ఆరా ఆఫ్ ఉస్తాద్ ప్రోమో వచ్చేసింది.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు పూనకాలు లోడింగ్ అంటున్న హరీష్ శంకర్
పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ ప్రోమో వచ్చేసింది. పవన్ ఫ్యాన్స్ కు పూనకాలు లోడింగ్ అనేలా ఈ ప్రోమో ఉంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ డ్రామా 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ 'ఆరా ఆఫ్ ఉస్తాద్' (Auraa of Ustaad) పాటను ఫిబ్రవరి 22న విడుదల చేయనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ పాటకు సంబంధించిన ఉత్సాహభరితమైన ప్రోమోను రిలీజ్ చేశారు.

'ఆరా ఆఫ్ ఉస్తాద్'.. పండుగ లాంటి పాట
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మూవీ టీమ్ ఫ్యాన్స్‌లో మరింత జోష్ నింపేందుకు ఒక అదిరిపోయే అప్‌డేట్‌తో ముందుకు వచ్చింది. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ విడుదల తేదీని ప్రకటిస్తూ గురువారం (ఫిబ్రవరి 19) ఒక చిన్న ప్రోమోను విడుదల చేశారు. ఇందులో పవన్ ఓ చేతిలో తుపాకీ, మరో చేతిలో ఓ రేడియోతో స్టైలిష్ గా నడుస్తూ రావడం చూడొచ్చు.
ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ కు "ఆరా ఆఫ్ ఉస్తాద్" అనే పవర్ ఫుల్ టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేశారు. ఈ పూర్తి పాటను ఫిబ్రవరి 22న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు తనదైన శైలిలో అదిరిపోయే సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ పాటకు ఆస్కార్ విన్నర్, ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ అద్భుతమైన సాహిత్యం సమకూర్చాడు. అలాగే దేవి శ్రీ ప్రసాద్, ఎస్.పి. అభిషేక్, 'ది ఇండియన్ కోరల్ ఎన్‌సెంబల్' బృందం కలిసి ఈ పాటను ఎంతో ఎనర్జిటిక్‌గా పాడారు.
అదిరిపోయిన ప్రోమో
తాజాగా విడుదలైన ఈ ప్రోమో చూస్తుంటే.. ఇది పవర్ స్టార్ అభిమానులకు ఒక పండుగలా ఉండబోతుందని స్పష్టమవుతోంది. ఈ చిన్న ప్రోమోలో చూపించిన యానిమేషన్ విజువల్స్ చాలా నీట్‌గా, ఒక మంచి క్వాలిటీ లిరికల్ వీడియోను అందించబోతున్నట్లు కనిపిస్తోంది. అలాగే ఈ ప్రోమోలో పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన కొన్ని గ్లింప్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా అభిమానులతో పవన్‌కు ఉన్న బంధాన్ని గుర్తు చేసేలా అతని మేనరిజాన్ని ఈ యానిమేషన్ లో పొందుపరచడం విశేషం.
ఉస్తాద్ భగత్‌సింగ్ విశేషాలు
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల, రాశీ ఖన్నా ఫీమేల్ లీడ్స్‌గా నటిస్తున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు దశరథ్ స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం.
ఈ సినిమాను మార్చి 26న థియేటర్లలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. గతేడాది చివర్లో పవన్ కల్యాణ్ ఓజీ మూవీతో తన కెరీర్లోనే అత్యధిక వసూళ్ల సినిమా ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఉస్తాద్ భగత్‌సింగ్ పై అంచనాలు మరింత పెరిగాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


