వారణాసి.. మహేష్ బాబు- రాజమౌళి మూవీ టైటిల్ ఇదే.. గ్లింప్స్ వైరల్.. అదిరిపోయిన సూపర్ స్టార్ ఫస్ట్ లుక్

మహేష్ బాబు- రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ టైటిల్ ను రివీల్ చేశారు మేకర్స్.  ఇవాళ గ్లోబ్ ట్రాటర్ పేరుతో ఈవెంట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.  ఈవెంట్ ప్రారంభం కాకముందే టైటిల్ గ్లింప్స్ ను ప్లే చేశారు. 

Published on: Nov 15, 2025, 19:01:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఫ్యాన్స్ ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న టైమ్ ఎట్టకేలకు వచ్చింది. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ టైటిల్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు ‘వారణాసి’ అనే పేరు పెట్టారు. ఈ చిత్రానికి వారణాసి అనే టైటిల్ ను పెడతారని ముందే నుంచే ప్రచారం సాగింది. అనుకున్నట్లుగానే ఈ టైటిల్ నే ఫిక్స్ చేశారు మేకర్స్.

మహేష్ బాబు (x)
మహేష్ బాబు (x)

మూవీ టైటిల్ వారణాసి

మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్లో అడ్వెంచరస్ థ్రిల్లర్ గా ఓ మూవీ రెడీ అవుతోంది. ఈ సినిమా టైటిల్ పై ఇన్ని రోజులూ సస్పెన్స్ నెలకొంది. శనివారం (నవంబర్ 15) గ్లోబ్‌ట్రాట‌ర్ పేరుతో ఈ సినిమా ఈవెంట్ ను హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ లోనే మూవీ టైటిల్, మహేష్ బాబు ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారనే టాక్ వినిపించింది. అనుకున్నట్లుగానే ఈవెంట్ స్టార్ట్ కాకముందే టైటిల్ గ్లింప్స్ ను అక్కడి స్క్రీన్ లపై ప్లే చేశారు.

అదిరిపోయిన మహేష్ లుక్

వారణాసి సినిమా నుంచి రిలీజైన మహేష్ బాబు లుక్ అదిరిపోయింది. టైటిల్ గ్లింప్స్ వీడియోలో ముందుగా మహేష్ లుక్ ను రివీల్ చేశారు. చేతిలో త్రిశూలం పట్టుకుని, నందిలా కొలిచే ఎద్దుపై వస్తూ యాక్షన్ అవతార్ లో మహేష్ కనిపించాడు. ఆ తర్వాత వారణాసి అని మూవీ టైటిల్ ప్లే అయింది.

ఇప్పటికే రిలీజ్

రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్ అనగానే ఈ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. వీళ్ల కాంబినేషన్లో వస్తున్న ఫస్ట్ మూవీ ఇది. షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అప్ డేట్ల కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ వచ్చారు. రీసెంట్ గా ఈ మూవీ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్‌ ను కుంభగా, ప్రియాంక చోప్రాను మందాకినిగా పరియం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేశారు మేకర్స్. ఇవి వైరల్ గా మారాయి.

మరో లెవల్

బాహుబలి 1, 2, ఆర్ఆర్ఆర్ లాంటి ప్రతిష్ఠాత్మక చిత్రాల తర్వాత మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు రాజమౌళి. ఇది హాలీవుడ్ రేంజ్ లో అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీతో మహేష్ బాబు కెరీర్ మరో రేంజ్ కు వెళ్లడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More