సీనియర్ ఎన్టీఆర్ గెటప్‌తో కార్తి- రొమాన్స్, యాక్షన్, కామెడీతో అన్నగారు వస్తారు ట్రైలర్-రిలీజ్ చేసిన దర్శకుడు హరీష్ శంకర్

హీరో కార్తి నటించిన లేటెస్ట్ మూవీ అన్నగారు వస్తారు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించారు. సీనియర్ ఎన్టీఆర్ పేరుతో, ఆయన గెటప్‌తో కార్తి అలరించిన అన్నగారు వస్తారు ట్రైలర్‌ను డైరెక్టర్ హరీష్ శంకర్ రిలీజ్ చేశారు.

Dec 7, 2025, 10:49:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

స్టార్ హీరో కార్తి నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ "అన్నగారు వస్తారు". పొలిటికల్ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన అన్నగారు వస్తారు సినిమా ఈ నెల 12న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.

సీనియర్ ఎన్టీఆర్ గెటప్‌తో కార్తి- రొమాన్స్, యాక్షన్, కామెడీతో అన్నగారు వస్తారు ట్రైలర్-రిలీజ్ చేసిన దర్శకుడు హరీష్ శంకర్
సీనియర్ ఎన్టీఆర్ గెటప్‌తో కార్తి- రొమాన్స్, యాక్షన్, కామెడీతో అన్నగారు వస్తారు ట్రైలర్-రిలీజ్ చేసిన దర్శకుడు హరీష్ శంకర్

యాక్షన్ కామెడీ కథతో

అన్నగారు వస్తారు చిత్రాన్ని ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ బ్యానర్‌లో కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మించారు. యాక్షన్ కామెడీ కథతో దర్శకుడు నలన్ కుమారస్వామి తెరెకక్కించారు. కార్తీకి జోడీగా బ్యూటిఫుల్ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.

హరీష్ శంకర్‌తో ట్రైలర్ రిలీజ్

తాజాగా డిసెంబర్ 6న అన్నగారు వస్తారు మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియా ద్వారా "అన్నగారు వస్తారు" ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అన్నగారు వస్తారు ట్రైలర్‌పై హరీష్ శంకర్ ప్రశంసలు కురిపించారు.

ఎంగేజింగ్‌గా ఉందని

అన్నగారు వస్తారు ట్రైలర్ కంప్లీట్ ఎంగేజింగ్‌గా ఉందని, థియేటర్స్‌లో సినిమా చూడాలనే క్యూరియాసిటీ క్రియేట్ చేసిందని హరీశ్ శంకర్ అప్రిషియేట్ చేస్తూ.."అన్నగారు వస్తారు" సినిమా టీమ్‌కు తన బెస్ట్ విషెస్ అందించారు దర్శకుడు హరీష్ శంకర్.

సినిమాలు అంటే పిచ్చి

"అన్నగారు వస్తారు" ట్రైలర్ ఎలా ఉందో చూస్తే.. మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న సరదా అయిన పోలీస్ ఆఫీసర్ కార్తి. ఆయనకు బాల్యం నుంచే సినిమాలు అంటే పిచ్చి. దాంతో సినిమాతో మంచి అనుబంధం ఏర్పడుతుంది. పోలీస్ డిపార్ట్‌మెంట్ పట్ల ప్రజల్లో మర్యాద పెరగాలని సఫారీతో యూనిఫామ్ కుట్టించుకుంటాడు.

రియల్ హీరో అవసరమైనప్పుడు

హీరోయిన్‌ను కలిసినప్పుడు జాలీ టు మీట్ యూ అని రొమాంటిక్‌గా‌ పలకరిస్తాడు. మరోవైపు చేతివాటం చూపిస్తుంటాడు. అయితే సమాజానికి ఒక రియల్ హీరో అవసరమైనప్పుడు అన్నగారిలా అరంగేట్రం చేస్తాడు కార్తి.

అన్నగారిలా కార్తి

పోలీస్ ఆఫీసర్ కార్తి, అన్నగారిలా ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, సొసైటీ కోసం ఏం చేశారు అనేది ట్రైలర్‌లో ఆసక్తి కలిగించింది. కార్తి స్క్రీన్ ప్రెజెన్స్, కామెడీ, యాక్షన్, రొమాన్స్ ట్రైలర్‌లో ఆకట్టుకుంది. ఈ కమర్షియల్ హంగులకు తోడు అన్నగారి (సీనియర్ ఎన్టీఆర్) గెటప్ అదనపు ఆకర్షణగా నిలిచింది.

అన్నగారు వస్తారు నటీనటులు

థియేటర్‌లో ఎంజాయ్ చేయాల్సిన కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా "అన్నగారు వస్తారు" మూవీ ఉండబోతున్నట్లు ట్రైలర్‌తో తెలుస్తోంది. కాగా, అన్నగారు వస్తారు సినిమాలో కార్తి, కృతి శెట్టితోపాటు సత్యరాజ్, మధుర్ మిట్టల్, ఆనంద రాజ్, రాజ్ కిరణ్, శిల్పా మంజునాథ్, కరుణాకరణ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.