పడటం తప్పు కాదు.. కానీ! కెరీర్ లో బ్యాడ్ టైమ్ పై విష్వక్ సేన్ వైరల్ కామెంట్స్.. మీ ప్రేమ తగ్గలేదంటూ!

టాలీవుడ్ లో ఒక్క హిట్ కోసం వెయిట్ చేస్తున్న యంగ్ హీరోల్లో విష్వక్ సేక్ ఒకరు. ఇప్పుడా హిట్ కోసం రూట్ మార్చి కామెడీ ఎంటర్ టైనర్ గా ఫంకీ చేశాడు. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో కెరీర్ లో తన బ్యాడ్ టైమ్ పై, లైలా మూవీపై విష్వక్ కామెంట్లు వైరల్ గా మారాయి.  

Feb 12, 2026, 11:18:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ ‘ఫంకీ’తో థియేటర్లకు రాబోతున్నాడు విష్వక్ సేన్. వరుస ఫ్లాప్ ల తర్వాత అతను చేసిన కామెడీ మూవీ ఇది. ఫిబ్రవరి 13న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రి రిలీజ్ ఈవెంట్లో విష్వక్ సేన్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.

విష్వక్ సేన్ కామెంట్లు (x/SitharaEnts)
విష్వక్ సేన్ కామెంట్లు (x/SitharaEnts)

విష్వక్ సేన్ కామెంట్లు

ఒక్క హిట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న టాలీవుడ్ హీరోల్లో విష్వక్ సేన్ ఒకరు. వరుసగా సినిమాలు చేస్తున్నా, కొత్త ప్రయోగాలు చేసినా అతనికి మాత్రం సక్సెస్ దక్కడం లేదు. ఇప్పుడు కామెడీ ఎంటర్ టైనర్ ఫంకీతో ఆ నిరీక్షణకు ఎండ్ కార్డు వేయాలనుకుంటున్నాడు. ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లో విష్వక్ సేన్ కామెంట్లు వైరల్ గా మారాయి.

పడటం తప్పు కాదు

ఖమ్మంలో నిర్వహించిన ఫంకీ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లో విష్వక్ సేన్ మాట్లాడాడు. తన కెరీర్ లోని బ్యాడ్ టైమ్ గురించి ప్రస్తావించాడు. ‘‘లైఫ్ లో కొన్ని సార్లు చాలా మంది లో ఫీల్ అవుతారు. కానీ పడటం తప్పు కాదు. పడ్డాక లేచి నిలబడకపోవడం తప్పు. లాస్ట్ ఇయర్ ఇదే టైమ్ కు అంటే ఫిబ్రవరి 15కి చాలా బ్యాడ్ గా ఫీల్ అయ్యా. చాలా లో అనిపించింది’’ అని విష్వక్ సేన్ అన్నాడు.

ప్రేమ మారలేదు

‘‘కానీ టైమ్ చూడండి. కాలం మారుతూ ఉంటుంది. అదే బ్యూటీ. లాస్ట్ ఇయర్ ఉన్నది పర్మినెంట్ కాదు. ఇప్పుడు ఉన్నది పర్మినెంట్ కాదు. కానీ మీరిచ్చే ప్రేమ మారలేదు. మీరిచ్చే ఎనర్జీ మారలేదు. ఇప్పటికీ నేను ఇక్కడ నిలబడి ఉన్నా’’ అని విష్వక్ సేన్ తెలిపాడు. అనుదీప్ డైరెక్షన్ లో విష్వక్ సేన్ హీరోగా రాబోతున్న కామెడీ ఎంటర్ టైనర్ ఫంకీ. ఇందులో కాయదు లోహర్ హీరోయిన్.

లైలా గురించేనా?

ఫంకీ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లో విష్వక్ సేన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. లాస్ట్ ఇయర్ ఇదే టైమ్ తనకు బ్యాడ్ గా మిగిలిపోయిందని విష్వక్ అన్నాడు. 2025లో విష్వక్ హీరోగా నటించిన లైలా మూవీ ఫిబ్రవరి 14న రిలీజైంది. ఇందులో విష్వక్ లేడీ గెటప్ కూడా వేశాడు. కానీ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా బొక్కబోర్లా పడింది. దీంతో విష్వక్ చాలా ఫీల్ అయ్యాడని ఇప్పుడు అతని కామెంట్లు బట్టి చూస్తే అర్థమవుతోంది.

హిట్ కోసం

విష్వక్ సేన్ హిట్ కోసం తీవ్రంగా ట్రై చేస్తున్నాడు. 2020లో వచ్చిన హిట్ ది ఫస్ట కేస్ తర్వాత విష్వక్ కు సాలిడ్ హిట్ దక్కనే లేదు. పాగల్, అశోక వనంలో అర్జున కల్యాణం, ఓరి దేవుడా, ముఖచిత్రం, దాస్ కా దమ్కీ, గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ, లైలా సినిమాలు చేసినా విష్వక్ సేన్ కు వరుసగా ఫెయిల్యూర్స్ మిగిలాయి. మరి ఫంకీ మూవీతోనేనా అతను సక్సెస్ బాట పడతాడేమో చూడాలి.