బ్రేకింగ్.. ఈ ఓటీటీలోకే ఉస్తాద్ భగత్ సింగ్.. పవన్ కల్యాణ్ సినిమా డిజిటల్ రైట్స్ కు కళ్లు చెదిరే రేటు!
బ్రేకింగ్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అప్ కమింగ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీ పార్ట్ నర్ ఫిక్స్ అయింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు కళ్లు చెదిరే రేటు దక్కినట్లు తెలిసింది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్-డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ క్రేజీ కాంబినేషన్ ను రాబోతున్న సినిమా కోసం ఫ్యాన్స్, ఆడియన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు ఈ సినిమా ఓటీటీకి సంబంధించి బిగ్ అప్ డేట్ వచ్చింది. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్ నర్ ఫిక్స్ అయింది.

ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీ
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న అప్ కమింగ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ పై క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఇవాళ (జనవరి 16) నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించేసింది. ఇందుకోసం కళ్లు చెదిరే రేటు చెల్లించినట్లు తెలిసింది.
నెట్‌ఫ్లిక్స్ పండగ
నెట్‌ఫ్లిక్స్ పండగలో భాగంగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి వస్తున్నట్లు శుక్రవారం అనౌన్స్ చేశారు. ‘‘అనుమతి కోసం న్యాయం ఎదురు చూడదు. అతను కూడా అంతే. థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో నెట్‌ఫ్లిక్స్ లోకి రానుంది’’ అని నెట్‌ఫ్లిక్స్ ఎక్స్ లో అనౌన్స్ చేసింది.
ఓటీటీ డీల్
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తాన్ని చెల్లించినట్లు తెలిసింది. ఓజీ సినిమా సక్సెస్ తో పవన్ కల్యాణ్ రాబోయే మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీ రైట్స్ కోసం డిమాండ్ నెలకొంది. ఈ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల మధ్యలో డీల్ సెట్ చేసుకుందని టాక్.
ఓజీ సక్సెస్
పవన్ కల్యాణ్ ఓజీ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు. సుజీత్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ పవన్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ పైనా భారీ అంచనాలున్నాయి.
గతంలో హరీష్ శంకర్- పవన్ కల్యాణ్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు అదే కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అదిరిపోతుందని అంటున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీనికి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. 2026 ఏప్రిల్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


