Mahesh Babu Rajamouli: కొట్టుకున్న మహేష్ బాబు, రాజమౌళి.. ఏఐ వీడియో వైరల్.. సినిమా చచ్చిపోయిందన్న రామ్ గోపాల్ వర్మ
మహేష్ బాబు, రాజమౌళి (Mahesh Babu Rajamouli) ఫైట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏఐ సాయంతో ఈ వీడియోను క్రియేట్ చేయగా.. దీనిని షేర్ చేస్తూ సినిమా చచ్చిపోయిందంటూ ఆర్జీవీ ట్వీట్ చేయడం విశేషం.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ ఇప్పుడు నిజానికి, ఫ్యాంటసీకి మధ్య ఉన్న గీతను చెరిపేస్తోంది. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఏఐ సృష్టించిన సెలబ్రిటీల డీప్‌ఫేక్ వీడియోలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక కేఫ్‌లో దారుణంగా కొట్టుకుంటున్నట్లుగా ఉన్న ఒక ఏఐ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్రంగా స్పందించాడు.

రాజమౌళి - మహేష్ బాబు ఫైట్.. ఆర్జీవీ ఏమన్నాడంటే..
మంగళవారం (ఫిబ్రవరి 24) నాడు రామ్ గోపాల్ వర్మ తన 'ఎక్స్' ఖాతాలో ఈ ఏఐ వీడియోను పంచుకున్నాడు. అందులో మహేష్ బాబు, రాజమౌళి ఒక కేఫ్‌లో తీవ్రంగా పిడిగుద్దులు కురిపించుకుంటూ ఫైటింగ్ చేస్తున్నారు. అయితే ఎలాంటి గందరగోళం తలెత్తకుండా.. ఆ వీడియోను క్రియేట్ చేసిన వ్యక్తి ఇది ఏఐతో సృష్టించినదని స్పష్టంగా పేర్కొన్నాడు. అయినప్పటికీ ఈ వీడియోను చూసిన వర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. "సినిమా చచ్చిపోయింది" అంటూ ఒకే ఒక్క ముక్కలో సంచలన ట్వీట్ చేశాడు.
నెటిజన్ల ఆందోళన
ఈ వీడియోపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. "ఈ ఏఐ కంటెంట్‌ను ఆపండి.. ఇది చాలా ప్రమాదకరం" అని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. "రాజా సాబ్ వీఎఫ్ఎక్స్ (VFX) కంటే ఇదే బాగుంది" అని ఒకరు.. "ఉచితంగా చూపించినా ఇలాంటి చెత్తను నేను చూడను" అని మరొకరు కామెంట్ చేశారు.
అయితే కొందరు నెటిజన్లు మాత్రం సరదాగా స్పందించారు. "కనీసం ఏఐ అయినా మహేష్ బాబు ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ పలికించింది," అని ఒకరు.. "వారణాసి సినిమాలో మాకు ఇలాంటి ఫైట్ కావాలి" అని మరొకరు కామెంట్ చేశారు.
'వారణాసి' కోసం తొలిసారి..
ఎస్.ఎస్. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో తొలిసారిగా 'వారణాసి' (Varanasi) అనే భారీ పాన్-వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాలో బాలీవుడ్ క్వీన్ ప్రియాంకా చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా కనిపించనున్నాడు. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే విపరీతమైన క్రేజ్ నెలకొంది.
'వారణాసి' సినిమా విశేషాలు
ఆర్ఆర్ఆర్ (RRR) లాంటి గ్లోబల్ హిట్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఒక లార్జ్-స్కేల్ యాక్షన్ అడ్వెంచర్‌గా రాబోతోంది. ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత ప్రియాంకా చోప్రా ఈ సినిమాతో ఇండియన్ సినిమాలోకి రీ-ఎంట్రీ ఇస్తోంది. గతేడాది విడుదలైన టీజర్ అభిమానుల్లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచింది. ఇది ఒక టైమ్-ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఉండబోతోందని హింట్ ఇచ్చింది.
టీజర్ లాంచ్ ఈవెంట్‌లో రాజమౌళి మాట్లాడుతూ.. సినిమాలో ఒక సీక్వెన్స్‌లో మహేష్ బాబు సాక్షాత్తూ శ్రీరాముడి అవతారంలో కనిపిస్తాడని, అది ఒక అద్భుతమైన సినిమాటిక్ మూమెంట్ అని వెల్లడించాడు. ప్రకాష్ రాజ్ కూడా నటిస్తున్న ఈ సినిమాలో, విలన్ పాత్ర వీల్‌చైర్‌లో ఉంటుందని సమాచారం. ఈ ప్రతిష్టాత్మక మూవీ ఏప్రిల్ 7, 2027లో థియేటర్లలోకి రానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


