మహేష్-రాజమౌళి టైటిల్ కాంట్రవర్సీ.. వారణాసి టైటిల్‌లో మార్పు.. కొత్త పేరు ఇదేనా?

సూపర్ స్టార్ మహేష్ బాబుతో అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా వారణాసి. అయితే ఈ మూవీ టైటిల్ పై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కాంట్రవర్సీకి ఎండ్ కార్డు వేశారని, టైటిల్ లో మార్పు చేశారనే వార్త హల్చల్ చేస్తోంది. 

Published on: Nov 29, 2025, 15:12:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వారణాసి.. ఈ పేరు వింటే పరమ పవిత్రమైన ప్రదేశం గుర్తుకొస్తుంది. ఇప్పుడు ఈ పేరు వింటే.. రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా పేరు కూడా గుర్తుకొస్తుంది. భారీ ఈవెంట్ లో అనౌన్స్ చేసిన ఈ పేరు సిని లవర్స్ కు అంతలా ఎక్కేసింది. అయితే ఈ మూవీ టైటిల్ పై కాంట్రవర్సీ కారణంగా వారణాసి పేరులో మార్పు చేస్తున్నట్లు సమాచారం. ఈ టైటిల్ ను కాస్త మారుస్తున్నారనే టాక్ వైరల్ గా మారింది.

వారణాసి పోస్టర్ (x/ActorSatyaDev)
వారణాసి పోస్టర్ (x/ActorSatyaDev)

వారణాసి టైటిల్

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఫస్ట్ సినిమా వారణాసి. ఇది గ్లోబ్ ట్రాటర్, టైమ్ ట్రాటర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. అంటే విశ్వంలో, వివిధ కాలాల్లో జరిగే కథగా తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్ లో గ్లోబ్ ట్రాటర్ అనే పెద్ద ఈవెంట్ లో ఈ మూవీ టైటిల్, టీజర్, మహేష్ లుక్ ను రివీల్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ పెట్టారు.

తెలుగులో మార్పు

మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు వారణాసి అని పేరు పెట్టడంతో వివాదం మొదలైంది. అంతకంటే ముందే ఈ పేరును రిజిస్టర్ చేసుకున్నామంటూ ఓ నిర్మాణ సంస్థ ఫిర్యాదు చేసింది. దీంతో రాజమౌళి పేరు మార్చేందుకు రెడీ అయ్యారని తాజా సమాచారం. అయితే తెలుగులోనే ఆ నిర్మాణ సంస్థ వారణాసి టైటిల్ ను రిజిస్టర్ చేసిందని తెలిసింది. దీంతో తెలుగులో మాత్రమే ‘రాజమౌళి వారణాసి’గా టైటిల్ మార్చాలన్నది జక్కన్న టీమ్ ప్లాన్ గా టాక్. మిగతా భాషల్లో మాత్రం వారణాసి టైటిల్ తోనే మహేష్ మూవీ రిలీజ్ కాబోతుందని సమాచారం.

ఇదే కాంట్రవర్సీ

మహేష్ బాబు హీరోగా రెడీ అవుతున్న సినిమాకు వారణాసి అని పేరు పెట్టారు. అయితే అంతకంటే ముందే రామ బ్రహ్మ హనుమ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత కె.విజయ్ ఈ పేరును రిజిస్టర్ చేయించారు. అంతే కాకుండా డైరెక్టర్ సీహెచ్ సుబ్బారెడ్డి (రఫ్ మూవీ ఫేమ్) ఈ టైటిల్ ను అనౌన్స్ చేశారు. సనాతన ధర్మం గొప్పతనం తెలిసేలా వారణాసి సినిమా తీస్తామని కూడా అనౌన్స్ చేశారనే వార్తలొస్తున్నాయి.

వారణాసి రిలీజ్

వారణాసి టైటిల్ వివాదానికి ఎండ్ కార్డు వేసేలా జక్కన్న నిర్ణయం తీసుకున్నట్లే తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. మరోవైపు 2027 సమ్మర్ లో మహేష్ బాబు వారణాసి సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఆ దిశగా షూటింగ్ ను రాజమౌళి పరుగులు పెట్టిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ మందాకినిగా ప్రియాంక చోప్రా, విలన్ కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More