డాక్టర్ శ్రీలీల.. ఆరేళ్లకు ఎంబీబీఎస్ పూర్తి చేసిన బ్యూటీ.. గ్రాడ్యుయేషన్ సెర్మనీలో ఇలా..

శ్రీలీల ఇప్పుడు డాక్టర్ శ్రీలీలగా మారింది. ఇటు నటన, అటు డాక్టర్ చదువుతో ఆరేళ్లుగా బిజీగా ఉన్న ఆమె.. మొత్తానికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంది. ఆ సెర్మనీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Published on: Feb 11, 2026, 16:18:10 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల తన చిరకాల కోరికను నెరవేర్చుకుంది. సినిమాల్లో బిజీగా ఉంటూనే వైద్య విద్యను పూర్తి చేసి, అధికారికంగా 'డాక్టర్' పట్టా అందుకుంది. ముంబైలో జరిగిన కాన్వొకేషన్ సెర్మనీలో ఆమె ఎంబీబీఎస్ (MBBS) డిగ్రీని అందుకుంది. ఆ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

డాక్టర్ శ్రీలీల.. ఆరేళ్లకు ఎంబీబీఎస్ పూర్తి చేసిన బ్యూటీ.. గ్రాడ్యుయేషన్ సెర్మనీలో ఇలా..
డాక్టర్ శ్రీలీల.. ఆరేళ్లకు ఎంబీబీఎస్ పూర్తి చేసిన బ్యూటీ.. గ్రాడ్యుయేషన్ సెర్మనీలో ఇలా..

డాక్టర్ శ్రీలీలగా ప్రమాణ స్వీకారం..

వరుస సినిమాలు, ఊపిరి సలపని షూటింగ్ షెడ్యూల్స్.. అయినా సరే చదువును ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు మన టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల. గత ఆరేళ్లుగా ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు ఎంబీబీఎస్ చదివిన ఆమె.. తాజాగా తన కలను సాకారం చేసుకుంది. ఫిబ్రవరి 10న ముంబైలోని డీవై పాటిల్ యూనివర్సిటీలో (DY Patil University) జరిగిన కాన్వొకేషన్ సెర్మనీలో ఆమె అధికారికంగా ఎంబీబీఎస్ డిగ్రీని అందుకుంది.

వైరల్ అవుతున్న వీడియోల్లో శ్రీలీల మెరూన్ రంగు గౌను (Convocation Robes) ధరించి వేదికపై డిగ్రీని స్వీకరించడం చూడవచ్చు. తన సహచరులతో కలిసి ఆమె 'హిపోక్రటిక్ ఓత్' (వైద్య వృత్తి ప్రమాణం) చేసింది. డిగ్రీ అందుకున్న ఆనందంలో వేదిక దిగగానే తన కుటుంబ సభ్యులను గట్టిగా హత్తుకుని ఎమోషనల్ అయింది. 'క్లాస్ ఆఫ్ 2020' బ్యాచ్‌తో కలిసి ఆమె డాక్టర్‌గా పట్టా పుచ్చుకున్నారు.

ఫ్యాన్స్ ఫిదా.. ఆ డిసిప్లిన్ గ్రేట్!

శ్రీలీల డెడికేషన్ చూసి అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. "మామూలుగా పాస్ మార్కులు తెచ్చుకోవడమే కష్టం. అలాంటిది ఇన్ని సినిమాలు చేస్తూ, స్టార్ హీరోయిన్‌గా ఉంటూ ఎంబీబీఎస్ ఎలా పూర్తి చేసింది?" అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఆమెకు ముగ్గురు దత్తత పిల్లలు ఉన్న విషయాన్ని కూడా కొందరు గుర్తు చేస్తూ, ఆమె బాధ్యతను కొనియాడుతున్నారు.

తల్లి బాటలో..

అమెరికాలో పుట్టి బెంగళూరులో పెరిగిన శ్రీలీల తల్లి స్వర్ణలత కూడా ప్రముఖ గైనకాలజిస్ట్. తల్లి స్ఫూర్తితోనే శ్రీలీల వైద్య వృత్తిని ఎంచుకుంది. 'పెళ్లి సందD'తో తెలుగు తెరకు పరిచయమైన శ్రీలీల.. ధమాకా, భగవంత్ కేసరి, గుంటూరు కారం వంటి చిత్రాలతో స్టార్డమ్ తెచ్చుకుంది. ఇటీవల 'పుష్ప-2'లో 'కిస్సిక్' సాంగ్‌తో మాస్ ఆడియెన్స్‌ను ఉర్రూతలూగించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన 'ఉస్తాద్ భగత్ సింగ్', హిందీలో కార్తీక్ ఆర్యన్‌తో ఒక సినిమా, అలాగే ధనుష్‌తో మరో సినిమా చేస్తూ బిజీగా ఉంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More