మహాశివరాత్రి స్పెషల్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న నాగబంధం టీజర్.. మహేష్ బాబు చేతుల మీదుగా రిలీజ్.. విజువల్ వండర్
మహాశివరాత్రి సందర్భంగా రిలీజైన నాగబంధం టీజర్ అదిరిపోయింది. విజువల్ వండర్ గా ఈ మూవీ కనిపిస్తోంది. నాగబంధం కథతో తెరకెక్కుతున్న ఈ మూవీపై టీజర్ తో అంచనాలు పెరిగిపోయాయి. ఈ టీజర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశాడు.
మహాశివరాత్రి స్పెషల్ గా గూస్ బంప్స్ తెప్పించే విజువల్స్ తో, అదిరే కాన్సెప్ట్ తో ‘నాగబంధం’ మూవీ టీజర్ వచ్చేసింది. విజువల్ వండర్ గా ఉన్న ఈ టీజర్ అలరిస్తోంది. నాగ బంధం చుట్టూ అల్లుకున్న కథతో భారీ ప్రాజెక్ట్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. దీన్ని అభిషేక్ నామా డైరెక్ట్ చేస్తున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ఇవాళ టీజర్ రిలీజ్ చేశారు.

నాగబంధం టీజర్
ఇవాళ (ఫిబ్రవరి 15) మహాశివరాత్రి సందర్భంగా రిలీజ్ చేసిన నాగబంధం టీజర్ అదిరిపోయింది. విజువల్స్ మాత్రం నెక్ట్స్ లెవల్ లో ఉన్నాయి. అనంత పద్మనాభ స్వామి గుడి నిధుల నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. హిమాలయాలతో మొదలైన టీజర్.. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ లాంటి గుడి సీన్ తో ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఆశతో ఓ రాక్షసుడి లాంటి వ్యక్తి భక్తులను చంపేస్తాడు.
శివుడి ఎంట్రీ
అప్పుడు శివుడి ఎంట్రీ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ప్రజెంట్ జెనరేషన్, మైథాలజీ మధ్య రిలేషన్ తో ఈ టీజర్ ను ముడిపెట్టినట్లు కనిపిస్తోంది. ఇందులో శివుడిగా విరాట్ కర్ణ లుక్ అదిరిపోయింది. ఈ సినిమాలో విరాట్ కర్ణ, జగపతి బాబు, నభా నటేశ్, ఐశ్వర్యా మీనన్ తదితరులు నటిస్తున్నారు. అభిషేక్ నామా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ 2026 సమ్మర్ లో రిలీజ్ కానుంది.
మహేష్ చేతుల మీదుగా
నాగబంధం టీజర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశాడు. ‘‘నాగబంధం ప్రపంచం అద్భుతంగా కనిపిస్తోంది. త్వరలోనే దీన్ని ఎక్స్ పీరియన్స్ చేయడానికి ఎదురు చూస్తున్నా’’ అని ఎక్స్ లో మహేష్ బాబు ఈ టీజర్ ను పోస్ట్ చేశారు.
రియాక్షన్స్ ఇవే
నాగబంధం టీజర్ అదిరిపోయిందనే కామెంట్లు వస్తున్నాయి. వందల కోట్ల బడ్జెట్ పెట్టి నాసిరకం వీఎఫ్ఎక్స్ తో సినిమాలు చేస్తున్న మేకర్స్.. నాగబంధం టీజర్ చూసి నేర్చుకోవాలని సోషల్ మీడియాలో కౌంటర్లు వేస్తున్నారు. ఈ మూవీ ఆధ్యాత్మిక, ఫాంటసీ థ్రిల్లర్ గా థియేటర్లకు రాబోతుంది. ఈ టీజర్ పై మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
థియేటర్లో ఈ విజువల్ ట్రీట్ ను ఎక్స్ పీరియన్స్ చేసేందుకు సినీ లవర్స్ ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నామని కామెంట్లు చేస్తున్నారు. నాగబంధం, నిధులు, అంతుచిక్కని రహస్యాలతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. పెదకాపు చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న విరాట్ ఈ నాగబంధం మూవీతో మరో రేంజ్ కు వెళ్లడం ఖాయమని అంటున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


