నువ్వు అన్‌స్టాపబుల్.. ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటావ్.. నిప్పులాంటి నటన: వారణాసి హీరోయిన్‌పై రాజమౌళి ప్రశంసలు

వారణాసి మూవీ హీరోయిన్ ప్రియాంకా చోప్రాపై ప్రశంసల వర్షం కురిపించాడు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆమె నటించిన ది బ్లఫ్ మూవీలో నటన చూసి అతడు ఫిదా అయ్యాడు. నిప్పులాంటి నటన అంటూ ట్వీట్ చేశాడు.

Published on: Jan 22, 2026, 13:55:36 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి.. తన వారణాసి మూవీ నటి ప్రియాంక చోప్రా నటనకు ఫిదా అయిపోయాడు. ప్రియాంక ప్రధాన పాత్రలో నటిస్తున్న హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది బ్లఫ్’ (The Bluff) ట్రైలర్‌ను చూసిన అతడు.. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

నువ్వు అన్‌స్టాపబుల్.. ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటావ్.. నిప్పులాంటి నటన: వారణాసి హీరోయిన్‌పై రాజమౌళి ప్రశంసలు
నువ్వు అన్‌స్టాపబుల్.. ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటావ్.. నిప్పులాంటి నటన: వారణాసి హీరోయిన్‌పై రాజమౌళి ప్రశంసలు

రాజమౌళి ఏమన్నారంటే?

గురువారం (జనవరి 22) ‘ఎక్స్’ వేదికగా ప్రియాంక చోప్రా నటించిన ది బ్లఫ్ మూవీ ట్రైలర్‌ను రీపోస్ట్ చేశాడు రాజమౌళి. "ప్రియాంక అన్‌స్టాపబుల్.. ఎప్పుడూ సర్‌ప్రైజ్ చేస్తూనే ఉంటుంది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, నిప్పులాంటి పర్ఫార్మెన్స్ చూస్తుంటే చాలా ముచ్చటేస్తోంది. ‘ది బ్లఫ్’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా" అని రాజమౌళి రాసుకొచ్చాడు.

రాజమౌళి ప్రశంసలకు ప్రియాంక చోప్రా స్పందించింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో అతని పోస్ట్‌ను షేర్ చేస్తూ.. "థ్యాంక్యూ సార్.. మీ మాటలకు సంతోషం" అని ధన్యవాదాలు తెలిపింది.

రాజమౌళి 'వారణాసి'లో ప్రియాంక

ఇక ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘వారణాసి’ సినిమాతో ప్రియాంక ఇండియన్ సినిమాలోకి రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. రాజమౌళి ‘వారణాసి’ షూటింగ్ గతేడాది జనవరిలో ప్రారంభమైంది. నవంబర్ నెలలో రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్ లో అధికారికంగా మూవీ టైటిల్ రివీల్ చేశారు. ఈ సినిమాలో మహేష్ బాబు 'రుద్ర'గా, ప్రియాంక 'మందాకిని'గా, పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ'గా నటిస్తున్నారు. ఖండాలు, కాలాల మధ్య సాగే అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా 2027 సంక్రాంతికి విడుదల కానుంది.

‘ది బ్లఫ్’ మూవీ గురించి..

ప్రియాంక చోప్రా నటించిన ‘ది బ్లఫ్’ గురించి చెప్పాలంటే.. ఈ ఆర్-రేటెడ్ అడ్వెంచర్ మూవీ ఫిబ్రవరి 25న ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో ప్రియాంక ఎర్సెల్ "బ్లడీ మేరీ" బోడెన్‌గా నటిస్తోంది. ఆమె తన హింసాత్మక గతాన్ని విడిచిపెట్టిన మాజీ పైరేట్ క్వీన్ పాత్రను పోషిస్తోంది.

1800ల చివరలో కరేబియన్ దీవిలో ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నించే పాత్ర ఆమెది. ఇక కార్ల్ అర్బన్.. కెప్టెన్ కానర్‌గా, ఆమె మాజీ ప్రేమికుడిగా కనిపిస్తాడు. రుస్సో బ్రదర్స్ తమ సోదరి ఏంజెలా రుస్సో-ఓట్స్‌తో కలిసి తమ బ్యానర్‌పై 'ది బ్లఫ్'ను నిర్మించారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More