గ్లోబ్‌ట్రాట‌ర్ పాస్ దొర‌క‌లేదా? డోంట్ వ‌ర్రీ-ఇంట్లోనుంచే ఈవెంట్ చూడొచ్చు-ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్క‌డంటే?

రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఓ మూవీ రూపొందుతోంది. ఈ సినిమా ఈవెంట్ ను గ్లోబ్‌ట్రాట‌ర్‌ పేరుతో ఇవాళ నిర్వహించనున్నారు. ఈవెంట్ కు పాస్ లు దొరకని వాళ్లు వర్రీ చెందాల్సిన అవసరం లేదు. ఇంట్లో నుంచి ఓటీటీలో ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ చూసేయండి.  

Published on: Nov 15, 2025, 17:18:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు నటిస్తున్న మూవీ గ్లోబ్‌ట్రాట‌ర్ (వర్కింగ్ టైటిల్). ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఈవెంట్ ను ఇవాళ (నవంబర్ 15) హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ పాస్ ల కోసం భారీ డిమాండ్ నెలకొంది. చాలా మంది అభిమానులకు పాస్ లు దక్కలేదు.

ప్రియాంక చోప్రా లుక్ పోస్టర్
ప్రియాంక చోప్రా లుక్ పోస్టర్

పాస్‌పోర్ట్‌లా

గ్లోబ్‌ట్రాట‌ర్ ఈవెంట్ ను భారీ స్థాయిలో నిర్వహించబోతున్నారు. దీని కోసం పాస్ లను స్పెషల్ గా స్‌పోర్ట్‌ల మాదిరిగా డిజైన్ చేయించారు. సోషల్ మీడియాలో రాజమౌళి ఈవెంట్ ప్రవేశం పరిమితంగానే ఉంటుందని స్పష్టం చేశారు. ఈవెంట్ హోస్టింగ్‌ను సరికొత్త స్థాయికి తీసుకెళ్తూ ఎంట్రీ పాస్‌లకు బదులుగా పాస్‌పోర్ట్‌లను జారీ చేశారు. వీటి చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

గ్లోబ్‌ట్రాట‌ర్ ఓటీటీ

ఏదైనా మూవీ ఈవెంట్ ను టీవీ ఛానెల్స్ లో ప్రత్యక్ష ప్రసారం చేయడం కామనే. కానీ గ్లోబ్‌ట్రాట‌ర్ ఈవెంట్ ను ఫస్ట్ టైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇది నవంబర్ 15న సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి జియోహాట్‌స్టార్‌లో ఈ ఈవెంట్ ను ఇంట్లో ఉండే హాయిగా చూసేయొచ్చు.

శ్రుతి హాసన్ పర్ఫార్మెన్స్

నటి, సింగర్ శ్రుతి హాసన్ ఈ గ్లోబ్‌ట్రాట‌ర్ ఈవెంట్ లో స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వనుంది. రీసెంట్ గా ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన సాంగ్ ను ఆమెనే పాడిన విషయం తెలిసిందే. ఇప్పుడు గ్లోబ్‌ట్రాట‌ర్ స్టేజీపై లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతోంది.

ఫస్ట్ లుక్స్ వైరల్

రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్ అనగానే ఈ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. వీళ్ల కాంబినేషన్లో వస్తున్న ఫస్ట్ మూవీ ఇది. షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అప్ డేట్ల కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ వచ్చారు. రీసెంట్ గా ఈ మూవీ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్‌ ను కుంభగా, ప్రియాంక చోప్రాను మందాకినిగా పరియం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేశారు మేకర్స్. ఇవి వైరల్ గా మారాయి.

ఆ సినిమాల తర్వాత

బాహుబలి 1, 2, ఆర్ఆర్ఆర్ లాంటి ప్రతిష్ఠాత్మక చిత్రాల తర్వాత మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు రాజమౌళి. ఇది హాలీవుడ్ రేంజ్ లో అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీతో మహేష్ బాబు కెరీర్ మరో రేంజ్ కు వెళ్లడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More