హ్యపీ బర్త్ డే ఎన్ఎస్జీ.. ఇంతకంటే ఇంకేం అడగాలి.. థ్యాంక్ యూ.. భార్యకు విషెస్ చెప్పిన మహేష్ బాబు.. పోస్ట్ వైరల్

సూపర్ స్టార్ మహేష్ బాబు తన భార్య నమ్రతా శిరోద్కర్ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపాడు. మనసును తాకేలా సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఈ పోస్టు వైరల్ గా మారింది. 

Published on: Jan 22, 2026, 12:29:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సూపర్ స్టార్ మహేష్ బాబుకు భార్య, పిల్లలంటే ఎంతో ప్రేమ. సమయం దొరికితే చాలు ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్లిపోతున్నారు. లవ్ చేసి పెళ్లి చేసుకున్న భార్య నమ్రతా శిరోద్కర్ ను అయితే మరింత ఇష్టంగా చూసుకుంటారు. ఇవాళ (జనవరి 22) భార్య నమ్రతా పుట్టిన రోజు సందర్భంగా మనసును తాకేలా మహేష్ బాబు చెప్పిన విషెస్ వైరల్ గా మారాయి.

మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ (instagram-Mahesh Babu)
మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ (instagram-Mahesh Babu)

హ్యాపీ బర్త్ డే ఎన్ఎస్జీ

తన భార్య నమ్రతా శిరోద్కర్ పుట్టిన రోజు సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఇన్ స్టాలో పోస్టు పెట్టారు. నమ్రతా ఫొటోను పోస్టు చేసి విషెస్ తెలిపారు.

‘‘హ్యాపీ బర్త్ డే ఎన్ఎస్జీ (నమ్రతా శిరోద్కర్ ఘట్టమనేని). ఎంతో గ్రేస్, ప్రేమతో అన్నింట్లోనూ నాతో కలిసి సాగుతున్నందుకు ధన్యవాదాలు. ఇంతకంటే ఇంకేం అడగాలి’’ అని క్యాప్షన్ ఇచ్చాడు మహేష్ బాబు.

వదినమ్మ అంటూ

భార్య నమ్రతాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ మహేష్ బాబు పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. ఎంతో ప్రేమ చూపిస్తారని కామెంట్లు వస్తున్నాయి. వదినమ్మా హ్యాపీ బర్త్ డే అంటూ మహేష్ బాబు అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

ప్రేమ పెళ్లి

మహేష్, నమ్రతా 2006 ఫిబ్రవరి 10న మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. 2000లో వచ్చిన వంశీ సినిమాలో హీరోహీరోయిన్లుగా చేసిన వీళ్లు అప్పుడే ప్రేమలో పడ్డారు. వీళ్లకు గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలున్నారు. నమ్రతా మాజీ మిస్ ఇండియా కూడా. అయిదేళ్ల డేటింగ్ తర్వాత వీళ్లు పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత నమ్రతా సినిమాలకు దూరమై, కుటుంబాన్ని చూసుకుంటున్నారు.

వారణాసితో

సూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసి మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్‌, ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తున్నారు. గ్లోెబ్ ట్రాటర్, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో వారణాసి రెడీ అవుతోంది.

2027 సమ్మర్ లో వారణాసి మూవీ రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ మూవీ టైటిల్ రిలీజ్, మహేష్ బాబు లుక్ రివీస్ కోసం గ్లోబ్ ట్రాటర్ పేరుతో ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్ పై ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి. వారణాసి సినిమాకు ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ కథ అందించారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More