రష్మికను గాలి పిల్ల అని పిలిచిన జగపతి బాబు.. ఎంగేజ్‌మెంట్ రింగ్ చూపించిన నేషనల్ క్రష్.. చాలా ఇంపార్టెంట్ అంటూ..

రష్మిక మందన్నా ఇప్పుడో టాక్ షోకి వచ్చింది. జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకి వచ్చిన ఆమె తన ఎంగేజ్‌మెంట్ రింగు చూపించడంతోపాటు చాలా ఇంపార్టెంట్ అంటూ సిగ్గు పడింది. ఈ ఎపిసోడ్ ఈ వారమే స్ట్రీమింగ్ కానుంది.

Published on: Nov 3, 2025, 15:44:22 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నేషనల్ క్రష్, ఇప్పుడు ది గర్ల్‌ఫ్రెండ్ మూవీతో వస్తున్న రష్మిక మందన్నా.. తాజాగా ఓ టాక్ షోలో మెరిసింది. జీ తెలుగు, జీ5 ఓటీటీలో వచ్చే జగపతి బాబు సెలబ్రిటీ టాక్ షో జయమ్ము నిశ్చయమ్మురా షోకి రష్మిక వచ్చిన ప్రోమోను తాజాగా ఆ ఓటీటీ రిలీజ్ చేసింది. ఈ ప్రోమో ఆసక్తికరంగా సాగింది.

రష్మికను గాలి పిల్ల అని పిలిచిన జగపతి బాబు.. ఎంగేజ్‌మెంట్ రింగ్ చూపించిన నేషనల్ క్రష్..  చాలా ఇంపార్టెంట్ అంటూ..
రష్మికను గాలి పిల్ల అని పిలిచిన జగపతి బాబు.. ఎంగేజ్‌మెంట్ రింగ్ చూపించిన నేషనల్ క్రష్.. చాలా ఇంపార్టెంట్ అంటూ..

రష్మిక ఓ గాలి పిల్ల

రష్మిక ఈ షోకి రాగానే నీకు ఓ నిక్ నేమ్ పెట్టాను గాలి పిల్ల అని అని జగపతి బాబు అంటాడు. అది విని అయ్యయ్యో అని రష్మిక అంటుంది. ఇక ఆ తర్వాత వరుసగా విజయ్ పేరుతో ఉన్న హీరోల పేర్లు చెబుతూ ఆమెను ఆటపట్టించాడు. విజయ్ దేవరకొండ ఫ్రెండ్షిప్, విజయ్ సేతుపతి ఫ్యాన్, విజయ్ దళపతి ఆల్ టైమ్ ఫ్యాన్ అని జగపతి బాబు అంటాడు. అంటే విజయం, విజయ్ ని సొంతం చేసేసుకున్నావా మొత్తం అని అనడంతో ఆమె నవ్వుతుంది. అటు ప్రేక్షకులను చూసి కన్ను కొడుతుంది.

అవి ఇంపార్టెంట్ రింగ్స్

ఆ తర్వాత ఈ ప్రోమోలో చిన్ననాటి రష్మిక ఫొటోను చూపించారు. ఆ ఫొటో చూడగానే ఆమె తన చిన్నతనంలోకి వెళ్లిపోయింది. సూర్యవంశం మూవీలోని రోజావే సాంగ్ వింటూ తాను ఎలా నడిచేదానినో గుర్తు చేసుకుంటూ ఆమె చేసి చూపించింది.

ఇక టాపిక్ ఆమె పెట్టుకొచ్చిన రింగ్స్ పైకి మళ్లింది. ఆ రింగ్స్ ఏమైనా సెంటిమెంటా అని జగపతి బాబు అడుగుతాడు. అంటే ఇవి ఇంపార్టెంట్ రింగ్స్ అని ఆమె చెబుతుంది. వాటిలో ఒకటి ఫేవరెట్ రింగ్ అయి ఉంటుంది.. దాని వెనుక ఓ హిస్టరీ ఉంది అని జగపతి బాబు అనడంతో ఆమె నవ్వుతుంది.

వెంటనే ప్రేక్షకులు పెద్దగా అరవడంతో వాళ్లేదో గోల చేస్తున్నారు.. అదేంటో చూడండి అని అనగానే.. నేను దానిని ఎంజాయ్ చేస్తున్నాను అని ఆమె అంటుంది. ఈ ఎపిసోడ్ జీ5 ఓటీటీలోకి శుక్రవారం (నవంబర్ 7) రానుండగా.. జీ తెలుగులో ఆదివారం (నవంబర్ 9) రాత్రి 8.30 గంటలకు టెలికాస్ట్ కానుంది. ఈ ప్రోమోతోనే మేకర్స్ ఎపిసోడ్ పై ఆసక్తి పెంచేశారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More