వారణాసి రిలీజ్ డేట్.. శ్రీరామ నవమి స్పెషల్.. రాజమౌళి-మహేష్ బాబు సినిమాపై లేటెస్ట్ బజ్ ఇదే!

తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్ ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్న మూవీ వారణాసి. రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం రిలీజ్ పై లేటెస్ట్ బజ్ వైరల్ గా మారింది. 

Published on: Jan 5, 2026, 13:42:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాజమౌళి సినిమా అంటే ప్రపంచమే ఎదురు చూస్తుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఫస్ట్ టైమ్ మూవీ, అది కూడా రామాయణంతో ముడిపడిన ఓ అడ్వెంచర్ థ్రిల్లర్. ఇంకేముంది వారణాసిపై అంచనాలు భారీగా పెరిగాయి. అందరూ ఈ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడా? అని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో లేటెస్ట్ బజ్ ఒకటి వైరల్ గా మారింది. శ్రీరామ నవమి సందర్భంగా ఈ మూవీ రిలీజ్ కాబోతుందని తెలిసింది.

వారణాసి పోస్టర్ లో మహేష్ బాబు (x/urstrulyMahesh)
వారణాసి పోస్టర్ లో మహేష్ బాబు (x/urstrulyMahesh)

వారణాసి రిలీజ్ డేట్

గతేడాది నవంబర్ లో గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ నిర్వహించి సినిమా టైటిల్ ను వారణాసిగా ప్రకటించారు. ఈ మూవీ నుంచి రుద్రగా మహేష్ బాబు లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఆ ఈవెంట్లోనే వారణాసి చిత్రాన్ని 2027 సమ్మర్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు బజ్ ప్రకారం ఈ సినిమా 2027 ఏప్రిల్ 9న రిలీజ్ కాబోతుందని తెలిసింది.

శ్రీ రామనవమి స్పెషల్

వారణాసి సినిమాకు రామాయణానికి లింక్ ఉంటుందని డైరెక్టర్ రాజమౌళి ఇప్పటికే చెప్పారు. అంతే కాకుండా శ్రీ రాముడి గెటప్ లో మహేష్ బాబును చూస్తే గూస్ బంప్స్ కూడా వచ్చాయన్నారు. అంటే ఈ మూవీలో మహేష్ బాబు శ్రీ రాముడి పాత్రలో కనిపిస్తారన్నమాట.

ఈ నేపథ్యంలోనే వారణాసి మూవీని శ్రీ రామ నవమి సందర్భంగా ఏప్రిల్ 9, 2027న రిలీజ్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

క్రేజీ ప్రాజెక్ట్

కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచ సినీ రంగంలోనే వారణాసి ఓ క్రేజీ బిగ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది. రాజమౌళి డైరెక్షన్ లో ఈ మూవీ షూటింగ్ కొనసాగుతోంది. ఇందులో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వారణాసి మూవీని రూ.1300 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లు తెలిసింది.

టీజర్ అదుర్స్

గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లోనే రిలీజ్ చేసిన వారణాసి టీజర్ అదిరిపోయింది. ఈ సినిమా స్టోరీ వేర్వురు కాలాల్లో, వేర్వేరు ప్రదేశాల్లో జరుగుతుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. అంతే కాకుండా వారణాసి మూవీని ఐమాక్స్ ఫార్మాట్లోనూ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు స్టోరీని రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ అందించారు. మ్యూజిక్ ఏమో ఎంఎం కీరవాణి. వారణాసి సినిమా కోసం మహేష్ బాబు ప్రత్యేక యుద్ధ విద్యల్లోనూ శిక్షణ పొందుతున్నాడనే సంగతి తెలిసిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More