మీ ప్రియమైన డాక్టర్ శ్రీలీల.. ఎంబీబీఎస్ పట్టా పొందిన హీరోయిన్ ఆనందం చూశారా? కంగ్రాచ్యులేషన్స్ అంటూ సెలబ్రిటీల కామెంట్లు

టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలల ఇప్పుడు డాక్టర్ శ్రీలీలగా మారింది. ఆమె ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. పట్టా పొందిన ఆనందాన్ని ఇన్ స్టా పోస్టులో పంచుకుంది. ఈ పోస్టుకు ఇతర హీరోయిన్ల కామెంట్లు వైరల్ గా మారాయి. 

Published on: Feb 14, 2026, 14:19:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ ముద్దు గుమ్మ శ్రీలీల ఇప్పుడు కేవలం హీరోయిన్ మాత్రమే కాదు.. డాక్టర్ కూడా. అవును.. ఈ బ్యూటీఫుల్ హీరోయిన్ డాక్టర్ పట్టా పొందింది. ఎంబీబీఎస్ డిగ్రీ కంప్లీట్ చేసింది. ఈ ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది ఈ భామ. ఈ పోస్ట్, దీనికి ఇతర హీరోయిన్లు చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఎంబీబీఎస్ పట్టా పొందిన తర్వాత ఫ్యామిలీతో శ్రీలీల
ఎంబీబీఎస్ పట్టా పొందిన తర్వాత ఫ్యామిలీతో శ్రీలీల

డాక్టర్ శ్రీలీల

మీ డాక్టర్ శ్రీలీల అంటూ తన సంతోషాన్ని ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది ఈ హీరోయిన్. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు మెడిసిన్ కూడా చదువుకున్న శ్రీలీల.. ముంబైలోని డివై పాటిల్ విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసింది. గ్రాడ్యుయేషన్ సెర్మనీ ఫొటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పంచుకుంది. తన కుటుంబం, బ్యాచ్ మేట్స్ తో కలిసి పోజులిచ్చింది.

ఈ ప్రయాణం

‘‘ఇదో మైలురాయి. తెలిసో తెలియకో మీరు భాగమైన ప్రయాణం ఇది. ఇదో పవిత్ర ప్రదేశం. నేను నేనుగా ఉండగలిగే ప్లేస్ ఇది. మీ అమ్మాయి తన ప్రామిస్ ను నిలబెట్టుకుంది. ఇది కేవలం ఒక డిగ్రీ గురించి కాదు. ఇది నా ఎదుగుదల, విశ్వాసం, కన్నీళ్లు, స్థితిస్థాపకత, మార్పు గురించి. నాకు అండగా నిలిచిన నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కు ధన్యవాదాలు’’ అని శ్రీలీల రాసుకొచ్చింది.

ప్రియమైన శ్రీలీల

‘‘మీరు నాకిచ్చిన సమయానికి, ప్రతి చిరునవ్వుకు, ప్రతి ప్రోత్సాహకానికి, ప్రతి ప్రార్థనకు మీకు రుణపడి ఉంటా. ఈ ఛాప్టర్ నన్ను మార్చింది. వినయాన్ని నేర్పింది. బలాన్ని ఇచ్చింది. నన్ను నేను మీకు మళ్లీ పరిచయం చేసుకుంటున్నా. మీ ప్రియమైన డాక్టర్ శ్రీలీల’’ అని శ్రీలీల పోస్టులో పేర్కొంది.

సెలబ్రిటీల కామెంట్లు

శ్రీలీల పోస్టు తెగ వైరల్ గా మారింది. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా కామెంట్లు తెగ కురిపిస్తున్నారు. ‘‘కంగ్రాచ్యులేషన్స్ డాక్టర్’’ అని రాశీ ఖన్నా కామెంట్ చేసింది. ప్రగ్యా జైస్వాల్ ఏమో రెడ్ కలర్ హార్ట్ ఎమోజీలు పెట్టింది. ‘‘అభినందనలు డాక్టర్ శ్రీలీల’’ అని కాజల్ అగర్వాల్ రియాక్టయింది. ‘‘కంగ్రాచ్యులేషన్స్ మై డియర్’’ అని ప్రియమణి పేర్కొంది. ఈషా అగర్వాల్, సయీ మంజ్రేకర్ తదితర సెలబ్రిటీ భామలు కూడా స్పందించారు.

శ్రీలీల సినిమాలు

2021లో వచ్చిన పెళ్లి సందD సినిమాతో తెలుగులో శ్రీలీల అడుగుపెట్టింది. అందం, డ్యాన్స్, యాక్టింగ్ తో సెన్సేషనల్ గా మారింది. బాలయ్య, రవితేజ, మహేష్ బాబు లాంటి అగ్ర హీరోలతో సినిమాలు చేసింది. ఇప్పుడు రిలీజ్ కు సిద్ధంగా ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కల్యాణ్ సరసన యాక్ట్ చేసింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More