మాస్ మహారాజా టైటిల్ ఇచ్చింది నేను.. అది తీసేయాలంటే నన్నడగాలి.. డైరెక్టర్‌గా జన్మ పునర్జన్మ ఇచ్చింది అతడే: హరీష్ శంకర్

రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తనకు డైరెక్టర్ గా జన్మ, పునర్జన్మ ఇచ్చింది రవితేజ అన్నే అని అతడు అనడం విశేషం.

Published on: Jan 11, 2026, 07:05:43 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రవితేజను అందరూ మాస్ మహారాజా అని ముద్దుగా పిలుచుకుంటారు. కానీ ఆ టైటిల్ ఇచ్చింది తానే అని డైరెక్టర్ హరీష్ శంకర్ చెప్పడం విశేషం. అంతేకాదు దానిని తీసేయాలంటే ముందు తనను అడగాలని అతడు అన్నాడు. భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ శనివారం (జనవరి 10) రాత్రి జరగగా.. దీనికి రవితేజ డైరెక్టర్లందరూ వచ్చారు.

మాస్ మహారాజా టైటిల్ ఇచ్చింది నేను.. అది తీసేయాలంటే నన్నడగాలి.. డైరెక్టర్‌గా జన్మ పునర్జన్మ ఇచ్చింది అతడే: హరీష్ శంకర్
మాస్ మహారాజా టైటిల్ ఇచ్చింది నేను.. అది తీసేయాలంటే నన్నడగాలి.. డైరెక్టర్‌గా జన్మ పునర్జన్మ ఇచ్చింది అతడే: హరీష్ శంకర్

హరీష్ శంకర్ స్పీచ్ వైరల్

రవితేజ ఈసారి సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో వస్తున్న విషయం తెలుసు కదా. కిశోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా జనవరి 13న రిలీజ్ కానుండగా.. ప్రీరిలీజ్ ఈవెంట్ శనివారం (జనవరి 10) జరిగింది. ఈ ఈవెంట్ కు రవితేజను డైరెక్ట్ చేసిన డైరెక్టర్లందరూ రావడం విశేషం. వీళ్లలో హరీష్ శంకర్, బాబీ, శివ నిర్వాణలాంటి వాళ్లు ఉన్నారు.

ఈ సందర్భంగా హరీష్ శంకర్ ఇచ్చిన స్పీచ్ వైరల్ అవుతోంది. ఈ సినిమా కోసం మాస్ మహారాజా అనే టైటిల్ ను తీసేయబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని, అయితే అది జరగాలంటే ముందు తనను అడగాలని అన్నాడు.

“ఈ సినిమాకు మాస్ మహారాజా తీసేయండి అని అన్నయ్య అన్నాడట. అసలు అన్నాడో లేడో తెలియదు కానీ సోషల్ మీడియాలో వచ్చింది. మాస్ మహారాజా అనే టైటిల్ పెట్టింది నేను.. దాని పేటెంట్ రైట్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి. దానిని తీసేయాలంటే ముందు నన్ను అడగాలి” అని హరీష్ శంకర్ అనడంతో రవితేజ పగలబడి నవ్వుతూ కనిపించాడు.

డైరెక్టర్‌గా జన్మ, పునర్జన్మ ఇచ్చాడు

ఈ సందర్భంగా హరీష్ శంకర్ కాస్త ఎమోషనల్ కూడా అయ్యాడు. తనకు డైరెక్టర్ గా జన్మ, పునర్జన్మ ఇచ్చింది రవి అన్నయ్యే అని చెప్పడం విశేషం. “ఇది నేను ప్రతిసారీ చెబుతూనే ఉంటాను. రోజూ అమ్మా అని పిలుస్తున్నామని పిలవడం మానేయలేము కదా. అలాగే ఇది కూడా. నాకు డైరెక్టర్ గా జన్మ పునర్జన్మ ఇచ్చింది మాస్ మహారాజ్. థ్యాంక్యూ అన్నయ్య. మా లాస్ట్ సినిమా సరిగా ఎంటర్టైన్ చేయలేకపోయింది. అలాగని ఇక్కడితో వదిలేయం. కచ్చితంగా రవితేజతో మరో బ్లాక్‌బస్టర్ తీస్తా” అని హరీష్ స్పష్టం చేశాడు.

పవన్ కల్యాణ్ తర్వాత రవితేజే

ఇక ఇదే సమయంలో పవన్ కల్యాణ్ తో రవితేజను పోల్చాడు హరీష్ శంకర్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఎప్పుడూ ఒకేలా ఉండే స్థితప్రజ్ఞత ఒకటి పవన్ కల్యాణ్ లో ఉంటే రెండోది రవితేజలోనే ఉందని అతడు అనడం విశేషం. మిరపకాయ్ లాంటి హిట్ ఇచ్చినా.. మిస్టర్ బచ్చన్ లాంటి ఫ్లాప్ ఇచ్చినా రవితేజ ఒకేలా ఉన్నాడని చెప్పాడు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More