రాజమౌళి ‘వారణాసి’లో హాలీవుడ్ మ్యాజిక్: అన్నపూర్ణ స్టూడియోస్‌లో దేశంలోనే అతిపెద్ద టెక్ విప్లవం
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సరికొత్త సాంకేతిక విప్లవం మొదలైంది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో దేశంలోనే అత్యంత అత్యాధునికమైన 'మోషన్ క్యాప్చర్' సదుపాయాన్ని ప్రముఖ ఫిల్మ్ మేకర్ ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) బుధవారం (ఫిబ్రవరి 25) లాంఛనంగా ప్రారంభించాడు.
ఇండియన్ సినిమాను సాంకేతికంగా మరో మెట్టు పైకి ఎక్కించే ఈ మోషన్ క్యాప్చర్ ల్యాబ్.. అక్కినేని నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios), ప్రముఖ నిర్మాత శోభు యార్లగడ్డకు చెందిన మిహిరా విజువల్ ల్యాబ్స్ సంయుక్త భాగస్వామ్యంలో ఏర్పాటైంది. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్‌గా గుర్తింపు పొందిన హాలీవుడ్ సంస్థ 'యానిమాట్రిక్ ఫిల్మ్ డిజైన్' దీనికి పూర్తి స్థాయి సాంకేతిక సహకారం అందిస్తోంది. గతంలొ ఇండియాలో మొట్టమొదటి డాల్బీ సినిమా ప్రాసెసింగ్ ఫెసిలిటీని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభించిన రాజమౌళి.. ఇప్పుడు ఈ ల్యాబ్‌ను కూడా ప్రారంభించడం విశేషం.

'వారణాసి' కోసం వాడాము, అద్భుతంగా వచ్చింది: రాజమౌళి
ఈ ల్యాబ్‌ను ప్రారంభించిన అనంతరం రాజమౌళి (SS Rajamouli) మీడియాతో మాట్లాడుతూ.. ఇది దేశీయ ఫిల్మ్ మేకర్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక గొప్ప మైలురాయి అని అభివర్ణించాడు.
"ఇండియాలో ప్రపంచస్థాయి సాంకేతిక నిపుణులు ఉన్నారు. కానీ మనకు ఇక్కడ ఇలాంటి అత్యాధునిక సదుపాయం లేకపోవడమే పెద్ద లోటుగా ఉండేది. నేను తీసిన 'బాహుబలి', 'ఈగ' వంటి సినిమాల సమయంలో ఈ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ గనక ఇక్కడ అందుబాటులో ఉండి ఉంటే, ఆ సినిమాలను మరింత అద్భుతంగా తీసి ఉండేవాడిని అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది" అని అతడు అన్నాడు.
"ఇప్పుడు ఈ A&M ల్యాబ్ రాకతో ఆ లోటు తీరింది. దీనివల్ల ఫిల్మ్ మేకర్స్ ఆలోచనా విధానం మారుతుంది. ఇకపై మనం విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదు. నా రాబోయే 'వారణాసి' సినిమాలోని కీలక సన్నివేశాల కోసం మేము ఈ సదుపాయాన్ని ఉపయోగించాము. ఫలితాలు అద్భుతంగా వచ్చాయి" అని రాజమౌళి సంతోషం వ్యక్తం చేశాడు.
హైదరాబాద్‌లోనే హాలీవుడ్ రేంజ్ అవుట్‌పుట్: నాగార్జున
అన్నపూర్ణ స్టూడియోస్ సినీ ప్రయాణంలో 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ ఆవిష్కరణ జరగడం గమనార్హం. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. "దశాబ్దాలుగా మన ఫిల్మ్ మేకర్స్ గ్లోబల్ స్టాండర్డ్స్‌లో కథలు చెప్పాలని ఆరాటపడుతున్నారు. కానీ హై-ఎండ్ టెక్నాలజీ అందుబాటులో లేకపోవడం ఎప్పుడూ ఒక అడ్డంకిగా మారింది. ఇప్పుడు A&M ల్యాబ్‌తో, ఎపిక్ అడ్వెంచర్స్ నుంచి సంక్లిష్టమైన సైన్స్ ఫిక్షన్ డ్రామాల వరకు అన్నింటినీ ఇక్కడే హైదరాబాద్‌లో సృష్టించవచ్చు," అని ధీమా వ్యక్తం చేశాడు.
మరోవైపు 'బాహుబలి' నిర్మాత శోభు యార్లగడ్డ మాట్లాడుతూ.. "భారతీయ సినిమా ప్రపంచ వేదికపై నిజంగా పోటీ పడాలంటే దేశంలో ఇలాంటి అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలు ఉండటం చాలా అవసరం. రాజమౌళి లాంటి దర్శకుడు ఈ ల్యాబ్‌ను ఉపయోగించడం, భవిష్యత్తులో దేశీయ కథలు మన సొంత టెక్నాలజీతోనే నడుస్తాయన్న మా నమ్మకాన్ని మరింత పెంచింది" అని అన్నాడు.
సమయం, ఖర్చు ఆదా..
హాలీవుడ్ బ్లాక్‌బస్టర్స్ అయిన 'అవెంజర్స్: ఎండ్‌గేమ్', 'స్పైడర్-మ్యాన్: నో వే హోమ్' వంటి సినిమాలకు పనిచేసిన యానిమాట్రిక్ సంస్థ ప్రెసిడెంట్ బ్రెట్ ఇనెసన్.. ఈ కలయిక భారతీయ సినిమాకు ఒక ముఖ్యమైన ముందడుగు అని కొనియాడాడు.
అన్నపూర్ణ స్టూడియోస్ సీటీఓ సీవీ రావు ఈ ల్యాబ్ సాంకేతిక సామర్థ్యాలను వివరిస్తూ.. "ఇది దర్శకులకు అత్యంత శక్తివంతమైన 'ప్రీ-విజువలైజేషన్ టూల్' గా పనిచేస్తుంది. లైవ్ సెట్‌కి వెళ్లకముందే ఫిల్మ్ మేకర్స్ తమ క్రియేటివ్ విజన్‌ను ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. కెమెరా యాంగిల్స్, లెన్స్ ఎంపిక, ఫ్రేమ్ రేట్స్ అన్నీ కూడా వర్చువల్ వాతావరణంలో ప్రయోగాలు చేయవచ్చు. దీనివల్ల షూటింగ్ సమయంలో ఖర్చు, సమయం భారీగా ఆదా అవుతాయి" అని వివరించాడు.
భవిష్యత్తులో దేశవిదేశీ ఫిల్మ్ మేకర్స్, గేమ్ డెవలపర్స్, యానిమేషన్ స్టూడియోలతో కలిసి పనిచేయాలని అన్నపూర్ణ స్టూడియోస్ లక్ష్యంగా పెట్టుకుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


