వామ్మో.. వారణాసి బడ్జెట్ ఇన్ని కోట్లా? సగం రెమ్యునరేషన్లకే.. హీరోయిన్ ప్రియాంక చోప్రా ఏం చెప్పిందంటే?
మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ వారణాసి. ఈ మూవీ బడ్జెట్ రూ.1300 కోట్లు అంటూ రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో హీరోయిన్ ప్రియాంక చోప్రా కామెంట్లు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.
ప్రస్తుతం షూటింగ్ చేసుకుంటున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో వారణాసి ఒకటి. రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా చేస్తున్న ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీని కోసం భారీగానే ఖర్చు పెడుతున్నారు. బడ్జెట్ రూ.1300 కోట్లు అనే వార్తలు వస్తున్నాయి. దీనిపై హీరోయిన్ ప్రియాంక చోప్రా చేసిన కామెంట్లు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.

వారణాసి బడ్జెట్
పాపులర్ కామెడీ షో ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ సీజన్ 4 ఓపెనింగ్ ఎపిసోడ్ లో ప్రియాంక చోప్రా గెస్ట్ గా వెళ్లింది. ఇందులో ఆమె రాబోయే చిత్రం 'వారణాసి' గురించి జరిగిన సరదా సంభాషణ ఆన్‌లైన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇది సుమారు రూ.1,300 కోట్ల సినిమా అనే పుకార్లు వినిపిస్తున్నాయని కపిల్ అడుగుతాడు. నవ్వుతూ ప్రియాంక 'హా (అవును)' అని చెబుతూ సంభాషణను కొనసాగించింది.
రెమ్యునరేషన్
'మరి ఈ రూ.1,300 కోట్లు సినిమా తీయడానికే ఖర్చు పెడతారా, లేక వారణాసి ప్రజలకు ఉద్యోగాలు (నటులకు రెమ్యునరేషన్) కూడా కల్పిస్తున్నారా?' అని ప్రియాంకను కపిల్ అడిగాడు. ప్రేక్షకులు ఒక్కసారిగా నవ్వారు. ముందుగా సినిమా బడ్జెట్ ఇంత ఎక్కువగా లేదని, ప్రియాంక చేరిన తర్వాతే పెరిగిందని ఆయన మరో పంచ్ లైన్ జోడించాడు.
'అంటే మీరు సగం బడ్జెట్ నేరుగా నా బ్యాంకు ఖాతాలోకి బదిలీ అయిందని సూచిస్తున్నారా?' అని కపిల్‌ను ప్రశ్నించింది ప్రియాంక. కపిల్ చిలిపిగా 'అది స్పష్టమే' అని సమాధానం చెప్పినప్పుడు.. నటి వెంటనే 'అంటే మీరు నన్ను అన్యాయంగా ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారా?' అని ఎదురు ప్రశ్నించింది. ఈ పంచ్‌తో కపిల్, ప్రేక్షకులు అందరూ పడిపడి నవ్వారు.
వారణాసి స్టోరీ
వారణాసి సినిమాకు 'బాహుబలి' ఫేమ్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నారు. ఇది ఒక హై-ప్రొఫైల్, పాన్-ఇండియా మూవీ. కపిల్ షోలో నవజోత్ సింగ్ సిద్దూ.. ప్రియాంకను సినిమా స్టోరీ గురించి వివరాలు చెప్పమన్నాడు. కానీ కపిల్ జోక్యం చేసుకుని, రాజమౌళి రహస్య స్వభావాన్ని గుర్తుచేస్తూ 'బాహుబలి' సీక్రెట్ ను విడుదల వరకు ఎలా దాచిపెట్టాడో, 'వారణాసి' కూడా అలాంటిదే అని గుర్తుచేస్తూ, అందరినీ నవ్వించాడు.
షూటింగ్ లో బిజీ
ప్రియాంక ఇప్పటికే హైదరాబాద్‌లో 'వారణాసి' షూటింగ్ ప్రారంభించింది. ఇటీవల ఆమె తన సహ నటీనటులతో కూడిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్‌లతో కలిసి పనిచేయడం, రాజమౌళి సినిమాలో భాగం కావడం ఒక గౌరవమని ఆమె పేర్కొంది.
సినిమా విడుదల కావడానికి దాదాపు ఒక సంవత్సరం ముందు నుంచే అంతర్జాతీయ మీడియాతో టీమ్ సంప్రదింపులు ప్రారంభించిందని, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అంచనాలు ఉత్తేజకరంగా, వినయంగా ఉన్నాయని ఆమె తెలిపింది. వారణాసి 2027లో రిలీజ్ కానుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


