Chiranjeevi: మ్యాజిక్ జరిగింది-ఉగాదికి అన్నీ శుభాలే-ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్‌పై చిరంజీవి-అయ్యబాబోయ్ అంటూ డైరెక్టర్
Chiranjeevi: ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో బాక్సాఫీస్ ను మరోసారి షేక్ చేసేందుకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రెడీ అవుతున్నాడు. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా ట్రైలర్ అదిరిపోయింది. ఈ ట్రైలర్ పై చిరంజీవి ట్వీట్, దానికి డైరెక్టర్ హరీష్ శంకర్ రియాక్షన్ వైరల్ గా మారాయి.
మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో బాక్సాఫీస్ వేటకు పవన్ కల్యాణ్ రెడీ అయిపోయాడు. అతను పోలీస్ గా నటించిన మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మార్చి 19న ఉగాది సందర్భంగా ఈ సినిమా థియేటర్లకు రాబోతుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ మూవీ ట్రైలర్ అదిరిపోయింది. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ ట్రైలర్ పై ప్రశంసలు కురిపించారు.

చిరంజీవి ట్వీట్
తమ్ముడు పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ట్రైలర్ కు అన్నయ్య చిరంజీవి ఫిదా అయ్యారు. ట్వీట్ చేసి మరీ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
‘‘మ్యాజిక్ జరిగింది.. ముహూర్తం కుదిరింది.. ట్రైలర్ అదిరింది.. ఉగాదికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో అన్నీ శుభాలే. డియర్ కల్యాణ్ బాబు, హరీష్ శంకర్, మొత్తం ఉస్తాద్ భగత్ సింగ్ టీమ్ కు అభినందనలు’’ అని చిరు ఎక్స్ లో పోస్టు చేశారు.
డైరెక్టర్ రియాక్షన్
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ను పొగుడుతూ చిరంజీవి పెట్టిన ట్వీట్ కు డైరెక్టర్ హరీష్ శంకర్ రియాక్షన్ వైరల్ గా మారింది.
‘‘అయ్యబాబోయ్... అన్నయ్య !! మీ టైమింగ్, రైమింగ్ చూస్తుంటే మీకు ట్రైలర్ ఏ రేంజులో నచ్చిందో నాకర్థమైంది. మీరు ఔట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారని తెలిసింది. అయినా సరే వీలు చేసుకుని మా ట్రైలర్ చూసినందుకు, అభినందనలు తెలిపినందుకు నా ఆనందానికి అవధులు లేవు’’ అని హరీష్ శంకర్ పోస్టులో రాసుకొచ్చాడు.
మెగా ఆశీర్వాదం
‘‘మెగా ఆశీర్వాదం కూడా దొరికింది కాబట్టి ఇక మెరుపు వేగంతో దూసుకెళ్ల డమే. ఎందుకంటే.. మీరు ట్వీటు పెడితే.. హీటు పెరిగినట్టే!!" అని హరీష్ శంకర్ తన పోస్టులో పేర్కొన్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లు. ఉగాది సందర్భంగా ఈ మూవీ రిలీజ్ అవుతుంది.
ట్రైలర్ అదుర్స్
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ట్రైలర్ ను శనివారం (మార్చి 14) సాయంత్రం రిలీజ్ చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ గా పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్లో పవన్ కల్యాణ్ అదరగొట్టాడు. ఆ డైలాగ్ లు, యాక్షన్ సీన్స్ తో మూవీపై హైప్ మరింత పెరిగిపోయింది. ఈ సినిమాతో బాక్సాఫీస్ బద్దలు కొట్టడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. దీనికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. తమన్ బీజీఎం అందించాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


