Raashii Khanna: డైరెక్టర్ హరీష్ శంకర్ చెప్తేనే- ఉస్తాద్ భగత్ సింగ్ లో పొట్టి దుస్తులు- రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్

Raashii Khanna: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రాశీ ఖన్నా వచ్చేస్తోంది. ఈ సినిమాలో తన గ్లామర్ షోపై ఈ భామ షాకింగ్ కామెంట్లు చేసింది.  

Published on: Mar 14, 2026, 19:45:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాశీ ఖన్నా.. తెలుగు సినీ లవర్స్ కు పరిచయం అవసరం లేని పేరు ఇది. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన ఈ భామ ఆ తర్వాత టాలీవుడ్ లో స్టార్ గా ఎదిగింది. ఇప్పుడు తెలుగుతో పాటు హిందీ, తమిళ్ లో సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. ఉస్తాద్ భగత్ సింగ్ లో హీరోయిన్ గా నటించిన రాశీ ఖన్నా ఈ సినిమాలో గ్లామర్ రోల్ పై చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

రాశీ ఖన్నా (instagram-Raashii Khanna)
రాశీ ఖన్నా (instagram-Raashii Khanna)

డైెరెక్టర్ చెప్పారనే

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ప్రమోషన్లలో రాశీ ఖన్నా బిజీగా ఉంది. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో ఉస్తాద్ భగత్ సింగ్ లో గ్లామర్ షోపై షాకింగ్ కామెంట్లు చేసింది. పొట్టి దుస్తులు వేసుకోవాల్సి ఉంటుందని డైరెక్టర్ హరీష్ శంకరే చెప్పాడని వెల్లడించింది.

‘‘సినిమాలో హీరోకు ఎలివేషన్ ఎలా ఇవ్వాలి? గ్లామర్ ఎలా చూపించాలి? అనేది డైరెక్టర్ హరీష్ శంకర్ కు తెలుసు. ఈ మూవీలో గ్లామర్ కావాలని నాకు క్లియర్ గా చెప్పారు. షార్ట్స్, స్కర్ట్స్ లాంటివి వేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆయన విజన్ నమ్మి నేను ఓకే చెప్పా’’ అని రాశీ ఖన్నా పేర్కొంది.

గ్లామరస్ గా రాశీ ఖన్నా

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో రాశీ ఖన్నా ఫుల్ గ్లామరస్ గా కనిపించబోతుంది. పాటలు, ట్రైలర్ లో ఆ విషయంపై ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు రాశీ ఖన్నా కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో రాశీ ఖన్నాతో పాటు మరో హీరోయిన్ గా శ్రీలీల కూడా నటించింది.

కంఫర్ట్ ఉన్న బట్టలు

ఈ మధ్య హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్ పై కాంట్రవర్సీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కంఫర్ట్ ఉన్న దుస్తులు వేసుకుంటే తప్పేముందని రాశీ ఖన్నా ప్రశ్నించింది. సౌకర్యంగా ఉన్న బట్టలు వేసుకుంటున్నానని తెలిపింది.

ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్

పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రెండో మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. వీళ్ల కాంబినేషన్లో గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 19న ఉగాది సందర్భంగా థియేటర్లకు రాబోతుంది.

ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ఇవాళ (మార్చి 14) రిలీజైంది. పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్లో పవన్ మరోసారి అదరగొట్టాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఫ్యాన్స్ కు ట్రీట్ లా మూవీ ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More