ఆరా ఆఫ్ ఉస్తాద్.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. మ్యూజిక్ డైరెక్టర్ ను పైకెత్తేసిన హరీష్ శంకర్.. ఫొటో వైరల్
పవన్ కల్యాణ్ అప్ కమింగ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా నుంచి రెండో సాంగ్ రిలీజ్ కోసం మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇలాంటి పాట వినలేదంటూ డైరెక్టర్ హరీష్ శంకర్ ఒక్కసారిగా హైప్ పెంచేశాడు. లిరిసిస్ట్ చంద్రబోస్ తో కలిసి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ను పైకెత్తేశాడు.
గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత హరీష్ శంకర్- పవన్ కల్యాణ్ మళ్లీ కలిసి చేస్తున్న మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఇక తాజాగా దేఖ్ లేంగే సాలా సాంగ్ తెగ వైరల్ కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇప్పుడా హైప్ ను పెంచేస్తూ డైరెక్టర్ హరీష్ శంకర్ ట్వీట్ వైరల్ గా మారింది.

హరీష్ శంకర్ పోస్ట్
ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ మూవీ నుంచి రెండో సాంగ్ గా ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ రాబోతుంది. ఈ పాట విన్న హరీష్ శంకర తన ఎమోషన్స్ ను కంట్రోలో చేసుకోలేకపోయాడు. లిరిసిస్ట్ చంద్రబోస్ తో కలిసి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ను హరీష్ శంకర్ ఎత్తుకున్నాడు. ఈ ఫొటోను ఎక్స్ లో పోస్టు చేశాడు.
నేనెప్పుడూ ఇలా చేయలేదు
‘‘సాధారణంగా నేనెప్పుడూ ఇలా చేయను. గతంలో ఎప్పుడూ ఇలా చేయలేదు. కానీ ఈ పాటకు కచ్చితంగా ఈ గుర్తింపు దక్కాల్సిందే. ఈ పాట విన్న తర్వాత నా హార్ట్ ఎలా స్పందించిందో చెప్పేందుకు మాటలు చాలవు. ఆరా ఆఫ్ ఉస్తాద్’’ అనే క్యాప్షన్ తో ఫొటోను హరీష్ శంకర్ పోస్టు చేశాడు. ఇప్పుడు ఇది తెగ వైరల్ గా మారింది.
అమేజింగ్ కాన్సెప్ట్
హరీష్ శంకర్ పోస్టుకు థ్యాంక్స్ చెప్తూ దేవిశ్రీ ప్రసాద్ పెట్టిన పోస్టు మరింత వైరల్ గా మారింది. ‘‘అమేజింగ్ కాన్సెప్ట్, మైండ్ బ్లోయింగ్ లిరిక్స్ కు హరీష్ శంకర్ సార్, ప్రియమైన చంద్రబోస్ కు ధన్యవాదాలు. ఆరా ఆఫ్ ఉస్తాద్ క్రియేట్ చేసేందుకు నన్ను ఇన్ స్పైర్ చేసిన మీ ఇద్దరిని ప్రేమిస్తున్నా’’ అని దేవిశ్రీ ప్రసాద్ పోస్టులో పేర్కొన్నాడు.
ఫ్యాన్స్ రియాక్షన్
ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి రెండో సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ హైప్ మామూలుగా లేదు, త్వరగా పాట రిలీజ్ చేయాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ గురించి
ఓజీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కల్యాణ్ హీరోగా చేస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. హరీష్ శంకర్ డైరెక్షన్ లో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లు. సత్యదేవ్, అషుతోష్ రాణా, నవాబ్ షా తదితరులు నటిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవి శంకర్ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను నిర్మించారు. ఇది మార్చి 26, 2026న రిలీజ్ కానుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


