న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లిన మహేష్ బాబు.. ఎయిర్‌పోర్ట్ వీడియో వైరల్
మహేష్ బాబు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వెకేషన్ కు వెళ్లాడు. కూతురు సితార, కొడుకు గౌతమ్ కూడా అతని వెంట కనిపించారు. సూపర్ స్టార్ ఫ్యామిలీ ఎయిర్ పోర్టులో ఉన్న వీడియో వైరల్ అవుతోంది. ప్రస్తుతం అతడు వారణాసి షూట్ నుంచి బ్రేక్ తీసుకున్నాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లాడు. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వారణాసి' (Varanasi) షూటింగ్ నుంచి చిన్న బ్రేక్ తీసుకున్న అతడు.. సోమవారం (డిసెంబర్ 29) హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి సందడి చేశాడు.

స్టైలిష్ లుక్‌లో మహేష్
రాజమౌళి సినిమా అంటే ఆ మాత్రం బ్రేకులు అవసరమే. వరుస షెడ్యూల్స్‌తో బిజీగా ఉన్న మహేష్ బాబు.. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు కుటుంబంతో కలిసి ఫారెన్ ట్రిప్ ప్లాన్ చేశాడు. సోమవారం (డిసెంబర్ 29) ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఫ్యామిలీ కనిపించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బ్లూ టీ-షర్ట్, బ్రౌన్ జాకెట్, జీన్స్ వేసుకుని.. తన ట్రేడ్‌మార్క్ క్యాప్, కళ్లజోడుతో మహేష్ బాబు సూపర్ స్టైలిష్‌గా కనిపించాడు. కూతురు సితార కూడా తండ్రికి తగ్గట్టుగా వైట్ టీ-షర్ట్, క్యాప్, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని సేమ్ టు సేమ్ లుక్‌లో మెరిసింది. నమ్రత, గౌతమ్ కూడా చిరునవ్వుతో కనిపించారు.
ఫ్యాన్స్ కామెంట్స్: "అందానికి ఆధార్ కార్డురా.."
ఈ వీడియో చూసిన నెటిజన్లు మహేష్ ఫ్యామిలీ అందాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. "వాడే కాదురా.. వాడి ఫ్యామిలీ మొత్తం అందానికి ఆధార్ కార్డు రా" అని ఒక ఫ్యాన్ కామెంట్ చేయడం విశేషం.
"ఏమున్నాడురా బాబు" అని కొందరు అంటుంటే.. "నువ్వు సృష్టించే విధ్వంసం కోసం వెయిటింగ్ అన్న" అని మరికొందరు 'వారణాసి' సినిమాను గుర్తు చేస్తున్నారు. రాజమౌళి సినిమాల ఆలస్యంపై ఒక నెటిజన్ ఫన్నీగా స్పందిస్తూ.. "కానియ్యి అన్న నువ్వు.. ఎలాగో మళ్లీ ఆగస్టులోనేగా అప్‌డేట్ వచ్చేది" అని సెటైర్ వేశారు.
'వారణాసి' సినిమా విశేషాలు
ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న మూవీ వారణాసి. ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ నవంబర్‌లో హైదరాబాద్‌లో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో అనౌన్స్ చేశారు. ఇందులో మహేష్ బాబుతోపాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
2024 నుంచే ట్రైనింగ్ మొదలుపెట్టిన మహేష్, ఈ ఏడాది (2025) జనవరి నుంచి షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమా 2027 సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది. ఇక మహేష్ ఈ మధ్యే క్రిస్మస్ సెలబ్రేషన్స్ లోనూ పాల్గొన్నాడు. ఆ ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


