ఫిబ్రవరి 22న పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు పూనకాలే.. బిగ్ అప్ డేట్.. ఎప్పటికీ గుర్తుంటుందన్న డైరెక్టర్ హరీష్ శంకర్

ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి బిగ్ అప్ డేట్ వచ్చేసింది. ఇన్నాళ్లుగా బజ్ క్రియేట్ చేస్తున్న ఆరా ఆఫ్ ఉస్తాద్ రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్ ను మహాశివరాత్రి సందర్బంగా మేకర్స్ అనౌన్స్ చేశారు. 

Published on: Feb 16, 2026, 05:44:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇలాంటి పాట తన కెరీర్ లో ఇంతవరకూ వినలేదంటూ ఓ వైపు డైరెక్టర్ హరీష్ శంకర్.. ఇంత అద్భుతమైన పాట చేసే ఛాన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ ఇంకోవైపు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్.. ఇలా ఇద్దరూ కలిసి హైప్ పెంచేసిన సాంగ్ ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోని ఈ రెండో పాట రిలీజ్ ఎప్పుడూ? అనే క్యూరియాసిటీ పెరిగిపోయింది.

ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్ లో పవన్ కల్యాణ్ (x/MythriOfficial)
ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్ లో పవన్ కల్యాణ్ (x/MythriOfficial)

ఆరా ఆఫ్ ఉస్తాద్

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి సెకండ్ సాంగ్ రాబోతుంది. ఎట్టకేలకు ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ పాటను ఫిబ్రవరి 22న రిలీజ్ చేయబోతున్నట్లు మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం (ఫిబ్రవరి 15) రాత్రి ఉస్తాద్ భగత్ సింగ్ మేకర్స్ ప్రకటించారు. ఈ అనౌన్స్ మెంట్ తో సస్పెన్స్ కు తెరదించారు.

పవర్ ఫుల్

‘‘మనం ప్రేమించే మనిషి. మనం సెలబ్రేట్ చేసుకునే మనిషి. పవర్ ఫుల్ ఆంథెమ్ లో పవర్ స్టార్ ఆరా. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోని సెకండ్ సింగిల్ ఆరా ఆఫ్ ఉస్తాద్ ఫిబ్రవరి 22న రిలీజ్ అవుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది’’ అని మైత్రి మూవీ మేకర్స్ ఎక్స్ లో పోస్టు చేసింది.

డైెరెక్టర్ రియాక్షన్

మైత్రి మూవీ మేకర్స్ పోస్టును షేర్ చేస్తూ ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ పోస్టు పెట్టాడు. ‘‘ఈ సాంగ్ ఎప్పటికీ గుర్తుంటుంది. దీన్ని ఎప్పటికీ సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటారు. కల్ట్ బాయ్స్ మీ వెయిటింగ్ కు ఇది వర్త్ లాంటిదే’’ అని హరీష్ శంకర్ క్యాప్షన్ రాసుకొచ్చాడు.

పాటతో హైప్

ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి రిలీజైన ఫస్ట్ సాంగ్ ‘దేఖ్ లేంగే సాలా’ కు అదిరే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడిక ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ అంటూ సెకండ్ సాంగ్ రాబోతుంది. డైరెక్టర్ హరీష్ శంకర్ కొన్ని రోజుల నుంచి ఈ పాటకు హైప్ ఇస్తున్నాడు. ఇలాంటి పాటను ఇంతకుముందు వినలేదని రీసెంట్ గా లిరిసిస్ట్ చంద్రబోస్ తో కలిసి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ను ఎత్తుకున్న పిక్ పోస్టు చేశాడు.

ఉస్తాద్ భగత్ సింగ్ గురించి

గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్-పవన్ కల్యాణ్ కాంబినేషన్లో వస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాలో మరోసారి పోలీస్ గా పవన్ కల్యాణ్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లు. మార్చి 26, 2026న ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కానుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More