మహేష్ బాబు క్రిస్మస్ సెలబ్రేషన్స్ చూశారా.. స్టైలిష్ లుక్‌లో ఫ్యామిలీతో కలిసి ఫొటో

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నాడు. అతని భార్య నమ్రత ఈ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో తన కూతురు సితారలాగే మహేష్ కూడా ఓ రెడ్ టీషర్ట్ లో స్టైలిష్ గా కనిపించాడు.

Dec 26, 2025, 15:21:20 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వరుస షూటింగ్స్‌తో బిజీగా ఉండే సూపర్ స్టార్ మహేష్ బాబు క్రిస్మస్ పండుగ కోసం చిన్న బ్రేక్ తీసుకున్నాడు. భార్య నమ్రత, కూతురు సితార, కొడుకు గౌతమ్, సన్నిహితులతో కలిసి అతడు క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మహేష్ బాబు క్రిస్మస్ సెలబ్రేషన్స్ చూశారా.. స్టైలిష్ లుక్‌లో ఫ్యామిలీతో కలిసి ఫొటో
మహేష్ బాబు క్రిస్మస్ సెలబ్రేషన్స్ చూశారా.. స్టైలిష్ లుక్‌లో ఫ్యామిలీతో కలిసి ఫొటో

మహేష్ క్రిస్మస్ సెలబ్రేషన్స్

రాజమౌళితో కలిసి వారణాసి మూవీలో బిజీగా ఉన్నా కూడా.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట క్రిస్మస్ సందడి నెలకొంది. తన కుటుంబం, స్నేహితులతో కలిసి అతడు ఈ పండుగను ఆనందంగా జరుపుకున్నాడు. శుక్రవారం (డిసెంబర్ 25) నాడు నమ్రత శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను పంచుకుంది.

ఫ్యామిలీ ఫోటో అదిరింది

మహేష్ బాబు ఎప్పటిలాగే సింపుల్ అండ్ స్టైలిష్‌గా ఎరుపు రంగు టీ-షర్ట్, జీన్స్‌లో కనిపించగా.. నమ్రత నలుపు రంగు దుస్తుల్లో మెరిశారు. కూతురు సితార ఎరుపు రంగు డ్రెస్సులో క్యూట్‌గా నవ్వుతూ ఆకర్షణగా నిలిచింది. అటు గౌతమ్ కూడా మెరూన్ కలర్ టీషర్ట్ లో కనిపించాడు.

వెనుక అందంగా అలంకరించిన క్రిస్మస్ ట్రీ, రంగు రంగుల లైట్ల వెలుగుల్లో మహేష్ ఇల్లు మెరిసిపోతోంది. ఈ ఫోటోను షేర్ చేస్తూ నమ్రత "ది బిగ్ సెలబ్రేషన్ ఫ్యామిలీ" అని రాసుకొచ్చింది. అలాగే ఫ్రెండ్స్‌తో దిగిన సెల్ఫీలను కూడా పోస్ట్ చేసింది.

ఫ్యాన్స్ రియాక్షన్ ఇలా

ఈ ఫోటోలు చూసిన అభిమానులు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. "పండుగ కళ అంటే ఇదే.. ఫ్యామిలీ అంతా ఎంత బాగున్నారో" అంటూ ఎక్స్ (ట్విట్టర్)లో కామెంట్స్ పెడుతున్నారు.

మహేష్ బాబు ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'వారణాసి' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ ఇప్పటికే సంచలనం సృష్టించగా.. 2027 సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానుంది.

ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ కు వస్తానని అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ కూడా చెప్పిన విషయం తెలిసిందే. మరోర ఏడెనిమిది నెలల్లో మూవీ షూటింగ్ పూర్తవుతుందని కామెరాన్ తో రాజమౌళి చెప్పాడు. ఈ సినిమా కోసం మహేష్ కొన్ని యుద్ధ కళలను కూడా నేర్చుకుంటున్నట్లు ఈ మధ్యే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More