వారణాసి టీజర్ ఆలోచన విని మైండ్ పోయింది.. ఆ మూవీ తర్వాత కెరీర్ లో ఏం చేయాలో అర్థం కాలేదు: మహేష్ బాబు
వారణాసి సినిమాతో గ్లోబల్ బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ మూవీకి ఎస్ఎస్ రాజమౌళి డైరెక్టర్. వారణాసి మూవీ టీజర్ ఆలోచన విన్న తర్వాత మైండ్ పోయిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో మహేష్ వెల్లడించాడు.
ఎస్ఎస్ రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ వారణాసి. ఈ ఇద్దరు కలిసి చేస్తున్న ఫస్ట్ సినిమా ఇదే. ఈ చిత్రం గ్లోబ్ ట్రాటర్, టైమ్ ట్రాటర్ గా తెరకెక్కుతోంది. ఈ వారణాసి సినిమాలో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

వారణాసి టీజర్
తాజాగా హాలీవుడ్ మీడియాతో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా వారణాసి టీజర్ పై మహేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. ‘‘సాధారణంగా తన సినిమా కథలను ముందే మీడియాకు చెప్తాడు రాజమౌళి. కానీ వారణాసి విషయంలో మాత్రం అలా చేయలేదు. టీజర్ తోనే కథ చెప్పాలనుకున్నాడు. ఆ ఆలోచన, ఆయన అనుకున్న విజువల్స్ విని నా మైండ్ పోయింది’’ అని మహేష్ బాబు తెలిపాడు.
ఒక ఏడాది
వారణాసి టీజర్ కోసం టీమ్ ఒక ఏడాది పాటు కష్టపడిందని మహేష్ బాబు వెల్లడించాడు. ‘‘వారణాసి కథను టీజర్ లో చెప్పాలనుకున్నారు. దీని కోసం టీమ్ ఏడాది పాటు కష్టపడింది. అందుకే టీజర్ అంత అద్భుతంగా వచ్చింది. టీజర్ లోని ప్రతి సీన్ కు కథతో కనెక్షన్ ఉంటుంది’’ అని మహేష్ చెప్పాడు. హైదరాబాద్ లో రామోజీ ఫిల్మ్ సిటీలో గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో వారణాసి మూవీ టైటిల్, టీజర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
ఆ సినిమా తర్వాత
తన కెరీర్ ను మలుపు తిప్పిన మూవీ పోకిరి అని మహేష్ బాబు తెలిపాడు. ‘‘పోకిరి నన్ను స్టార్ ను చేసింది. నన్ను మార్చింది. 2006లో ఆ మూవీ సూపర్ హిట్ అయింది. ఆ మూవీ సక్సెస్ తర్వాత నాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తర్వాత కెరీర్ లో ఏం చేయాలో కూడా అర్థం కాలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వారణాసితోనూ అదే స్పెషల్ ఫీలింగ్ వస్తోంది’’ అని మహేష్ చెప్పాడు.
ఆ మెసేజ్
ఇదే ఇంటర్వ్యూలో రాజమౌళి చేసిన మెసేజ్ గురించి మహేష్ బాబు వెల్లడించాడు. ‘‘ఈ ప్రాజెక్టులో భాగమైనందుకు సంతోషంగా ఉంది. మీరు హీరోలను బాగా చూపిస్తారు. మీ హీరోలను మీరు ఇష్టపడతారు’’ అని రాజమౌళికి మెసేజ్ చేశానని మహేష్ చెప్పాడు. అప్పుడు రాజమౌళి ఏమో.. ‘‘కానీ నాకు విలన్స్ అంటే ఎక్కువ ఇష్టం’’ అని రిప్లే ఇచ్చాడని మహేష్ పేర్కొన్నాడు. వారణాసి మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 7, 2027న రిలీజ్ కానుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


