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.
‘ది బ్లఫ్’తో యాక్షన్ మోడ్‌లో ప్రియాంక
మరోవైపు ప్రియాంక నటించిన హాలీవుడ్ మూవీ ‘ది బ్లఫ్’ ఇటీవలే విడుదలైంది. కేమాన్ ఐలాండ్స్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌లో ప్రియాంక కత్తి సాము, గన్ ఫైట్స్‌తో అదరగొట్టింది. ఫ్రాంక్ ఇ. ఫ్లవర్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 25 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. హాలీవుడ్ నటుడు కార్ల్ అర్బన్ ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. అయితే ఈ మూవీకి చాలా వరకు మిక్స్‌డ్ రివ్యూలే వచ్చాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


